Skin-to-skin contact not essential for POCSO offence: SC పోస్కో చట్టంలో సుప్రీంకోర్టు సంచలన తీర్పు

Skin to skin contact not essential for pocso offence supreme court

Supreme Court verdict on skin-to-skin contact, Supreme Court verdict sexual assault, POCSO court verdict on sexual assault, Bombay High Court controversial ruling on POCSO, Supreme Court, sexual assault, verdict, skin-to-skin contact, POCSO court verdict, Bombay High Court, controversial ruling, POCSO Act, Maharashtra, crime

A Bench of Justices UU Lalit, S Ravindra Bhat and Bela M Trivedi set aside the controversial Bombay High Court judgment that held that groping a minor's breast without "skin to skin contact" cannot be termed as sexual assault as defined under the Protection of Children from Sexual Offences (POCSO) Act.

బాంబే హైకోర్టు తీర్పు కొట్టివేత.. పోస్కో చట్టంలో మెలికలు వద్దని ‘సుప్రీం’ స్పష్టం

Posted: 11/18/2021 07:16 PM IST
Skin to skin contact not essential for pocso offence supreme court

చిన్నారి బాలికలను కామవాంఛతో తాకితేనే అది లైంగిక వేధింపుల కిందకు వస్తుందని సంచలన తీర్పును వెలువరించిన బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కొట్టేసింది. నిందితుడు ఓ బాలిక శరీరాన్ని నేరుగా తాకనప్పుడు (స్కిన్ టు స్కిన్) అది పోక్సో చట్టం ప్రకారం లైంగిక వేధింపుల కిందకు రాదన్న హైకోర్టు తీర్పును సుప్రీం కొట్టివేస్తూ, వస్త్రాల మీది నుంచి తాకినా దానిని లైంగిక వేధింపులగానే పరిగణించాలని తేల్చి చెప్పింది. బాలికపై లైంగిక వేధింపుల కేసులో బాంబే హైకోర్టు పోక్సో చట్టానికి వక్రభాష్యం చెప్పేలా తీర్పునిచ్చిందని పేర్కొంది.

చట్టాలు స్పష్టంగా ఉన్నప్పుడు నిబంధనల పేరిట కోర్టులు గందరగోళానికి తెరలేపకూడదని జస్టిస్ యు.యు. లలిత్ నేతృత్వంలోని ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. చిన్నారి బాలికలపై లైంగిక వేధింపుల నుంచి రక్షించడమే పోక్సో చట్టం ఉద్దేశమని, అత్యాచారం చేయాలన్న దురుద్దేశంతో బాలికను నిందితుడు వస్త్రాలపై నుంచి తాకినా దానిని నేరం కిందే పరిగణించాలని స్పష్టం చేసింది. నిందితుడు శరీరాన్ని నేరుగా తాకాడా? లేదా? అన్న దానిపై చర్చ పెట్టడం సరికాదని పేర్కొంది. నిందితుడిని నిర్దోషిగా ప్రకటించిన బాంబే హైకోర్టు తీర్పును కొట్టివేసింది.

ఈ కేసు పూర్వాపరాల్లోకి వెళ్తే.. 2016లో సతీశ్ అనే వ్యక్తి బాధిత బాలికకు పండు ఇస్తానని ఆశచూపి తన ఇంటికి తీసుకెళ్లాడు. బాలిక ఛాతీని తాకి దుస్తులు విప్పేందుకు ప్రయత్నించాడు. బాలిక కేకలు వేయడంతో ఆమె తల్లి పరుగున వచ్చింది. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. సెషన్స్ కోర్టు విచారించి.. సతీశ్ ను దోషిగా తేల్చింది. మూడేళ్ల జైలు శిక్షను విధించింది. తీర్పును సతీశ్ .. బాంబే హైకోర్టులో సవాల్ చేశాడు.

విచారించిన నాగ్ పూర్ బెంచ్.. దుస్తులపై నుంచి ఒంటిని తాకినంత మాత్రాన దానిని లైంగిక వేధింపులుగా భావించలేమంటూ మహిళా న్యాయమూర్తి జస్టిస్ పుష్ప గనేడివాలా తీర్పునిచ్చారు. నిందితుడిని నిర్దోషిగా పేర్కొంటూ శిక్షను రద్దు చేశారు. దీనిపై బాలల హక్కుల కార్యకర్తలు, న్యాయ నిపుణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తీర్పును రివర్స్ చేయాలని అభ్యర్థిస్తూ అటార్నీ జనరల్ తో పాటు మహిళా కమిషన్ సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. తాజాగా బాంబే హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు కొట్టేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles