‘Come Out With Community Kitchen Scheme’: SC To Centre ‘ఇదే చివరి అవకాశం.. 3 వారాలే గడువు’: కేంద్రానికి సు్ప్రీం వార్నింగ్

Supreme court asks centre to come out with model community kitchen scheme

central government, community kitchen scheme, justice hima kohli, CJI Justice nv ramana, justice AS Bopanna, supreme court, States

The Supreme Court asked the Centre to come out with some policy decisions with regard to implementation of the Community Kitchen Scheme by taking into consideration other similar schemes relating to the community kitchen which are already in operation in different states.

‘ఇదే చివరి అవకాశం.. 3 వారాలే గడువు’: కేంద్రానికి సు్ప్రీం వార్నింగ్

Posted: 11/17/2021 02:37 PM IST
Supreme court asks centre to come out with model community kitchen scheme

ప్రజా సంక్షేమం ప్రభుత్వాలకు రాజ్యాంగపరమైన బాధ్యత అని.. ఈ నేపథ్యంలో ఆకలిచావులు లేని దేశాన్ని రూపోందించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వాలదేనని దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. దేశవ్యాప్తంగా కమ్యూనిటీ కిచెన్లపై ఏర్పాటు, నిర్వహణపై మూడువారాల్లోగా ప్రణాళిక రూపొందించి నివేదికలు అందజేయాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. ఇదే చివరి అవకాశమని కేంద్రాన్ని హెచ్చరించిన సర్వోన్నత న్యాయస్థానం.. ఇది దేశవ్యాప్త ప్రణాళిక అయి ఉండాలని అదేశాలు జారీ చేసింది. ఇందుకోసం రాష్ట్రాల అభిప్రాయాలు తీసుకోవాలని సూచించింది.

వివిధ రాష్ట్రాల్లో ఇప్పటికే అమలులో ఉన్న కమ్యూనిటీ కిచెన్‌లకు సంబంధించిన ఇతర సారూప్య పథకాలను పరిగణనలోకి తీసుకుని కమ్యూనిటీ కిచెన్ స్కీమ్ అమలుకు సంబంధించి కొన్ని విధానపరమైన నిర్ణయాలతో నివేదికలు రూపోందించుకుని రావాలని కేంద్ర ప్రభుత్వాన్ని అత్యున్నత న్యాయస్థానం అదేశించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని జస్టిస్ ఎఎస్ బోపన్న, జస్టిస్ హిమా కోహ్లీలతో కూడిన తిసభ్య ధర్మాసనం "ఆకలితో అలమటిస్తున్న ప్రజలకు ఆహారాన్ని అందించాలని, అకలిచావులు రహితంగా దేశాన్ని తయారు చేయాలని పేర్కోంది.  

సామాజిక వేత్తలు అనున్‌ ధావన్, ఇషాన్‌ ధావన్, కుంజన సింగ్‌ తదితరులు దాఖలు చేసిన పిటిషన్‌ను త్రిసభ్య ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా కేంద్ర వినియోగదారుల వ్యవహారాలశాఖ దాఖలు చేసిన అఫిడవిట్ పై ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. అఫిడవిట్‌ ను కార్యదర్శిస్థాయి అధికారితో కాకుండా కిందిస్థాయి అధికారితో రూపోందించారని.. ఇది అసంపూర్ణంగా దాఖలు చేశారని ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. మూడు వారాల్లోగా సమర్పించే అఫిడెవిట్ ను కార్యదర్శి స్థాయి అధికారితోనే దాఖలు చేయాలని న్యాయస్థానం అదేశించింది.

కమ్యూనిటీ కిచెన్ స్కీమ్‌ను అమలు చేయడానికి పాన్-ఇండియా విధానాన్ని రూపొందించడంపై కేంద్రం స్పందనపై అసంతృప్తిని వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు, రాష్ట్రాలతో సమావేశాన్ని నిర్వహించడానికి మూడు వారాల సమయం ఇచ్చింది. కోర్టు ఒకటి చెబితే మరొకటి అఫిడవిట్‌లో ఉంటోందని పేర్కొంది. ‘‘ఆకలి విషయంలో కేంద్రం శ్రద్ధ చూపుతానంటే రాజ్యాంగం, చట్టాలు అడ్డుచెప్పవు. ఇప్పటికే వాయిదాల మీద వాయిదాలు అవుతోంది. చివరి అవకాశంగా మూడు వారాల్లో సమావేశం నిర్వహించండి’ అని ధర్మాసనం పేర్కొంది. ఆకలి, పోషకాహార లోపాన్ని ఎదుర్కోవడానికి కమ్యూనిటీ కిచెన్‌ల కోసం ఒక పథకాన్ని రూపొందించడానికి కేంద్రానికి ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిల్‌ను కోర్టు విచారించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles