Microsoft India hiring freshers in Hyderabad బీటెక్, ఎంటెక్, ఎంఎస్సీ ఫ్రషర్స్ కు మైక్రోసాఫ్ట్ ఆఫర్

Microsoft india looking to hire freshers in hyderabad

Placement, Hyderabad, Freshers, Microsoft India, M.Tech, B.Tech, MS in C.Sc, R, Matlab, Scipy, Pandas, Weka, scripting languages, Perl, Python, Hadoop, Hbase, Pig or Mapreduce, Bigtable, AzureML, Data Scientist

From software engineers to data scientists, Microsoft India is looking to hire freshers in India. The US-based software giant that has its India headquarters in Hyderabad has over 8,000 employees across India.

బీటెక్, ఎంటెక్, ఎంఎస్సీ ఫ్రషర్స్ కు మైక్రోసాఫ్ట్ ఆఫర్: హైదరాబాద్లో ప్లేస్ మెంట్

Posted: 11/12/2021 06:18 PM IST
Microsoft india looking to hire freshers in hyderabad

ప్ర‌ఖ్యాత ఐటీ కంపెనీ మైక్రోసాఫ్ట్ హైద‌రాబాద్ లొకేష‌న్ కోసం ఫ్రెష‌ర్స్ నియామ‌కాల‌ను ప్రారంభించింది. అంత‌ర్జాతీయ ఐటీ సంస్థ అయిన మైక్రోసాఫ్ట్‌కు హైద‌రాబాద్‌లో పెద్ద ఆఫీసు ఉంది. ఇండియాకు ఇదే హెడ్ క్వార్ట‌ర్. ఇక్క‌డ కొన్ని వేల మంది మైక్రోసాఫ్ట్ ఉద్యోగులు ప‌నిచేస్తున్నారు. దేశ‌వ్యాప్తంగా 8 వేల మంది ఉద్యోగులు మైక్రోసాఫ్ట్‌లో ప‌నిచేస్తున్నారు.

సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఫ్రెష‌ర్స్ కోసం

తాజాగా ఫ్రెష‌ర్స్ కోసం నియామ‌కాల‌ను కంపెనీ చేప‌ట్టింది. మైక్రోసాఫ్ట్ ఆఫ్‌క్యాంప‌స్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ 2021 పేరుతో ఈ నియామ‌కాల‌ను చేప‌డుతోంది. హైద‌రాబాద్ లొకేష‌న్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ రోల్ కోసం రిక్రూట్‌మెంట్ నిర్వ‌హిస్తోంది. హైద‌రాబాద్‌తో పాటు బెంగ‌ళూరు, నోయిడా లొకేష‌న్ల‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఫ్రెష‌ర్ ఉద్యోగాల కోసం ఈ డ్రైవ్ చేప‌ట్టింది. ప్రాజెక్ట్ ప్లానింగ్‌, డిజైన్, ఇంప్లిమెంటేష‌న్‌లో అవ‌గాహ‌న ఉన్న ఫ్రెష‌ర్స్ ఈ ఉద్యోగానికి ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.

2022లో బీటెక్ లేదా ఎంటెక్ లేదా ఎంఎస్ డిగ్రీ(కంప్యూట‌ర్ సైన్స్‌) పూర్తి చేసేవాళ్లు క‌నీసం 7.5 / 10 సీబీపీఏ పాయింట్స్ సాధించిన వాళ్లు ఈ జాబ్‌కు అప్లై చేసుకోవ‌చ్చు. కోడింగ్‌లో కాస్త అనుభ‌వం ఉండి.. క్వాలిటీ, సింప్లిసిటీ, డ్యూర‌బిలిటీ, మెయిన్‌టెన‌బిలిటీ కోడ్ రాయ‌గ‌లిగితే చాలు. క‌మ్యూనికేష‌న్ స్కిల్స్ కూడా ప్ల‌స్‌. 6 నెల‌ల లోపు మైక్రోసాఫ్ట్ నిర్వ‌హించిన ఏ ఆఫ్ క్యాంప‌స్ లేదా ఆన్‌క్యాంప‌స్ డ్రైవ్‌లో పాల్గొని ఉండ‌కూడ‌దు.

డేటా సైంటిస్ట్ రోల్ కోసం

* సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ రోల్‌తో పాటు.. హైద‌రాబాద్‌, బెంగ‌ళూరు, నోయిడా లొకేష‌న్లలో డేటా సైంటిస్ట్ రోల్ కోసం కూడా మైక్రోసాఫ్ట్ నియామ‌కాలు ప్రారంభించింది.
* 2022లో బీటెక్ లేదా ఎంటెక్ లేదా ఎంఎస్ డిగ్రీ(కంప్యూట‌ర్ సైన్స్‌) లేదా క్వాంటిటేటివ్ ఫీల్డ్‌లో 7.5/10 సీజీపీఏతో పూర్తి చేసేవాళ్లు ఈ రోల్‌కు అర్హులు.
* ఇది డేటా సైంటిస్ట్ రోల్ కాబ‌ట్టి.. ఆర్ లేదా మాథ్‌ల్యాబ్ లేదా స్కిపీ లేదా పాండాస్ లేదా వెకా లేదా పెర్ల్, పైథాన్ లాంటి స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ మీద అనుభ‌వం ఉండాలి.
* హ‌డూప్ లేదా హెచ్‌బేస్ లేదా పిగ్ లేదా మ్యాప్‌రెడ్యూస్ లేదా బిగ్‌టేబుల్ లేదా అజుర్ ఎంఎల్ మీద అనుభ‌వం ఉంటే ఇంకా మంచిది.
* సీ ప్ల‌స్ ప్ల‌స్‌, సీ షాప్‌, డాట్ నెట్ గురించి అవ‌గాహ‌న ఉంటే రోల్‌కు ఇంకా ప్ల‌స్ అవుతుంది. మ‌రిన్ని వివ‌రాల‌ను careers.microsoft.com వెబ్‌సైట్‌లోకి వెళ్లి తెలుసుకోవ‌చ్చు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Placement  Hyderabad  Freshers  Microsoft India  M.Tech  B.Tech  MS in C.Sc  Data Scientist  

Other Articles