Bombay HC to Nawab Malik: Reply to defamation suit మంత్రికి ఎన్సీబి అధికారికి మధ్య మాటల యుద్దం

Your sister in law involved in drugs trade nawab malik asks sameer wankhede responds

Sameer wankhede, Nawab Malik, Mumbai High Court, Shah Rukh Khan, Aryan Khan, Arthur Raod Jail, Mulakaat, bail denied, Mumbai High Court, Narcotics Control Bureau (NCB), Aryan khan, BJP Leader Relative, Rishabh Sachdev, Mohit Kamboj, mumbai cruise drugs case, Sameer wankhede, shah rukh khan meet his son aryan khan, shah rukh khan aryan khan, Arthur Road jail Jail food, NCB court, mumbai cruise drugs case, cordelia drugs case, Shah Rukh Khan, Arbaaz Khan, Munmun Dhamecha, Gauri Khan, Crime

In a fresh attack on NCB’s Mumbai zonal director Sameer Wankhede, Maharashtra minister Nawab Malik on Monday asked if the officer’s sister-in-law was involved in “drug business” and claimed a case against her was pending in a Pune court.

ముంబై డ్రగ్స్ కేసు: నవాబ్ మాలిక్.. సమీర్ వాంఖేడ్.. మధ్య మాటల యుద్దం

Posted: 11/08/2021 07:21 PM IST
Your sister in law involved in drugs trade nawab malik asks sameer wankhede responds

ఎన్సీపీ నేత‌, మ‌హారాష్ట్ర మంత్రి న‌వాబ్ మాలిక్‌, నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్‌సీబీ) జోనల్‌ డైరెక్టర్‌ సమీర్‌ వాంఖెడే మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. సమీర్‌ భార్య సోదరి గతంలో డ్రగ్స్‌ కేసులో ఇరుక్కున్నారని ఆరోపిస్తూ తాజాగా మాలిక్‌ ట్వీట్‌ చేశారు. దీనికి తనదైన శైలిలో సమీర్‌ కౌంటర్‌ ఇచ్చారు. ‘గుడ్‌ వర్క్‌ మిత్రమా. కానీ ఒక మహిళ పేరును స్వప్రయోజనాల కోసం వాడుకోవడం ఎంత వరకు సమంజసం? నిజానికి, మేము పత్రికా ప్రకటనను జారీ చేసేటప్పుడు, మహిళల గౌరవాన్ని కాపాడటానికి వారి పేర్లు గోప్యంగా ఉంచుతాం.

ఇద్దరు పిల్లలు, కుటుంబం ఉన్న మహిళ పేరును ఇలా బహిరంగపర్చడం మీకు తగునా? మీపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆలోచిస్తున్నామ’ని సమీర్‌ పేర్కొన్నారు. సమీర్‌ వదిన హర్షదా దీననాథ్ రెడ్కర్‌ పేరు మాదక ద్రవ్యాల నిరోధక​ చట్టం కింద 2008లో నమోదైన కేసులో ఉందని నవాబ్‌ మాలిక్‌ వెల్లడించారు. ‘సమీర్ దావూద్ వాంఖెడే.. మీ వదిన హర్షదా దీననాథ్ రెడ్కర్ డ్రగ్స్ వ్యాపారంలో ఉన్నారా? ఆమె కేసు పుణె కోర్టులో పెండింగ్‌లో ఉన్నందున మీరు సమాధానం చెప్పాల’ని నవాబ్‌ మాలిక్‌ ట్వీట్‌ చేశారు.

2008 జనవరిలో ఈ కేసు నమోదైనప్పుడు తాను సర్వీస్‌లో కూడా లేనని సమీర్ వాంఖడే తెలిపారు.  2017లో క్రాంతి రెడ్కర్‌ను వివాహం చేసుకున్నట్లు చెప్పారు. అయితే తన సోదరి ఈ కేసులో బాధితురాలిగా ఉందని సమీర్‌ భార్య క్రాంతి రెడ్కర్‌ అన్నారు. ఈ కేసు కోర్టు పరిధిలో ఉన్నందున తాము ఎటువంటి వ్యాఖ్యలు చేయబోమని అన్నారు. నవాబ్‌ మాలిక్‌ను తన సోదరి చట్టపరంగా ఎదుర్కొంటారని చెప్పారు. అలాగే ఈ కేసుతో తన భర్తకు ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.

కాగా, న‌వాబ్ మాలిక్‌కు బాంబే హైకోర్టు చురకలు అంటించింది. కోర్టుకు వచ్చి సమాధానం చెప్పాలని ఆయనను ఉన్నత న్యాయస్థానం సోమవారం ఆదేశించింది. నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్‌సీబీ) జోనల్‌ డైరెక్టర్‌ సమీర్‌ వాంఖెడే తండ్రి ధ్యాన్‌దేవ్‌ వేసిన పరువు నష్టం దావా విచారణ సందర్భంగా ఈ ఆదేశాలు జారీ చేసింది. న‌వాబ్ మాలిక్‌ తమ కుటుంబ ప్రతిష్టకు భంగం కలిగించారంటూ ధ్యాన్‌దేవ్‌ పరువునష్టం దావా వేశారు. దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్‌ మాధవ్‌ జామ్‌ధార్‌ నేతృత్వంలోని వెకేషన్‌ బెంచ్‌.. అఫిడవిట్‌ ద్వారా సమాధానం ఇవ్వాలని మాలిక్‌ను ఆదేశించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Shah Rukh Khan  Aryan Khan  Sameer wankhede  Nawab Malik  Mumbai High Court  Mumbai  Crime  

Other Articles