Youth Dies After Downing 1.5-Liter Bottle Of Coke ప్రాణాలను హరిస్తున్న కూల్ డ్రింక్..

22 year old dies from gas after drinking coca cola in 10 minutes

22-year old man dies drinking coca-cola, 1.5 liters of Coca-Cola, Coca-Cola, Pneumatosis, abdominal bloating, cool drink, intestines, gas, flatulence, China, abdominal pain, 1.5 liter bottle, medical journal, Research in Hepatology and Gastroenterology, intestine, Gall blader, Pancreas, China, Crime

Farting is definitely not the worst thing that can happen when you have a lot of gas. In fact, farting may be the best thing. A case report published in the medical journal Clinics and Research in Hepatology and Gastroenterology. showed how gas build-up in your intestines can be silent and deadly. what happened after a 22-year old man in China drank 1.5 liters of Coca-Cola in just 10 minutes.

వామ్మో.. కూల్ గా ఉందని లాగిస్తే.. ప్రాణాలను హరిస్తున్న కూల్ డ్రింక్..

Posted: 11/06/2021 04:17 PM IST
22 year old dies from gas after drinking coca cola in 10 minutes

వాతావరణ వేడిగా ఉందని, ఉక్కపోస్తుందని అనేక మంది చట్టుకున్న కూల్ డ్రింక్ లాగిస్తారు. కొందరికి ఇది అలావాటు కూడా. అయితే వేసవిలో మాత్రం ఎండలో కాసేపు ఏ పనిచేసినా.. ఎక్కడికైనా వెళ్లిన వెంటనే నీడపట్టుకు చేరుతాం. లేదా చాలా దూరం వెళ్ళాల్సివస్తే.. మార్గమధ్యంలో ఓ చోట సేద తీరేందుకు అగగానే చట్టుకున్న ఓ కూల్ డ్రింక్ కు అడరిచ్చేస్తాం. అయితే అలా చేయడం అత్యంత ప్రమాదకరమని అంటున్నారు గ్రాస్టియోఎంట్రాలాజిస్టులు. చాలా వేడిగా ఉందని ఓ 22 ఏళ్ల యువకుడు కోకాకోలా కూల్ డ్రింక్ బాటిల్ తీసుకుని ఏకంగా లిటరున్న కూల్ డ్రింక్ ను పది నిమిషాల్లో లాగించేశాడు. తీరా చూస్తే ఆ తరువాత కొన్ని గంటల వ్యవధిలోనే అతను ప్రాణాలను కోల్పోయాడు.

చైనాకు చెందిన 22 ఏళ్ల యువకుడు గత నెలలో ఎండ వేడిని తట్టుకోలేక ఒకే సారి 1.5 లీటర్ల కోకాకోలా తాగాడు. ఐతే తదుపరి 6 గంటల్లోనే తీవ్రమైన కడుపునొప్పి, ఉబ్బరం సమస్యలు తలెత్తడంతో బీజింగ్‌లోని చావోయాంగ్‌ హాస్పిటల్‌కు అతన్ని తరలించారు. చికిత్స సమయంలో రక్తపోటు గణనీయంగా పడిపోయిందని, గుండె వేగంగా కొట్టుకుందని, ఊపిరి వేగం కూడా పెరిగిందని వైద్యులు తెలిపారు. ఇవన్నీ గమనించిన తర్వాత డాక్టర్లు చికిత్స ప్రారంభించారట.

క్లినిక్ అండ్ రీసెర్చ్ ఇన్ హెపటాలజీ అండ్ గ్యాస్ట్రోఎంటరాలజీ జర్నల్‌ ప్రచురించిన నివేదిక ప్రకారం.. శీతల పానీయాలు ఎక్కువగా తాగితే న్యుమాటోసిస్ సమస్య తలెత్తుతుంది. ఫలితంగా కడుపులో అధిక మోతాదులో గ్యాస్‌ ఉత్పత్తి అవుతుంది. ఇతని విషయంలో కూడా అదే జరిగింది. చికిత్స సమయంలో యువకుడి ఛాతీకి ఆక్సిజన్ సరఫరా తగ్గడంతో హెపాటిక్ ఇస్కీమియాకు గురయ్యాడు (అంటే లివర్ షాక్‌కు గురవ్వడం). ఫలితంగా అతనికి మరణం సంభవించిందని వైద్యులు తెలిపారు. ఐతే గ్యాస్ నుండి ఉపశమనం పొందటానికి వైద్యులు ప్రయత్నించినప్పటికీ 18 గంటల చికిత్స తర్వాత మరణించాడని నివేదిక తెల్పింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles