YSRC candidate Dasari Sudha retains Badvel assembly seat బద్వేలులో దాసరి సుధకు బ్రహ్మరథం.. స్థానం నిలుపుకున్న వైసీపీ!

Ysr congress dasari sudha wins by election to ap s badvel assembly seat

Badvel, Dasari sudha, YSRCP, by polls counting in andhra pradesh, Venkata Subbaiah, counting of Badvel by-polls, Badvel bypolls news, Badvel bypolls, YS Jagan, Andhra pradesh, Politics

The ruling YSR Congress party has retained the Badvel assembly seat, for which the bypolls were held on October 30, by securing a majority of 90,089 votes. Badvel assembly bypolls were necessitated following the death of sitting MLA G Venkata Subbaiah.

బద్వేలులో దాసరి సుధకు బ్రహ్మరథం.. స్థానం నిలుపుకున్న వైసీపీ!

Posted: 11/02/2021 02:58 PM IST
Ysr congress dasari sudha wins by election to ap s badvel assembly seat

అధికార వైసీపీ పార్టీకి కంచుకోటగా ఉన్న క‌డ‌ప జిల్లాలోని బ‌ద్వేల్ అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగిన ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు కొన‌సాగుతోంది. బద్వేలులో అది నుంచి అధికార పార్టీ తరపున బరిలో దిగిన దాసరి సుధ తన ప్రత్యర్థులపై అధిపత్యాన్ని కనబరుస్తూనే వుంది. అమెకు నియోజకవర్గంలో సానుభూతి వెల్లువెత్తింది. అమె ఆధిక్యం పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు నుంచే ప్రారంభమైంది. మొత్తంగా ఈ ఎన్నికలలో పోలైన ఓట్లు 1,46,545 ఉండ‌గా, వాటిలో వైసీపీ అభ్య‌ర్థికి రికార్డు స్థాయిలో 1,12,072 ఓట్లు ప‌డ్డాయి.

బీజేపీ అభ్య‌ర్థికి 21,661 ఓట్లు, కాంగ్రెస్ అభ్య‌ర్థికి 6,217, నోటాకు 3,629 ఓట్లు పోల‌య్యాయి. ఈ ఉప ఎన్నికలో అత్య‌ధిక మెజార్టీ సాధించి వైసీపీ అభ్య‌ర్థి డాక్ట‌ర్ దాస‌రి సుధ.. వైఎస్ జ‌గ‌న్ రికార్డును బ‌ద్ద‌లు కొట్టారు. సుధ 90,411 ఓట్ల మెజార్టీతో విజ‌యం సాధించారు. గ‌త అసెంబ్లీ   ఎన్నిక‌ల్లో వైఎస్ జ‌గ‌న్ 90,110 ఓట్ల మెజార్టీతో గెలుపొందిన విష‌యం తెలిసిందే. దీంతో జ‌గ‌న్ రికార్డును సుధ ఇప్పుడు అధిగ‌మించారు. గ‌త‌ ఎన్నిక‌ల్లో దాస‌రి సుధ‌ భ‌ర్త వెంక‌ట సుబ్బ‌య్య ఇదే బ‌ద్వేలు నుంచి 44,734 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.

* తొలి రౌండ్‌లో వైసీపీకి 10,478, బీజేపీకి 1688, కాంగ్రెస్‌కు 580 ఓట్లు వ‌చ్చాయి.
* రెండో రౌండ్‌లో వైసీపీకి 10,570, బీజేపీకి 2270, కాంగ్రెస్‌కు 634 ఓట్లు వ‌చ్చాయి.
* మూడో రౌండ్లో వైసీపికి 10184 ఓట్లు లభించగా, బీజేపికి 2305, కాంగ్రెస్ కు 598 ఓట్లు వచ్చాయి. ఈ రౌండ్ ముగిసేస‌రికి వైసీపీ 23,754 ఓట్ల ఆధిక్యంలో ఉంది.
* నాలుగో రౌండ్‌లో వైసీపీకి 9,867, బీజేపీకి 2241, కాంగ్రెస్‌కు 491 ఓట్లు వ‌చ్చాయి.
* ఐదో రౌండ్‌లో వైసీపీకి 11,783, బీజేపీకి 1797, కాంగ్రెస్‌కు 575 ఓట్లు వ‌చ్చాయి.
* ఆరో రౌండ్లో వైసీపికి 11,383 ఓట్లు లభించగా, బీజేపికి 1940, కాంగ్రెస్ కు 531 ఓట్లు వచ్చాయి. ఈ రౌండ్ ముగిసేస‌రికి వైసీపీ 50 వేల ఓట్ల ఆధిక్యంలో ఉంది.
* ఏడో రౌండ్‌లో వైసీపీకి 10,726, బీజేపీకి 1924, కాంగ్రెస్‌కు 841 ఓట్లు వ‌చ్చాయి.
* ఎనమిదవ రౌండ్‌లో వైసీపీకి 9691, బీజేపీకి 1964, కాంగ్రెస్‌కు 774 ఓట్లు వ‌చ్చాయి.
* తొమ్మిదవ రౌండ్‌లో వైసీపీకి 11354, బీజేపీకి 2839, కాంగ్రెస్‌కు 493 ఓట్లు వ‌చ్చాయి.
* పదవ రౌండ్‌లో వైసీపీకి 10,052, బీజేపీకి 1554, కాంగ్రెస్‌కు 449 ఓట్లు వ‌చ్చాయి.
* పదకొండవ రౌండ్‌లో వైసీపీకి 5139, బీజేపీకి 984, కాంగ్రెస్‌కు 223 ఓట్లు వ‌చ్చాయి.
* పన్నెండవ రౌండ్‌లో వైసీపీకి 483, బీజేపీకి 2270, కాంగ్రెస్‌కు 14 ఓట్లు వ‌చ్చాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles