Designer Sabyasachi Mukherjee junks mangalsutra ad after row మంత్రి హెచ్చరికలతో దిగొచ్చిన డిజైనర్.. యాడ్ తొలగింపు

Designer sabyasachi mukherjee follows dabur fabindia after bjp threats

Sabyasachi Mukherjee, Mangalsutra, Sabya Mangalsutra Ad, Designer Sabyasachi Mukherjee, intimate portrait, Hindu culture, obscene ad, controversy, Narottam Mishra, Sabyasachi Mukherjee Latest News, Sabyasachi Mangalsutra Latest New, Madhya Pradesh, Crime

Fashion designer Sabyasachi Mukherjee pulled promotional material for its mangalsutra collection after a Madhya Pradesh minister threatened to send the police after him. The mangalsutra advertisement by Sabyasachi's brand featured intimate portraits of women and men. After the designer shared these pictures, it sparked controversy as a section of social media users deemed it "against Hindu culture" and "obscene".

అమాత్యుడి హెచ్చరికలతో దిగొచ్చిన సవ్యసాచి.. మంగళసూత్రం యాడ్ తొలగింపు

Posted: 11/01/2021 02:59 PM IST
Designer sabyasachi mukherjee follows dabur fabindia after bjp threats

యాడ్ డిజైనర్లు మరీ బరి తెగిస్తున్నారు. దేశ సంస్కృతి, సంప్రదాయాలపై వారికి ఎలాంటి అవగాహన లేకుండా పోతోంది. ఎలాంటి వాటికి ఎక్కడ ప్రాముఖ్యత ఇవ్వాలో కూడా తెలియకుండా పోతోంది. పాశ్చాత మోజులో పడి.. అసభ్య దృశాలకు పవిత్రమైన వస్తువులకు ముడిపెట్టి ప్రకటనలు తీసున్నారు. దీంతో ఎవరికి వారు తమ తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇలాంటి సమయాల్లో వ్యతిరేకత మాత్రమే వ్యక్తం చేస్తే.. సరిపోదని.. వారికి ఉనికికే ప్రమాదం వస్తుందన్న హెచ్చరికలే పనిచేస్తామని నిరూపించారు మధ్యప్రదేశ్ హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా.

హోం మంత్రి నుంచి హెచ్చరికలు రావడం.. పోలీసులు కూడా ఆయన గురించి తిరగడంతో.. వెంటనే దిగివచ్చిన యాడ్ డిజైనర్ సవ్యసాచి ముఖర్జీ తన ప్రకటనను తక్షణం ఉపసంహరించుకున్నారు. హిందూ మహిళల తాము ఎంతో పవిత్రంగా భావించే మంగళసూత్ర ప్రకటనను అసభ్యంగా చిత్రీకరించి విమర్శలపాలయ్యాడు. ఈ ప్రకటన చూసిన నెటిజన్లు మంగళసూత్రం పవిత్రతను దెబ్బతీశారంటూ ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. దీంతో విషయం హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా దృష్టికి విషయం రాగానే ఆయనదీనిపై తీవ్రంగా స్పందించారు. 24 గంటల్లోగా ఈ ప్రకటనను ఉపసంహరించుకోకపోతే చట్టపరంగా ముందుకెళ్తానని హెచ్చరికలు జారీ చేశారు.

ఓ వైపు ట్రోలింగ్, మరోవైపు అమాత్యుని అల్టిమేటంతో దిగొచ్చిన సవ్యసాచి ముఖర్జీ ప్రకటనను ఉపసంహరించుకున్నారు. వారసత్వం, సంస్కృతిని కలగలిపి యాడ్ ను చిత్రీకరించామని, కానీ ఈ ప్రకటన సమాజంలోని ఓ వర్గాన్ని కించపరిచేలా ఉందన్న ఆరోపణలతో.. యాడ్‌ను ఉపసంహరించుకున్నామని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా సవ్యసాచి కంపెనీ వెల్లడించింది. ఈ ప్రకటనపై మంత్రి నరోత్తమ్ మిశ్రా మాట్లాడుతూ.. ఈ తరహా యాడ్ లపై గతంలోనూ హెచ్చరించామన్నారు. అయినా.. మంగళసూత్ర యాడ్ ను అసభ్యంగా చేయడంపై వ్యక్తిగతంగా హెచ్చరించినట్టు చెప్పారు. 24 గంటల్లోగా ఈ యాడ్ ను ఉపసంహరించుకోకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పానన్నారు.

సవ్యసాచి రూపొందించిన ఆ ప్రకటనలో కొంతమంది ఒంటరిగా ఉన్న మహిళలు మంగళసూత్రం ధరించారు. మరో దాంట్లో ఓ వ్యక్తితో శృంగార భంగిమల్లో అర్ధనగ్నంగా ఉన్న మహిళ మంగళసూత్రం ధరించింది. దీంతో మంగళసూత్రం పవిత్రను కించపర్చేలా ఉండడంతో వాటిపై నెట్ జనులు తీవ్రస్థాయిలో ట్రోల్ చేశారు. ఈ ప్రకటన హిందూ సంస్కృతి, సంప్రదాయాలకు వ్యతిరేకంగా ఉందని దుమ్మెత్తి పోశారు.విషయం అమాత్యుడి దృష్టికి వెళ్లడంతో ఆయన హెచ్చరికలతో డిజైనర్ దిగివచ్చి తన యాడ్ ప్రకటనను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles