TDP offices ransacked in Andhra by YSRCP టీడీపీ కార్యాలయాలపై దాడులు.. పట్టాభి ఇళ్లు ధ్వంసం

Videos of ysr congress supporters attacking opposition party go viral

TDP office, TDP spokes person, Pattabhi Ram, House vandalised, YSRCP workers, Pattabhi Ram, YSRCP, Jagan Mohan Reddy, Mangalagiri, visakhapatnam, Party Workers, Violence, Attacks, Viral videos, viral Photos, Telugudesam party, Mangalagiri, Andhra Pradesh, crime

Videos of rampaging activists of YSR Congress attacking the central party office of the opposition Telugu Desam Party at Mangalagiri, throwing stones at glasses and breaking furniture have gone viral in Andhra Pradesh. Videos and photos have also been shared widely on social media of the home of a TDP spokesperson Pattabhi Ram that was ransacked by YSRCP party workers.

ITEMVIDEOS: టీడీపీ కార్యాలయాలపై దాడులు.. పట్టాభి ఇళ్లు ధ్వంసం

Posted: 10/19/2021 09:33 PM IST
Videos of ysr congress supporters attacking opposition party go viral

ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పట్టాభి ఇంటిపై కొందరు దాడి చేశారు. అలాగే రాష్ట్రంలో పలుచోట్ల టీడీపీ కార్యాలయాలు, నేతల ఇళ్లపై కూడా దాడులు జరిగాయి. విజయవాడలో పట్టాభి ఇంటిపై దాడి చేసిన గుర్తుతెలియని దుండగులు సామగ్రి ధ్వంసం చేశారు. మంగళవారం ఉదయం ఒక మీడియా సమావేశంలో మాట్లాడిన పట్టాభి.. ప్రభుత్వంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రి నక్కా ఆనంద్‌బాబుకు విశాఖ నర్సీపట్నం పోలీసులునోటీసులు ఇవ్వడాన్ని తప్పుబట్టారు. ఈ క్రమంలో పోలీసులు, రాష్ట్రప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.

ఈ సమావేశంలో ఆయన మాటలను తప్పుపడుతూ టీడీపీ కార్యాలయాలు, నేతల ఇళ్లపై దాడులు చేసినట్లు తెలుస్తోంది. మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంపై కూడా కొందరు దుండగులు దాడి చేశారు. కార్యాలయం ఎదుట ఉన్న ప్రముఖుల కార్లను ధ్వంసం చేశారు. హిందూపురంలో టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ ఇంటిని చుట్టుముట్టేందుకు కూడా ప్రయత్నించినట్లు సమాచారం. పట్టాభిరామ్ నివాసంపై దాడి నేపథ్యంలో ఆయన కుటుంబ సభ్యులు స్పందించారు. ఈ సాయంత్రం 4.30 గంటల సమయంలో దాడి జరిగిందని తెలిపారు.


సుమారు 200 మంది వరకు తమ ఇంటిపైన దాడి చేశారని వివరించారు. గట్టిగా కేకలు వేస్తూ సామగ్రి ధ్వంసం చేశారని, పట్టాభి దొరికితే చంపేస్తామని హెచ్చరించారని కుటుంబ సభ్యులు ఆందోళన వెలిబుచ్చారు. కాగా, పెద్ద పెద్ద రాళ్లు తీసుకువచ్చిన దుండగులు పట్టాభి నివాసంలోని కారును, బైకును, అక్కడున్న ఫర్నిచర్ ను కూడా ధ్వంసం చేసినట్టు తెలుస్తోంది. విజయవాడలో పట్టాభి నివాసంపై దాడి, మంగళగిరి టీడీపీ ప్రధాన కార్యాలయం ధ్వంసంతో పాటు హిందూపురంలో నందమూరి బాలకృష్ణ ఇంటి ముట్టడి ఘటనలపై టీడీపీ అధినేత చంద్రబాబు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ దృష్టికి తీసుకెళ్లారు.

గవర్నర్ కు ఫోన్ చేసి రాష్ట్రంలో శాంతిభద్రతలకు భంగం వాటిల్లుతుందని వివరించారు. వైసీపీ నేతలు, కార్యకర్తలు తమపై దాడులు చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. మంగళగిరిలో పార్టీ ప్రధాన కార్యాలయం నేటి దాడిలో దెబ్బతిన్న వైనాన్ని చంద్రరబాబు స్వయంగా పరిశీలించారు. అనంతరం కేంద్ర హోంశాఖ వర్గాలతోనూ చంద్రబాబు మాట్లాడారు. వైసీపీ శ్రేణులు దాడులకు పాల్పడుతున్నాయంటూ, ఇవాళ్టి ఘటనలను కేంద్ర హోంశాఖ దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్రంలో పరిస్థితుల దృష్ట్యా కేంద్ర బలగాల సాయం కోరారు. కాగా, దీనిపై టీడీపీ వర్గాలు స్పందిస్తూ బలగాలను పంపించేందుకు కేంద్ర హోంశాఖ సానుకూలంగా స్పందించిందని వెల్లడించాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles