Rs 5 Soap Bars instead of iPhone worth Rs 53,000 ఐఫోన్ 12 ఆర్డర్ చేస్తే.. రెండు సబ్బుబిళ్లల డెలివరీ

Customer orders iphone 12 worth rs 53 000 gets soap bars instead

iphone 12, apple, nirma soap, flipkart, rs 53,000, Big Billion Days sale, Simranpal Singh, E-commerce, Crime

Online shopping can be tricky, however, one particular customer experienced this quite literally when he ordered an iPhone 12 from Flipkart worth Rs 53,000, and ended up getting only a Rs 5 bar of soap instead. The e-commerce giant had its Big Billion Days sale going on, and so, Simranpal Singh, a customer, placed the order thinking it was a great deal.

రూ.53 వేల ఐఫోన్ 12 ఆర్డర్ చేస్తే.. రెండు రూ.5 సబ్బుబిళ్లలు

Posted: 10/11/2021 05:09 PM IST
Customer orders iphone 12 worth rs 53 000 gets soap bars instead

ఈ-కామర్స్ వెబ్ సైట్ల ద్వారా ఆర్డర్ చేసిన వస్తువులు డెలివరీ జరిగే సమయంలో ఉత్కంఠతతో అనాలోచితంగా వాటిని తెరిచేకన్నా.. అత్యంత చాకచక్యంగా వ్యవహరించి.. మనం అర్డర్ ఇచ్చిన వస్తువే వచ్చిందా.? లేక మరోకటి వచ్చిందా.? అని తెలుసుకోవడం అత్యంత ముఖ్యం. చటుక్కున ఓటిపి చెప్పిసి.. డెలివరిని అందుకుని ఇంట్లో లోనికి వెళ్లి ఓపెన్ చేయాలని చూస్తే.. ఖరీదైన వస్తువులు రాక.. భారీ మొత్తంలోని మీ సోమ్ము కూడా చేజారిపోతుంది. తస్మాత్ జాగ్రత్త అని చాటి చెప్పే సంఘటన ఇది. ఇప్పటికే ఆన్ లైన్‌ లో చేసిన ఆర్డ‌ర్ కు బదులుగా వేరే అర్డర్లు వచ్చిన సందర్భాలు అనేకం.

ఇది కంపెనీ వారి తప్పిదమే అయినా.. జాగ్రత్తగా వ్యవహరించకపోతే.. జరిగే నష్టం మీకే అన్న విషయాన్ని మర్చిపోరాదు. ఇక డెలివరీలోనూ అనేక చేతులు మారే క్రమంలోనూ వస్తువులను తారుమారుచేసి.. ఏమీ ఎరగనట్టు కూడా కొందరు వ్యవహరిస్తుంటారు. ఏది జరిగినా.. నష్టాన్ని ఎదుర్కోవాల్సింది మాత్రం మీరే. అందుకనే ఖరీదైన డెలివరీలు వచ్చే సందర్భంలో అప్రమత్తత ఎంతైనా అవసరం. తాజాగా జరిగిన ఘటన ఈ కామర్స్ డెలివరీల విషయంలో ఎంత అప్రమత్తత అవసరమో అన్న విషయాన్ని చాటిచెబుతోంది. ప్లిఫ్ కార్ట్ లో ఓ యువ‌కుడు తనకెదురైన అనుభవాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకున్నాడు.

ఈ నెల 3 నుంచి ప్రారంభమైన బిగ్ బిలియన్ డే సేల్ లో గ్రేట్ డీల్ గా భావించిన యువకుడు దీని ద్వారా ఆపిల్ ఐఫోన్ 12ను ఆర్డ‌ర్ చేశాడు. అయితే అతనికి డెలివరీ రావడంతోనే కొంత ఉత్సాహంగానే దానిని అందుకున్నాడు. కానీ దాని బరువు చూసిన తరువాత అనుమానం కలిగింది. దీంతో డెలివరీ బాయ్ కి ఓటిపి చెప్పకుండా.. అతని సమక్షంలోనే ఆ ఫోన్ ఫ్యాక్ విప్పించాడు. అంతేకాదు.. ముందుజాగ్రత్త చర్యగా దానిని విప్పుతుండగా తన సెల్ ఫోన్ లో వీడియో రికార్డింగ్ కూడా చేశాడు. దీంతో దానిని తెరవంగానే యువకుడితో పాటు డెలివరీ బాయ్ కూడా విస్తుపోయారు. ఎందుకంటే అందులో ఐ ఫోన్ కు బ‌దులుగా రెండు నిర్మా స‌బ్బులు వచ్చాయి.

బిగ్ బిలియ‌న్ డేస్ సేల్ కింద ఓ యువ‌కుడు ప్లిఫ్‌కార్ట్‌లో రూ. 53 వేల విలువ చేసే ఆపిల్ ఐఫోన్ 12ను ఆర్డ‌ర్ చేశాడు. ఆర్డ‌ర్ యువ‌కుడి వ‌ద్ద‌కు రాగానే అతనికి అనుమానం వ‌చ్చింది. ఇక ఓటీపీ చెప్ప‌కుండానే ప్లిఫ్‌కార్ట్ డెలివ‌రీ బాయ్ స‌మ‌క్షంలోనే ఆ బాక్స్‌ను విప్పాడు. ఆ బాక్స్‌లో ఐఫోన్ 12కు బ‌దులుగా.. రూ. 5 విలువ చేసే రెండు నిర్మా స‌బ్బులు ఉండ‌టంతో షాక్‌కు గుర‌య్యారు. దీంతో బాధిత వ్య‌క్తి ప్లిఫ్‌కార్ట్ క‌స్ట‌మ‌ర్ కేర్‌కు ఫిర్యాదు చేశాడు. ఇది త‌మ త‌ప్పేన‌ని కొద్దిరోజుల‌కు ప్లిఫ్‌కార్ట్ యాజ‌మాన్యం అంగీక‌రించింది. ఇక ఆ యువ‌కుడి డ‌బ్బుల‌ను ప్లిఫ్‌కార్ట్ రీఫండ్ చేసింది. త‌న బ్యాంకు ఖాతాలో ఆ న‌గ‌దు జ‌మ అయిన‌ట్లు బాధిత యువ‌కుడు తెలిపాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : iphone 12  apple  nirma soap  flipkart  rs 53  000  Big Billion Days sale  Simranpal Singh  E-commerce  Crime  

Other Articles

Today on Telugu Wishesh