పాప్ సింగర్, బ్రేక్ డాన్సర్ మైకెల్ జాక్సన్ తెలియని వాళ్లు ఉండరు. ప్రస్తుతం ఆయన ఈ లోకంలో లేకున్నా.. ఆయన పాటలు, బ్రేక్ డ్యాన్స్ మూవ్ మెంట్స్ తో ఆయన ఇప్పటికీ ప్రజల్లో సజీవంగానే వున్నారు. ఇప్పటికీ ఆయన పాటలకు అభిమానులు డ్యాన్సులు వేస్తూ.. ఆయన డాన్స్ స్టెప్పులు వేస్తూ మైకెల్ ను స్మరించుకుంటూ వుంటారు. మరీ ముఖ్యంగా మైకెల్ జాక్సన్.. డేంజరస్ పాట ఎంత పాపులర్ అంటే దశాబ్దాలు గడుస్తున్నా.. ఇప్పటికీ ఈ పాటను కొందరు అభిమానులు ఆలపిస్తుంటారు. ఇక మరికోందరు ఈ పాటపై డాన్సులు కూడా వేస్తుంటారు.
డేంజరస్ పాటకు మైకెల్ జాక్సన్ వేసిన స్టెప్పులు చూస్తే పిచ్చెక్కిపోతుంది. అయితే అదే పాటను పెట్టుకుని ఓ మైకిల్ అభిమాని వేసిన స్టెప్పులు చూస్తే.. ఔరా అనాల్సిందే. మొదట్లో ఏదోలా అనిపించినా.. తరువాత చూస్తూ అమ్మ బత్తాయో అని అనాల్సిందే. మైకిల్ పాటకు క్రికెట్ ఆటకు జతకట్టి.. లోతులోంచి బయటకు వస్తున్నట్లుగా.. ఇలా చాలా వేరియేషన్స్ కనబరుస్తూ వేసిన డాన్స్ కు డాన్స్ మూవ్స్ తెలిసినవాళ్లే కాదు.. తెలియని వాళ్లు కూడా ఫిదా కావాల్సిందే. ఒక్క మాటలో చెప్పాలంటే.. ఎవరి సోత్తు కాదురా టాలెంటూ అని పాటను ఆలపించాల్సిందే.
ఈ వ్యక్తిని చూస్తూ నఎక్కడా డాన్స్ ప్రాక్టీసు నేర్చుకన్న వ్యక్తిగా కనిపించడం లేదు. కానీ తనలోని డాన్సర్ ను తన ఆకలి బాధను మార్చిపోయే క్రమంలోనే నేర్చుకున్నట్లు కనబడుతోంది. మైకెల్ జాక్సన్ ను మించిన స్టెపులతో అందరినీ అకట్టుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేయగా, ఈ వ్యక్తి డాన్స్ చూసి నెట్టిజనులు మైమరిచిపోతున్నారు. ఆ పాటకు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఫిదా కాని వాళ్లు లేరు. జనరేషన్లు మారిన.. ఆ పాటకు ఉన్న క్రేజ్ కూడా తగ్గడం లేదు.
1991 లో రిలీజ్ అయిన డేంజరస్ ఆల్బమ్.. ప్రపంచ వ్యాప్తంగా అప్పట్లో రికార్డ్ సృష్టించింది. పాప్ సింగర్ మైకెల్ నుంచి వచ్చిన ఎనిమిదో ఆల్బమ్ అది. తాజాగా ఆ పాటకు ఓ వ్యక్తివేసిన డ్యాన్స్ చూస్తే.. మైకెల్ జాక్సన్ మళ్లీ పుట్టాడా అనిపిస్తుంది. ఇక కొందరైతే ఇతగాడిని మైఖిల్ జాక్సన్ ఆత్మ ఆవహించి ఉంటుందని కూడా కామెంట్లు పెడుతున్నారు. సూపర్ గా డ్యాన్స్ చేస్తున్నాడు. ఈ వ్యక్తికి ఎవరైనా కొరియోగ్రాఫర్ గా అవకాశాలు ఇవ్వండి. మంచి భవిష్యత్తు ఉంది అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
The Ghost Of Michael Jackson lives within him. pic.twitter.com/l7DDGGyiXV
— Kaveri (@ikaveri) September 29, 2021
(And get your daily news straight to your inbox)
Jun 24 | తిరుగుబాటు బావుటా ఎగురవేసిన ఎమ్మెల్యేలపై గత కొన్ని రోజులుగా ఎలాంటి వ్యాఖ్యలు చేయని శివసేన చీఫ్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ఇవాళ వారికి అల్టిమేటం జారీ చేశారు. సీఎం అధికార నివాసమైన వర్షానే... Read more
Jun 24 | కేరళలోని వాయనాడ్‌లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కార్యాలయంపై కొందరు వ్యక్తులు దాడి చేశారు. అక్కడి సిబ్బందిని కొట్టడంతోపాటు ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు కల్పేటలోని వాయనాడ్ ఎంపీ రాహుల్... Read more
Jun 24 | బావ, బావ పన్నీరు.. బావను పట్టుకు తన్నేరు.. అన్నది పాతకాలం నాటి నానుడి. ఆ తరువాత బావలకు సముచిత గౌరవం కలిగేంచే రోజులు వచ్చాయి. అయితే భూమి గుండ్రంగా తిరుగుతుంది అన్నట్లు.. మళ్లీ బావలను... Read more
Jun 24 | మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభానికి బీజేపీనే కారణమని ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్న వేళ శివసేన ఎంపీ సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్‌ను బీజేపీ బెదిరిస్తోందని పరోక్ష ఆరోపణలు గుప్పించారు. అంతేకాదు... Read more
Jun 24 | అమెరికా ఇటీవల తుపాకుల కాల్పులతో మోతెక్కిపోయింది. కేవలం రోజుల వ్యవధిలోనే అగ్రరాజ్యంలో ఏకంగా 35 మంది ప్రాణాలను ఎందుకు తాము టార్గెట్ గా మారామో కూడా తెలియకుండానే బలైపోయాయి. అందుకు కారణం తుపాకీ తూటాలు.... Read more