Sajjanar promises regular salaries to TSRTC employees ఆర్టీసీ కార్మికులకు సజ్జనార్ శుభవార్త..ప్రతీనెల 1నే వేతనాలు.!

Good news to tsrtc employees md sajjanar promises regular salaries

telangana state road transport corporation, tsrtc, v c sajjanar, Employees, RTC employees salaries, VC Sajjanar, Dasara, Bathukamma, Telangana

Telangana State Road Transport Corporation has announced that salaries to its employees will be rolled-out seamlessly every month. The newly-appointed Managing Director of TSRTC, V C Sajjanar, shared the news with the employees, while wishing them for Dasara and Bathukamma.

ఆర్టీసీ కార్మికులకు సజ్జనార్ శుభవార్త..ప్రతీనెల 1నే వేతనాలు.!

Posted: 10/01/2021 05:50 PM IST
Good news to tsrtc employees md sajjanar promises regular salaries

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మేనేజింగ్ డైరెక్టరుగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి కీలక నిర్ణయాలు తీసుకుంటూ ప్రశంసలు అందుకుంటున్న వి.సి సజ్జనార్ మరో ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నారు. నష్టాల ఊబిలో కూరుకుపోయిన టీఎస్ ఆర్టీసీ కార్మికులకు నెలసరి వేతనాలు ఎప్పుడు లభిస్తాయా.? అంటూ వేచి చూడాల్సి వస్తొంది.  ఉద్యోగులకు సకాలంలో వేతనాలు అందించడం కూడా ఆర్టీసీ యాజమాన్యానికి గగనంగా మారుతోంది. ప్రస్తుతం ప్రతినెల 7వ తేదీ నుంచి 14వ తేదీలోపు విడతల వారీగా, జోన్ల వారీగా చెల్లిస్తున్నారు.

ఈ క్రమంలో ఉద్యోగుల వేతనాల విషయమై కీలక నిర్ణయం తీసుకున్న ఆయన.. ఉద్యోగులందరీకీ శుభవార్తను అందించారు. ఇకపై తెలంగాణా ఆర్టీసీ కార్మికులందరికీ ప్రతినెల ఒకటో తేదీనే వేతనాలు ఇవ్వానున్నామని ప్రకటించారు. ఈ మేరకు ఎండీ సజ్జనార్ ఆర్టీసీ ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల నుంచే ఇది అమలులోకి రానుందని చెప్పారు. దసరా నేపథ్యంలో ఇవాళ వేతనాలు అందనుండడంతో ఉద్యోగుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఆర్టీసీ కార్మకులకు దసరా, బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపే నేపథ్యంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.

అయితే కార్మికులు మరింత బాధ్యతగా, క్రమశిక్షణతో తమ విధులన్ని నిర్వహించి.. ప్రయాణికులను సురక్షితంగా,  నిర్ధేశిత సమయంలోగా తమ గమ్యస్థానాలకుచేర్చాలని కోరారు. కాగా, ఇటీవల ఆర్టీసీ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన బాజిరెడ్డి గోవర్ధన్‌రెడ్డి కూడా ఉద్యోగులకు ప్రతినెల ఒకటో తేదీనే వేతనాలు చెల్లిస్తామని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఆర్టీసీలోని దాదాపు 48 వేల మంది ఉద్యోగులు, పెన్షనర్లు నేడు వేతనాలు అందుకోనున్నారు. కాగా, ఆర్టీసీ మరో నిర్ణయం కూడా తీసుకుంది. దీర్ఘకాలిక సెలవులపై ఇప్పటి వరకు ఉన్న ఆంక్షలను ఎత్తివేసింది. ఇకపై డ్రైవర్లు, కండక్టర్లకు ఏడాదిపాటు దీర్ఘకాలిక సెలవులు మంజూరు చేస్తామని, అవసరమైనవారు దరఖాస్తు చేసుకోవాలని కోరింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Tsrtc  v c sajjanar  Employees  RTC employees salaries  VC Sajjanar  Dasara  Bathukamma  Telangana  

Other Articles