video viral: 2W Electrical Vehicle battery blast జరభద్రం: ఎలక్ట్రిక్ వాహనాలు ఇలా పేలుతాయా.?

Electric two wheeler battery blast in hyderabad video goes viral on net

viral video, electric scooter, electric vehicle, electric two wheeler, electric two wheeler battery blast, smoke from 2W EV, fire from 2W EV battery, trending video

Government is promoting Electrical Vehicles as the prices of fuel shoot up over century mark and also giving subsidies in FAME-II to purchase of Vehicles. And also motivating the people to purchase these E Vehicles. But this video is making rounds on net and alarming people.

ITEMVIDEOS: జరభద్రం: ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీలు ఇలా పేలుతాయా.?

Posted: 09/28/2021 05:53 PM IST
Electric two wheeler battery blast in hyderabad video goes viral on net

రెండు మూడేళ్ల కిత్రం నుంచి దేశంలో అటోమెబైల్ అమ్మాకాలు మరీ ముఖ్యంగా కార్ల అమ్మాకాలు సన్నగిల్లాయి. ఇక గత ఏడాది కాలంగా ఇంధన ధరలు కూడా పెరగడంతో దేశ ప్రజలు అపసోపాలు పడుతూనే పెట్రోల్, డీజిల్ వాహనాలను నడుపుతున్నారు, ఇంధన ధరలు అకాశాన్ని అంటుతున్న క్రమంలో కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన పన్నులను సడలిస్తాయని అశించిన వాహనదారులకు నిరాశే ఎదురైంది. కాగా, తాజాగా అటు కేంద్రంతో పాటు ఇటు రాష్ట్రాలు కూడా ఫేమ్-2 కింద ఎలక్ట్రిక్ వాహనాలపై సబ్సీడీలను ప్రకటిస్తున్నాయి. దీంతో ఏడాది, రెండేళ్లు ఇంధనానికి పెట్టే చార్జీలను వెనకేస్తే చాలు ఎలక్ట్రిక్ వాహనాలు అందుబాటులోకి వస్తాయన్న భావన వాహనదారుల్లో నెలకోంది.

ఇక ప్రభుత్వాలు ప్రకటించిన సబ్సీడిలు ఉన్నప్పుడే ఈ వాహనాలను కొనుగోలు చేస్తే.. తమకు కాసింత కలసి వస్తుందన్న ధోరణి కూడా వాహనదారుల్లో నెలకోంది. ఈ క్రమంలో ఎలక్ట్రికల్ వాహనాలకు డిమాండ్ పెరిగింది. ఇక ఎలక్ట్రిక్ వాహనాల తయారీలోనూ అనేక కంపెనీలు నిమగ్నమయ్యాయి. ప్రముఖ దిగ్గజ కంపెనీలైన ఓలా, బజాబ్, హీరో, ఏథర్, ప్లూటో సహా పలు కంపెనీల వాహనాలు ఇప్పటికే మార్కెట్ లో అందుబాటులో వున్నాయి. అయితే తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదు నగరంలో ఓ ఎలక్ట్రికల్ ద్విచక్ర వాహనానికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది.

ఈ వాహనాన్ని దాని యజమాని నడుపుతూ వెళ్తుండగా అకస్మాత్తుగా పొగలు రావడం ప్రారంభమయ్యాయి. దీంతో వెనకాల వస్తున్న వాహనదారులు చెప్పడంతో వాహనాన్ని నిలిపివేసిన వాహన యజమాని. ఏం జరిగిందా.? అంటూ సీటు తెరచి చూస్తే పోగలు మరింత ఉదృత్తంగా రాసాగాయి. జరిగిన విషయాన్ని తన స్నేహితులతో చెప్పిన ఆయన సదరు విషయాన్ని షోరూం యాజమాన్యానికి చేరవేయాలని సూచించాడు. అసలేం జరిగిందని స్నేహితులు అడగ్గా.. తనకే తెలియదని, తన వాహనంలోని బ్యాటరీలోంచి పోగలు చిమ్ముతున్నాయని చెప్పాడు. ఈలోగా ఈ విచిత్ర ఘటనను చూసిన స్థానికులు తమ సెల్ ఫోన్లలో దానిని బంధించి నెట్టింట్లో పెట్టగా అది కాస్తా వైరల్ అయ్యింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles