Saidabad rape-murder victim family refused government ex gratia ప్రభుత్వ పరిహారాన్ని తిరస్కరించిన సైదాబాద్ చిన్నారి కుటుంబం

Hyderabad child rape and murder victim family refused government ex gratia

Saidabad rape case, Victims Family, govt Exgratia, Mohamood Ali, Satyavathi Rathode, capital punishment, Accused dead, Pallakonda raju, Saidabad, Saidabad rape, Pallakonda raju, Pallakonda raju dead, Pallakonda raju dies, Railway tracks, station Gahanpur, Pallakonda raju encounter, Hyderabad rape, Telangana, Crime

The victim's family of Saidabad rape case, where a six-year-old child was raped and murdered on September 9, had refused the government ex gratia of Rs 20 Lakhs cheque and demanded the accused to be hanged as early as possible.

ప్రభుత్వ పరిహారాన్ని తిరస్కరించిన సైదాబాద్ చిన్నారి కుటుంబం

Posted: 09/16/2021 12:23 PM IST
Hyderabad child rape and murder victim family refused government ex gratia

రాష్ట్ర వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన సైదాబాద్ చిన్నారి హ‌త్యాచారం కేసులో బాధిత కుటుంబాన్ని అదుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం ముందుకు వచ్చింది. బాధిత కుటుంబానికి పరిహారాంగా రూపాయలు 20 లక్షలను అందించారు రాష్ట్ర మంత్రులు. బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మంత్రులు మహమ్మూద్ అలి, మంత్రి సత్యవతి రాథోడ్ లు చిన్నారి తల్లిదండ్రులను ఓదార్చారు. ఈ కేసులో నిందితుడ్ని చట్టప్రకారం అత్యంత కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని హామి ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రులు బాధిత కుటుంబానికి పరిహారంగా రూ.20 లక్షల రూపాయల చెక్ ను కూడా అందించారు.

అయితే చిన్నారి తల్లిదండ్రులు మాత్రం తమకు చెక్కు వద్దని, అసలెలాంటి డబ్బులు అవసరం లేదని తేల్చిచెప్పారు. తమ చిన్నారిని తమకు కాకుండా చేసి.. అత్యంత దారుణంగా అఘాయిత్యాలనికి పాల్పడిన నిందితుడ్ని ఉరి తీయాలని వారు మంత్రులను వేడుకున్నారు. మంత్రులు ఇచ్చిన చెక్ ను తిరిగి ఇచ్చేస్తామని మీడియా ముఖంగా బాలిక తండ్రి తెలిపాడు. తాము మంత్రులు ఇచ్చిన చెక్ ను తిరస్కరించామని.. అయినా వాటిని తమ టేబుల్ పైనే పెట్టి వెళ్లారని ఆయన తెలిపారు. తమకు చెక్ వద్దని,తమ చిన్నారిపై ఆఘాయిత్యానికి పాల్పడిన నిందితుడ్ని శిక్షించాలని కన్నీళ్ల పర్యంతమయ్యారు.

కాగా ఆరేళ్ల చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడిన నిందితడు పాలకొండ రాజు బాధిత కుటుంబం కోరుకున్నట్లుగానే దైవం చేతిలో శిక్షించబడ్డాడు. సభ్యసమాజం తలదించుకునేలా చిన్నారిపై దారుణానికి ఒడిగట్టిన నిందితుడు.. తన కోసం పోలీసుల బృందాలు అన్వేషణ సాగిస్తున్నాయని తెలుసుకున్నాడు. తనను వారు అరెస్టు చేస్తారని భావించి.. వారికి చిక్కకుండా ఇవాళ ఉదయం స్టేషన్ ఘనపూర్ పరిధిలోని నష్ కల్ రైల్వే స్టేషన్ సమీపంలో రైల్వే ట్రాకులపై శవంగా లభించాడు. తనను చేధిస్తున్న పోలీసులను దూరం నుంచి చూసిన రాజు.. రైల్వే ట్రాకుపై వస్తున్న కోణార్క్ ఎక్స్ ప్రెస్ రైలుకు ఎదురుగా వెళ్లి ఆత్మహత్యకు పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles