Army takes over power in Guinea గినియాలో సైనిక పాలనకు ఏర్పాట్లు.. దేశాధ్యక్షుడి అరెస్ట్

Guinea president held in military detention say army coup leaders

Guinea, President, Alpha Conde, military leaders, West African nation, Guinea's governors, regional commanders, Military Government

A unit of Guinea’s military seized power and suspended the constitution, destabilizing a key source of the raw material used to make aluminum. The head of special forces in the West African nation, Colonel Mamady Doumbouya, announced the takeover on state television on Sunday, imposed a curfew of 8 p.m. local time and urged the armed forces to back him.

గినియాలో సైనిక పాలనకు ఏర్పాట్లు.. దేశాధ్యక్షుడి అరెస్ట్

Posted: 09/06/2021 04:22 PM IST
Guinea president held in military detention say army coup leaders

ఆఫ్ఘ‌నిస్తాన్ ను తాలిబ‌న్లు కైవ‌సం చేసుకోవ‌డంతో అక్క‌డ అంత‌ర్యుద్ధం జ‌రుగుతున్న‌ది.  ప‌రిస్థితులు దారుణంగా మారిపోయాయి. ఆ దేశాధ్య‌క్షుడు దేశం వ‌దిలి పారిపోయాడు.  ఇక ఇదిలా ఉంటే, ఆఫ్రికాలోని గినియాలోనూ సైనికుల తిరుగుబాటు జ‌రిగింది. దేశాధ్యక్షుడి పాలనను వ్యతిరేకిస్తూ ఆర్మీ బలగాలు సైనిక చర్యలకు దిగాయి. దీంతో దేశాన్ని సైనికులు వారి చేతిల్లోకి తీసుకున్నారు. గినియా అధ్యక్షుడు అల్ఫా కోంటేని సైనికులు అదుపులోకి తీసుకున్నారు. రాజ్యాంగాన్ని ర‌ద్దు చేసిన‌ట్టు సైనికులు ప్ర‌క‌టించారు.  

దేశంలో సైనిక పాలనను కొనసాగిస్తామని చెప్పిన ఆ దేశ ఆర్మీ క‌ల్న‌ల్ మామాడి డౌంబౌయా.. ఈ క్రమంలో ప్రజలకు జనరంజ‌క‌మైన పాల‌నను అందిస్తామ‌ని తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రజలు ఎలాంటి అందోళనకు గురికావాల్సిన అవసరం లేదని తెలిపారు. ఈ రోజు కేబినెట్ స‌మావేశం ఏర్పాటు చేస్తామ‌ని పేర్కొన్నారు. అదే సమయంలో ప్రభుత్వ అధికారులకు కూడా అదేశాలు జారీ చేశారు. తమ అదేశాలను తప్పక పాటించాలని, రేపు జరగనున్న సమావేశానికి కూడా అధికారయంత్రాంగం పూర్తిస్థాయిలో హాజరుకావాలని అదేశాలు జారీ చేసింది. గినియాలో అధ్య‌క్షుడిని అదుపులోకి తీసుకొని సైనికులు పాల‌నను హ‌స్త‌గ‌తం చేసుకోవ‌డాన్ని అమెరికా త‌ప్పుప‌ట్టింది. ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధ‌మ‌ని పేర్కొన్న‌ది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles