Thieves Hulchal At Srinivasa Lake Villas In Bachupally బాచుపల్లిలో దోపిడి దొంగల హల్ చల్.. సోలార్ ఫెన్సింగ్ కట్ చేసి..

Thieves hulchal at srinivasa lake villas in bachupally police station limits

Thieves gang in bachupally, dacoits in nizampet, dacoits in srinivasa lake view villas, dacoits cut solar fencing, thieves in Nizampet muncipality, dacoits bachupally police, dacoits cctv cameras, thieves in gated community, Thieves gang, dacoits, srinivasa lake view villas, solar fencing, Nizampet muncipality, bachupally police, cctv cameras, gated community, cyberabad police, crime

Thieves challenge police and secuirty in Gated community colonies by breaking solar fence of the colonies and attempted to break the locked houses of the colony. Recently captured CCTV footage shows buglars hulchul in Srinivasa Lake View Villas colony in the outskirts of Hyderabad City.

ITEMVIDEOS: బాచుపల్లిలో దోపిడి దొంగల హల్ చల్.. సోలార్ ఫెన్సింగ్ కట్ చేసి..

Posted: 09/03/2021 12:43 PM IST
Thieves hulchal at srinivasa lake villas in bachupally police station limits

ఓ వైపు వరుణుడు కుండపోత వర్షాన్ని కురిపిస్తున్న తరుణంలో దానిని తమకు అనుకూలంగా మార్చుకున్న దొపిడీ దోంగలు నగర శివారు ప్రాంతాల్లో హల్ చల్ చేస్తున్నారు. వర్షం కురుస్తున్నశబ్దంలో తాము చేసే శబ్దాలు వినబడవని, వినబడినా.. వర్షంలో ఎవరూ భయటకు రారని.. తమ పనిని నిర్వఘ్నంగా ముగించుకోవచ్చునని దొంగలు చెలరేగి పోతున్నారు. హైదరాబాద్ ను టార్గెట్ గా చేసుకుని గ రెండు రోజులుగా నగరంలోని, శివార్లలోని పలు ప్రాంతాలలో వరుస చోరీలకు పాల్పడుతున్నారు. చెడ్డీ గ్యాంగ్ దోంగల దాడి నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుని స్వేచ్చగా నిద్రపోతున్న నగరాన్ని మరో దోంగల ముఠా లక్ష్యంగా చేసుకుంది.

తాజాగా నిజాంపేట మున్సిపల్‌ కార్పొరేషన్‌ బాచుపల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని శ్రీనివాస లేక్‌ వ్యూ విల్లాల్లో చోరీకి పాల్పడ్డారు. తమ వెంట తెచ్చుకున్న భారీ కట్టర్లు, ఇనుప రాడ్ల సాయంతో ఈ లేక్ వ్యూ విల్లా చుట్టూర వున్న సోలార్‌ ఫెన్సింగ్ ను కట్‌ చేసిన నలుగురు దుండగుల ముఠా కాలనీలోకి ప్రవేశించారు. ఈ కాలనీలో తాళాలు వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు పాల్పడ్డారు. కాలనీ సెక్యూరిటీ గార్డులతో పాటు సోసైటీ సభ్యులు పోలీసులకు పిర్యాదు చేయగా వారు వచ్చి కాలనీలో పరిశీలించారు. దొంగల వేలిముద్రలను సేకరించేందుకు క్లూస్ టీం సభ్యులు కూడా రంగంలోకి దిగారు.

సీసీ కెమెరాల్లో రికార్డైన దృశ్యాల ఆధారంగా ముఠా సభ్యులు ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన వారుగా అనుమానిస్తున్నారు. నగర శివారు ప్రాంతాల్లోని గేటెడ్‌ కమ్యూనిటీలను ఎంచుకుని గత కొంత కాలంగా ఈ తరహాలోనే చోరీలకు పాల్పడుతున్నట్టు పోలీసులు గుర్తించారు. నిందితులను పట్టుకునేందుకు పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. ఉదయం పూట రెక్కి నిర్వహించి.. సాయంత్రం దోంగతనాలకు పాల్పడుతున్నారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దొంగలకు సంబంధించిన వివరాలను సేకరించే పనిలో పోలీసు బృందాలు నిమగ్నమయ్యాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles