Heavy rains predicted in Hyderabad for three days తెలంగాణకు మరో నాలుగు రోజులు వర్షసూచన

Weather forecast many districts in telangana to get more rain in next few days

Rain logjam, rain alert, Heavy rainfall, IMD, predicts, Rainfall, Telangana, weather Updates, rains in hyderabad, colonies flooded with Rain, telangana weather, low pressure, deep depression, andhra pradesh weather, rains in amaravati, weather report today, weather forecast, weather forecast today, Rain, low pressure, thunder storms, lightening, Bay of Bengal, weather forecast, Telangana, Andhra Pradesh

Many localities in the city received heavy downpours on Thursday night. The area surrounding Dr MCRHRD IT Campus at Shaikpet recorded the highest rainfall of 101 mm, followed by Kukatpally which witnessed 98.3 mm rainfall. Several other areas, including Serilingampally, Saroornagar, Khairatabad, Qutbullapur and Balanagar also experienced upto 90 mm rainfall.

తెలంగాణకు మరో నాలుగు రోజుల వర్షసూచన.. భారీ నుంచి భారీ వర్షాలు

Posted: 09/03/2021 10:53 AM IST
Weather forecast many districts in telangana to get more rain in next few days

తెలంగాణలో రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. దీనికి తోడు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలంగాణలోని అనేక ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. ఇప్పటికే కుండపోతగా కురిసిన వర్షాలకు ప్రాజెక్టులు నిండుకుండలను తలపిస్తున్నాయి. అంతకుముందు కురిసిన వర్షాలతో వందల టీఎంసీల నీటిని సముద్రంలోకి విడుదల చేశారు. వరుణుడి మునుప్పెన్నడూ లేని విధంగా వర్షాకాలం ఆరంభంతో జూన్ మాసం నుంచి రాష్ట్ర ప్రజలపై ప్రేమ కురిపించాడు. దీంతో వాగులు వంకలు పొంగిపోర్లాయి. చెరువులు, కుంటలు, జలకళను సంతరించుకున్నాయి. జూలై, ఆగస్టులలోనూ తడిసి ముద్దచేసిన వరుణుడు.. సెప్టెంబర్ నెల ప్రారంభం నుంచే దంచికోడుతుండటంతో ప్రజలు తల్లడిల్లుతున్నారు,

తాజాగా భారత వాతావరణ శాఖ తెలంగాణకు మరో మూడు నుంచి నాలుగు రోజుల పాటు మెస్తారు నుంచి అటు కేరళ రాష్ట్రానికి ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఇదివరకే రెండేళ్ల కిత్రం కురిసిన వర్షానికి కేరళ వరుణుడి ప్రళయానికి గురికాగా, తాజాగా మరోమారు భారత వాతావరణ శాఖ అప్రమత్తతను జారీ చేయడంతో రాష్ట్రప్రజలు ఆందోళన చెందుతున్నారు. రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. దీనికి తోడు బంగాళఖాతంలో అల్పపీడన ద్రోణి ఏర్పడిందని, ఇది ఈ నెల 6న మరింత బలపడి వాయుగుండంగా మారనుంది. దీంతో హైదరాబాద్ సహా రాష్ట్రవ్యాప్తంగా మరో మూడు నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశాలు వున్నాయని హెచ్చరికలు జారీ చేసింది. ఇక రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్ గిరి, రంగారెడ్డి, అదిలాబాద్, సహా పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు,,  పిడుగులు కూడా పడే అవకాశాలు వున్నాయని తెలిపింది.

ఇటు క్రితం రోజు రాత్రి హైదరాబాద్ లో కురిసిన భారీ వర్షాలు నగరజనజీవనాన్ని స్థంభింపజేసింది. రోడ్లు చెరువులను తలపించడంతో నగరంలోని వాహనదారులు గంటల తరబడి వర్షంలో తడవాల్సివచ్చింది. మూడు గంటల పాటు ఏకధాటిగా కురిసిన వర్షం నగరవాసులను భయాందోళనకు గురిచేసంది. ఎక్కడికక్కడ నీళ్లు రోడ్లపై నిలిచిపోవడంతో మెహదీపట్నం, రాజేంద్రనగర్, దిల్‌సుఖ్‌నగర్, పంజాగుట్ట, ఖైరతాబాద్, అమీర్‌పేట, కూకట్‌పల్లి, మాదాపూర్, జూబ్లీహిల్స్, శ్రీనగర్ కాలనీ, యూసుఫ్‌గూడ, మైత్రీవనం తదితర ప్రాంతాల్లో వాహనాలు ట్రాపిక్ జామ్ కారణంగా నిలిచిపోయాయి. గంటలకొద్ది సమయంలో వర్షంలో తడుస్తూ కార్లు, బైకులు ఇళ్లకు మెల్లిగా కదిలాయి. మరీ ముఖ్యంగా అమీర్ పేట్, మైత్రివనం వద్ద నిలిచిన నీళ్లు వాహనదారులకు చుక్కలు చూపించాయి.

కృష్ణానగర్లో పాదచారులు వరద నీటిలో కొట్టుకుపోకుండా స్థానికులు దాటించాల్సి వచ్చింది. తోపుడుబండ్లు, ఆటోలు, బైక్ లు నీటిలో కొట్టుకుపోయాయి. ఈ ప్రాంతంలో నీటిలో కొట్టుకుపోతున్న ఓ వ్యక్తిని స్థానికులు రక్షించారు. దీంతో కొన్ని గంటలపాటు ప్రయాణికులు నరకం అనుభవించారు. మూసాపేట, జూబ్లీహిల్స్, మాదాపూర్ ప్రాంతాల్లో వాహనాలను దారి మళ్లించారు. చాంద్రాయణగుట్ట నుంచి బండ్లగూడ వెళ్లే దారిపై వరద చేరడంతో వాహనాలు ఎక్కడివక్కడ నిలిచిపోయాయి.  మూడు గంటల్లోనే 10 సెంటీమీటర్ల వాన కురవడంతో లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles