Gangsters enjoying liquor, snacks inside police lock-up లాకప్ గదిలో గ్యాంగ్ స్టర్స్ పార్టీ.. నెట్టింట్లో వీడియో వైరల్..!

Video of delhi gangsters enjoying snacks and liquor inside police lock up goes viral

Delhi jail, gangsters enjoying liquor in Delhi jail, Mandoli Jail, Special Cell office, Neeraj Bawana, Rahul Kala, Naveen Bali, Delhi gangsters, DG (Tihar jail) Sandeep Goel, Chinmoy Biswal, Rohini jail, Delhi Police, delhi news, delhi latest news

A video has come to light purportedly showing brothers Rahul Kala and Naveen Bali, associates of jailed gangster Neeraj Bawana, sitting inside a lock-up and enjoying liquor and snacks. The two were in Mandoli Jail before they were re-arrested on August 5 in connection with a separate case, and were taken on police remand by the Special Cell till August 10, before returning to jail.

ITEMVIDEOS: లాకప్ గదిలో గ్యాంగ్ స్టర్స్ పార్టీ.. నెట్టింట్లో వీడియో వైరల్..!

Posted: 08/26/2021 02:55 PM IST
Video of delhi gangsters enjoying snacks and liquor inside police lock up goes viral

లాక‌ప్ గ‌దిలోనే ఇద్ద‌రు అన్నదమ్ములైన గ్యాంగ్‌స్ట‌ర్స్ వారితో పాటు మరో ఇద్దరు అనుచరులు రాజభోగాలు అనుభవిస్తున్న వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కోడుతోంది. వీరు ఏకంగా మద్యం సేవిస్తూ స్నాక్స్ ఆర‌గిస్తున్న.. సిగరెట్లు కాలుస్తూ.. సెల్ ఫోన్ మాట్లాడుతూ అచ్చంగా ఇంట్లో వున్నట్టుగానే ఎంజాయ్ చేస్తున్న వీడియో నెట్టింట్లో వేదిక‌లపై తెగ వైర‌ల‌వుతోంది. ఢిల్లీలోని జైలులో ఈ ఘ‌ట‌న జ‌ర‌గ్గా వీడియోను ప‌రిశీలిస్తున్నామ‌ని పోలీసులు చెబుతున్నారు. దీంతో పటిష్టమైన భద్రత ఉండే హై సెక్యూరిటీ లాక‌ప్స్ లో భ‌ద్ర‌తలోని డొల్ల‌త‌నాన్ని ఈ వీడియో బ‌య‌ట‌పెట్టింది.

హ‌త్య‌లు, దోపిడీ కేసులో అరెస్ట‌యి తీహార్లోని మందోలి జైలులో ఉన్న ఇద్ద‌రు అన్నదమ్ములైన గ్యాంగ్‌స్ట‌ర్ల‌ను రాహుల్ కాలా, న‌వీన్ బాలి అని గుర్తించారు. వీరు జైలు లోప‌లి నుంచే రోహిణి జైలులో ఉన్న ప్ర‌త్య‌ర్ధి గ్యాంగ్ కు చెందిన స‌భ్యుడుని హ‌త్య చేసేందుకు కుట్ర ప‌న్నార‌ని మండోలిలోని జైలులో ఉన్న వీరిద్ద‌రినీ స్పెషల్ సెల్ పోలీసులు అదుపులోకి తీసుకుంది. తమ కార్యాలయంలో వీరిని విచారించి.. వారి నుంచి సాంకేతిక సాక్ష్యాలను సేకరించించిన స్పెషల్ సెల్ పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు. సాక్ష్యాల సేకరణ తరువాత వారిని తిరిగి మండోలి జైలుకు తరలించారు. ఈ క్రమంలో విర అనుచరుడైన సాహిల్ అనే గ్యాంగ్ స్టర్ ను కూడా రోహిణి జైలు నుంచి తీసుకువచ్చి విచారించారు.

కాగా ఆగ‌స్ట్ 11న వీరు మండోలి జైలుకు తరలించిన తరువాత ఈ వీడియో బయటపడింది. దీంతో ఈ వీడియో ఎక్కడిదన్న విషయంలో స్పష్టత లేదు. ఈ ఘ‌ట‌న స్పెష‌ల్ సెల్ లాక‌ప్‌లో జ‌రిగిందా లేక మండోలి జైలులో గ్యాంగ్ స్ట‌ర్స్ పార్టీ చేసుకున్నారా అనేది తెలియ‌రాలేదు. ఇక ఈ వీడియోలో గ్యాంగ్ స్ట‌ర్స్‌తో పాటు మ‌రో ముగ్గురు వ్య‌క్తులు మ‌ద్యం సేవిస్తూ, స్నాక్స్ తీసుకోవ‌డమే కాక ఎంచ‌క్కా స్మోక్ చేస్తుండగా, మరో వ్యక్తి ఫోన్‌లో మాట్లాడుతున్నాడు. ఈ రెండు ప్రాంతాల్లో అత్యంత ప‌టిష్ట‌మైన బందోబ‌స్తు ఉంటుంది. ప్ర‌తి లాక‌ప్ రూం వెలుప‌ల గార్డుల ప‌హారా ఉంటుంది. లాక‌ప్ రూంలు, జైళ్ల‌లో నేర‌గాళ్ల‌కు వీఐపీ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంద‌నేది ఈ వీడియోతో మ‌రోసారి బ‌ట్ట‌బ‌య‌లైంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles