1st Covid Vaccine For Children Above 12 Approved In India తొలి డీఎన్ఏ వ్యాక్సీన్.. చిన్నారులకు జైడస్‌ క్యాడిలా టీకా

Zycov d india s first covid 19 vaccine for those above 12 gets nod

Zydus Cadila 3-Dose COVID-19 Vaccine, Zydus Cadila COVID-19 Vaccine, ZyCoV-D, ZyCoV-D Emergency Use Authorisation, ZyCoV-D DNA Covid Vaccine, World;s First DNA COVID-19 Vaccine, ZyCoV-D Worlds First DNA COVID-19 Vaccine, COVID-19 Vaccines India, Zydus Cadila, ZyCoV-D, 3-Dose COVID-19 Vaccine, Worlds First DNA Vaccine, Emergency Use Authorisation, Children

India's drug regulator on Friday approved Zydus Cadila's three-dose COVID-19 DNA vaccine for emergency use in adults and children aged 12 years and above, bringing in the sixth vaccine authorised for use in the country. The company said it plans to manufacture 100 million to 120 million doses of ZyCoV-D annually and has started to stockpile the vaccine.

ప్రపంచంలోనే తొలి డీఎన్ఏ వ్యాక్సీన్.. చిన్నారులకు జైడస్‌ క్యాడిలా టీకా

Posted: 08/21/2021 05:44 PM IST
Zycov d india s first covid 19 vaccine for those above 12 gets nod

దేశంలో పిల్లల కోసం మొట్టమొదటి కోవిడ్ వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చింది. జైడస్‌ క్యాడిలా తయారుచేసిన కరోనా టీకా జైకోవ్‌-డీ అత్యవసర వినియోగానికి డీసీజీఐ అనుమతినిచ్చింది. 12 ఏళ్ళు నిండినవారికి జైకోవ్‌-డీ టీకాను వేయవచ్చని సంస్థ స్పష్టం చేసింది. ప్రపంచంలో మొదటి డీఎన్ఏ ఆధారిత కరోనా వ్యాక్సిన్ జైకోవ్‌-డీ అని సంస్థ తెలిపింది. కాగా గుజరాత్‌కు చెందిన ఫార్మా సంస్థ జైడస్‌ క్యాడిలా సొంతంగా ఈ టీకాను అభివృద్ధి చేసింది. ఏడాదికి 10 నుంచి 12 కోట్ల డోసులు ఉత్పత్తి చేయనున్నట్టు వెల్లడించింది.

కాగా మూడో దశలో 28 వేలమందిపై క్లినికల్ ట్రయల్స్ జరపగా వైరస్ పై 66.6 శాతం సామర్థ్యంతో పనిచేసినట్లు సంస్థ తెలిపింది. ఈ టీకా సూది లేకుండా ఫార్మాజెట్‌ అనే పరికరం సాయంతో వేస్తారు. ఇక ఇప్పటివరకు దేశంలో 18 ఏళ్ళు పైబడిన వారికి ఇచ్చే టీకాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. జైకోవ్‌-డీ మాత్రం 12ఏళ్లు నిండినవారికి కూడా వేయవచ్చు. మరోవైపు దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతంగా సాగుతుంది. శుక్రవారం నాటికి 58 కోట్ల మందికి వ్యాక్సినేషన్ పూర్తైంది. శుక్రవారం ఒక్కరోజే 33 లక్షల మందికి వ్యాక్సిన్ ఇచ్చారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles