Fake Darshan Tickets Troubles SriVari Devotees శ్రీవారి భక్తులకు తప్పని నకిలీ దర్శన టికెట్ల బెడద

Tirumala srivari devotees faces fake darshan tickets trouble

TTD, Srivari darshan Fake tickets, Fake darshan tickets, counterfiet darshan tickets, Special Entry Darshan tickets, Cheating case, Tirumala, Tirumala News, TTD, Tirumala tirupati Devasthanam, TTD Board, TTD Chairman, Laddu prasadams, Andhra pradesh, politics

The online quota of Rs 300 special entry darshan additional tickets for the month of August had been released last month ie on July 28. A total of 8000 Tickets being issued daily for devotees. Few Fraudsters are selling counterfeit ticket to devotees who are facing trouble for not permiting for darshan.

తిరుమల శ్రీవారి భక్తులకు తప్పని ‘ఫేక్’ దర్శన టికెట్ల బెడద

Posted: 08/14/2021 05:58 PM IST
Tirumala srivari devotees faces fake darshan tickets trouble

తిరుమల శ్రీవారి ఏడుకొండలు ఎక్కినా.. భక్తులకు మాత్రం స్వామివారి దర్శనం కలగడం లేదు. ఎన్నోన్నో అంచానాలు.. ఎవరెవరో సిఫార్సు లేఖలు పట్టుకెళ్లినా.. ఆన్ లైన్ లో టిక్కెట్టు పోందిన భక్తులకు మాత్రమే దర్శనభాగ్యం కలుగుతుంది తప్ప.. మిగతాభక్తులను తిరుమల శ్రీవారు కరికరించడం లేదు. గోవిందా.. గోవిందా అంటూ ఎన్ని మెట్టు ఎక్కినా.. లేక ఏడు కొండలను కారులో, బస్సులో లేదా ఇతరాత్ర రవాణా సౌకర్యాలతో దాటి చేరినా.. తిరుమలేశుడు మాత్రం కానరావడం లేదు. దీంతో భక్తులు ఏ చోట చూసినా నీవుందువందురే.. ఏమిటో నీ మాయ తెలియకున్నామయ్యా అంటూ తిరుగు పయనం అవుతున్నారు.

అయితే కొందరు భక్తులు ఎన్నో వ్యయప్రయాసలకోర్చి తిరుమల కోండకు చేరామని.. తమకు ఎలాగైనా దర్శనభాగ్యం కావాలని ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఇలాంటి వారిని గుర్తుపట్టిన కొందరు కేటుగాళ్లు విసిరే మాయమాటలకు.. లొంగిపోయి మోసపోతున్నారు. తాజాగా అలాంటి వారి జాబితా చెంతాడంత పెరుగుతూపోతోందని సమాచారం. అదెలా అంటే కొందరు కేటుగాళ్లు భక్తులకు నకిలీ దర్శన టికెట్లను అంటగడుతూ సొమ్ము చేసుకుంటున్నారు. అందులో ఇంటి దొంగల హస్తమున్నట్టు అధికారులు అనుమానిస్తున్నారు. ఎవరెవరిపై అయితే అనుమానాలున్నాయో వారి కాల్ డేటాను పరిశీలిస్తున్నారు.

ప్రస్తుతం కరోనా మహమ్మారి నేపథ్యంలో భక్తులను పరిమిత సంఖ్యలోనే అనుమతిస్తున్నారు. కొన్ని టికెట్లనే ఆన్ లైన్ లో పెడుతున్నారు. స్లాట్ ఇలా ఓపెన్ అయిపోతే చాలు.. టికెట్లు అలా అయిపోతున్నాయి. దీంతో చాలా మందికి నిరాశ తప్పట్లేదు. ఈ క్రమంలోనే కొందరు దళారులు ఆ పరిస్థితిని సొమ్ము చేసుకోవాలని డిసైడ్ అయ్యారు. పాత కల్యాణోత్సవ టికెట్లను డౌన్ లోడ్ చేసి వాటిని మార్చి, భక్తుల పేర్లను చేర్చి నకిలీలుగా మారుస్తున్నారు. వాటినే భక్తులకు అంటగడుతున్నారు. అందులో కొందరిని ఇప్పటికే అరెస్ట్ చేశారు.

అయితే, వారికి తిరుమల తిరుపతి దేవస్థానంలోని కొందరు ఉద్యోగులే సహకరిస్తున్నారని విజిలెన్స్, ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. చాలా కాలం నుంచి ఈ తంతు నడుస్తున్నా.. బార్ కోడింగ్ స్కాన్ చేసినప్పుడు అవి నకిలీవన్న సంగతిని సిబ్బంది ఎందుకు గుర్తించట్లేదన్న అనుమానాలను వ్యక్తం చేశారు. కొందరు ఉద్యోగులకు తిరుమల, తిరుపతిలోని జిరాక్స్ సెంటర్ల నిర్వాహకులతో సంబంధాలు ఉండి ఉంటాయని అంటున్నారు. దానిపైనే ఇప్పుడు అధికారులు ఫోకస్ చేశారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles