Woman stands on top of Burj Khalifa in viral Emirates ad బుర్జ్ ఖలిఫా ఎత్తైన టవర్ పైఅంచున ఫ్లై ఎమిరేట్స్ యాడ్

Viral ad by emirates shows woman standing on top of burj khalifa

emirates Burj Khalifa Dubai stunt viral video, Emirates Airline viral stunt atop Burj Khalifa, Burj Khalifa emirates ad, Nicole smith-Ludvik, woman stands top of Kurj Khalifa, UK Amber list, twitter, viral videos, trending, trending videos, YouTube

In what is bound to inspire awe and dread in equal measure among viewers, the latest advertisement by Dubai-based airlines Emirates features a woman standing on top of the Burj Khalifa in Dubai. The advertisement, which was released to celebrate the decision allowing quarantine-free travel between Britain and the United Arab Emirates, was shot without the use of a green screen or special effects, according to the carrier,

ITEMVIDEOS: వైరల్ వీడియో: బుర్జ్ ఖలిఫా ఎత్తైన టవర్ పైఅంచున ఫ్లై ఎమిరేట్స్ యాడ్

Posted: 08/10/2021 03:33 PM IST
Viral ad by emirates shows woman standing on top of burj khalifa

ఏ ప్రోడ‌క్ట్ అయినా.. సర్వీస్ అయినా.. ఎంత కొత్తదైనా.. లేక పాతదైనా.. జనంలోకి తీసుకెళ్లాలన్నా లేక జనం దానిని మర్చిపోకూడదన్న.. మార్కెటింగ్ స్ట్రాటజీ నిత్యనూతనంగా వుండాల్సిందే. ఈ మార్కెటింగ్ స్ట్రాటజీలో ముఖ్యభూమిక పోషించేది మాత్రం ప్రకటనలే. రూపాయి షాంపోలు.. పాతిక రూపాయల సబ్బు, టూత్ పేస్టుల నుంచి.. వేల రూపాయల వజ్రవైడూర్యాలవరకు అంతా ప్రకటనలపై ఆధారపడే అమ్ముడవుతోందన్నది జగమెరిగిన సత్యం. ఈ యాడ్స్ ను ప్రత్యేకంగా.. ఎవరూ సాహసించని తరహాలో తీయడం కోసం కోట్ల రూపాయలను కూడా వెచ్చిస్తుంటాయి కంపెనీలు. దీంతో ప్రజలను తమవైపు ఆకర్షించుకోవడంలోనూ ముందుంటాయి,

తాజాగా ఎమిరేట్స్ ఎయిర్ లైన్స్ కూడా ఇలాంటి ఒక తాజా ప్రకటనను రూపోందించి.. ప్రపంచవ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలను అకర్సిస్తోంది. ఈ సంస్థకు చెందిన యాడ్ ఆకర్షితులను చేయడం కన్నా ఆశ్చర్యచకితుల్ని చేస్తోంది. ఎందుకంటే.. రపంచంలోనే అత్యంత ఎత్తైన ఆకాశహర్మ్యం పై అంచున నిలబడితే ఎలా ఉంటుంది.. దాదాపుగా 830 మీటర్ల ఎత్తైన భవంతి బుర్జ్ ఖలీఫా కొనంచున నిలబడి యాడ్ చేసింది. ఈ 30 సెక‌న్ల యాడ్ ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది. ప్రొఫెష‌న‌ల్ స్కైడైవింగ్ ఇన్ స్ట్ర‌క్ట‌ర్ అయిన నికోల్ స్మిత్‌-లుడ్విక్ ఈ యాడ్ లో క‌నిపించింది. ప్రపంచాన్ని మెప్పించింది.

యాడ్ మొద‌ట్లో ఎమిరేట్స్ యూనిఫామ్ లో ఉన్న నికోల్‌ను క్లోజ‌ప్‌లో చూపించారు. ఆమె ఎమిరేట్స్ ఎయిర్ లైన్స్‌ను ప్రమోట్ చేసే కొన్ని ప్ల‌కార్డులు ప‌ట్టుకొని క‌నిపిస్తుంది. ఆ త‌ర్వాత మెల్ల‌గా కెమెరా దూరం జ‌రుగుతుంటే.. అస‌లు ఆమె ఎక్క‌డ నిల్చున్న‌దీ తెలుస్తుంది. ఈ వీడియో చూసి చాలా మంది నెటిజ‌న్లు ముక్కున వేలేసుకున్నారు. కాగా కోందరు ఇది గ్రీన్ మ్యాట్ షాట్ అని.. మరికోందరు మరోలా కూడా రియాక్ట్ అయ్యారు. కాగా ఇంకోందరు మాత్రం విస్మయం వ్యక్తంచేస్తూ నిజంగా బుర్జ్ ఖలిఫాపైనే షూటింగ్ చేశారా.? అని అమయాకంగా అడుగుతూ సంస్థకు చెందిన వెబ్ సైట్ లో పోస్టులు పెట్టారు.

అయితే ఈ యాడ్‌ను ఎలా చిత్రీక‌రించారు? దీని కోసం ఎంత ప్ర‌యాస ప‌డ్డారో మ‌రో వీడియోలో ఎమిరేట్స్ చూపించింది. నికోల్ కోసం అన్ని జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌డం ఆ వీడియోలో చూపించారు. ఈ అనుభవాన్ని తాను మాటల్లో చెప్పలేనని నికోల్ అంటోంది. తన జీవితంలో ఇదే అత్యంత ఉత్కంఠభరితమైన స్టంట్ అనడంలో ఎలాంటి సందేహమూ లేదని తెలిపింది. ఇంత మంచి వాణిజ్య ప్రకటనను షూట్ చేసినందుకు ఎమిరేట్స్ కు ధన్యవాదాలు అని తెలిపింది. ఇందులో భాగస్వామిని అయినందుకు చాలా ఆనందంగా ఉందని పేర్కొంది. ఇక, ఆమె సాహసాన్ని అందరూ కొనియాడుతున్నారు. 828 మీట‌ర్ల ఎత్తుతో భూమిపై అతి ఎత్త‌యిన భ‌వ‌నంగా బుర్జ్ ఖ‌లీఫాకు పేరుంది.


 
 
 
View this post on Instagram

A post shared by Emirates (@emirates)

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles