Bride shocks seeing photograbher fall into pool ఈతకొలనులో ఫోటోగ్రాఫర్.. నివ్వెరపోయిన వధువు

Photographer falls into swimming pool while capturing bride and groom s entry

Indian wedding, notrth california, wedding photographer, Swiming pool, Indian bride shock, Instagram, funny videos, viral video, video viral

The clip captures a hilarious moment of an Indian wedding where the photographer accidentally fell into a pool. Shared online by Instagram page @aperinastudio, the video starts off with the bride and the groom walking out of a grand villa, as a team of photographers gets together to capture the moment.

ITEMVIDEOS: ఈతకొలనులో ఫోటోగ్రాఫర్.. నివ్వెరపోయిన వధువు

Posted: 08/09/2021 05:56 PM IST
Photographer falls into swimming pool while capturing bride and groom s entry

పెళ్ళంటే ఆ హడాహుడే వేరు. కొత్త బంధువులు, కొత్త పలకరింపులు, కొత్త పరిచయాలు, బంధుమిత్రులు, ఇరుగుపోరుగు అంతాకలసి సరదాగా పంచుకునే జ్ఞపకాలు, మధురానుభూతులు, అదే సమయంలో పండితులు హడావిడులు, ఇలా ఒక్కటి కాదు అనేకానేకం పెళ్లిని.. నూరేళ్లు జ్ఞపకంగా మార్చేస్తాయి. అలాంటి వేడుకకు సంబంధించిన తీపిగుర్తులను పదిలపరుచుకోవాలని చాలా మంది కోరుకుంటారు. పెళ్ళికి సంబంధించిన ప్రతి అంశాన్ని గుర్తిండిపోయేలా ఫోటోలు, వీడియోలు తీయించుకుని వాటిని భద్రపర్చుకుని భవిష్యత్ తరాలకు చూపిస్తారు.

పెళ్ళి వేడుకలో ఫోటోగ్రాఫర్ల గురించి చెప్పాల్సిన పనిలేదు. పెళ్లి జరిపించే పండితులది ఓ విధమైన హడావిడీ అయితూ.. పెళ్ళి వారికంటే ఫోటోగ్రాఫర్లు చేసే హడాహుడి అంతాఇంతా కాదు. వివిధ రకాల భంగిమల్లో ఫోటోలు తీస్తూ ఉంటారు. చివరాఖరకు మంగళసూత్ర ధారణ జరుగుతున్న సమయంలోనూ వీరు అటు బందువులను జరిపించి మరీ చక్కని జ్ఞపకాలుగా ఆ మధుర క్షణాలను మలిచేస్తుంటారు, ఇక తాజాగా ఓ ఫోటోగ్రాఫర్ పెళ్ళి వేడుక సందర్భంలో ఫోటోలు తీస్తూ పడరాని పాట్లుపడ్డాడు.ఫోటోలు తీస్తూ ఏకంగా స్విమ్మింగ్ ఫూల్ లో పడ్డ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.

నార్త్ కాలిఫోర్నియాకు చెందిన ప్రముఖ అపెరీనా స్టూడియోస్ తన ఇన్ స్టా ఖాతాలో ఈ వీడియోను షేర్ చేసింది. అందులోని దృశ్యాలు చూస్తుంటే ఓ భారతీయ కుటుంబానికి చెందిన పెళ్ళివేడుకలగా కనిపిస్తోంది. అందులో పెళ్ళి కుమారుడు, పెళ్ళి కుమార్తె సాంప్రదాయ దుస్తులు ధరించి విల్లా నుండి బయటకు నడుచుకుంటూ స్విమ్మింగ్ ఫూల్ వద్దకు వస్తుండగా వారిని ఫోటోల్లో బంధించే పనిలో నిమగ్నమైన ఫోటోగ్రాపర్ వెనకకు జరుగుతూ కెమెరా అడ్జెట్ చేసుకుని క్లిక్ మనిపిస్తుండగా.. కాలు జారి ఈతకొలనులో పడ్డాడు.

అయితే కెమెరా నీటిలో పడిపోకుండా చేతితో పైకి ఎత్తిపట్టుకోగా వెంటనే పక్కనే ఉన్న సెక్యూరిటీ అతని చేతిని పట్టుకుని పైకి లాగాడు. ఈ ఘటనను చూసిన వధువు నివ్వెరపోయింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ గా మారింది. కెమెరా నీటిలో జారిపడిపోకుండా ఫోటో గ్రాఫర్ చాకచక్యం వ్యవహరించటాన్ని నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. పెళ్ళి వేడుకల్లో ఫోటోలు తీయటమంటే నిజంగానే సాహం చేయల్సిందేనేమో అంటూ కామెంట్లు పెడుతుండగా, మరోవైపు ఫోటో గ్రాఫర్ నీటిలో పడిన సమయంలో వధు వరుల రియాక్షన్ సూపర్ గా ఉందంటూ కామెంట్లు లైకులతో ముంచెత్తుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles