Ramesh calls Rahul Gandhi to take up AICC duties రాహుల్ గాంధీ ఏఐసిసి చీఫ్ కావాలి.. ఇదే కార్యకర్తల అభీష్టం: జైరాం రమేశ్

Every congress activist wants rahul gandhi as aicc chief jairam ramesh

Rahul Gandhi, Jairam Ramesh, AICC President, Congress, Activists, Sonia Gandhi, Kamal Nath, National Politics

The Senior Congress leader and former Union Minister Jairam Ramesh asks Rahul Gandhi to take up the responsibilites as All India Congress Committee, says this is what every congress actvist of the country wants.

రాహుల్ గాంధీ ఏఐసిసి చీఫ్ కావాలి.. ఇదే కార్యకర్తల అభీష్టం: జైరాం రమేశ్

Posted: 08/09/2021 04:04 PM IST
Every congress activist wants rahul gandhi as aicc chief jairam ramesh

కాంగ్రెస్ అధ్యక్ష పగ్గాలను రాహుల్ గాంధీ చేపట్టాలన్న అభీష్టాన్ని వ్యక్తం చేశారు కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు జైరామ్ రమేశ్. ఈ పదవికి ఆయన కోసం కాదని, కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న కార్యకర్తల కోసమని అన్నారు. దేశంలోని ప్రతీ కాంగ్రెస్ కార్యకర్త రాహుల్ గాంధీయే కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పగ్గాలను చేపట్టాలని కోరుకుంటున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ ఎంపిక అవుతారని ప్రతి కాంగ్రెస్ నేత ఆకాంక్షిస్తున్నారని చెప్పారు. పార్టీ అధ్యక్షుడి ఎన్నిక కోసం జూన్ 30న ఎలెక్షన్ షెడ్యూల్ విడుదల చేశామని... అయితే, కరోనా సెకండ్ వేవ్ కారణంగా అది జరగలేదని చెప్పారు.

దేశంలోని కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలంతా రాహుల్ మరోసారి పార్టీ పగ్గాలు చేపట్టాలని కోరుకుంటున్నారని... వారందరి మనసులోని మాటనే తాను చెపుతున్నానన్నారు. 'యంగ్ వర్సెస్ ఓల్డ్' అనేది కేవలం మీడియా సృష్టి మాత్రమేనని రమేశ్ చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో ఈ అంశంపై ఎలాంటి చర్చ జరగలేదని అన్నారు. ప్రతి రాజకీయ పార్టీ ఎప్పటికప్పుడు మార్పులు చేసుకుంటూ పోవాల్సిందేనని చెప్పారు. యువ తరానికి కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడూ ద్వారాలు తెరిచే ఉంటాయని అన్నారు. కాంగ్రెస్ ఎంతో అనుభవం కలిగిన పార్టీ అని, పార్టీలో మార్గనిర్దేశం చేయగలిగిన సీనియర్లు ఉన్నారని చెప్పారు.

యువతను, సీనియర్లను కలుపుకుని పోవాలని... ఈ విషయం రాహుల్ కు కూడా తెలుసని అన్నారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పార్లమెంటులో విపక్షాలన్నీ ఏకతాటిపైకి రావడం అనేది తాత్కాలికం కాదని... ముందుముందు కూడా అన్ని పార్టీలు కలసి పని చేస్తాయని రమేశ్ చెప్పారు. భావసారూప్యత కలిగిన పార్టీలన్నీ ఏకమవుతున్నాయని తెలిపారు. అయితే వచ్చే ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కోవడానికి ఈ పార్టీలన్నీ చాలా హోంవర్క్ చేయాల్సి ఉందని అన్నారు. అన్ని పార్టీలను కలుపుకుని, ముందుకు తీసుకెళ్లే సామర్థ్యం రాహుల్ కు ఉందని చెప్పారు. అసోం, కేరళలో అధికారంలోకి వస్తామని తాము భావించామని... అయితే అది జరగలేదని రమేశ్ చెప్పారు. ఏదేమైనప్పటికీ తాము ఆశాభావంతో ముందుకు సాగుతామని చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles