Man tries Bahubali ballaladeva stunt with ox వీడియో కోసం బల్లాలదేవ బిల్డప్.. పూసలు కదిలాయి..

Young man tries bahubali ballaladeva stunt with ox watch what happens

baahibali, Ox, stunt, Young man, Bhallaladeva, viral video, video viral, Funny video, watch video

An Young man who is very fond of Bahubali series movies attempts a stunt from the movie. In the first part of the movie the Ballaladeva does a stunt with ox. the same was attempted by the Young man which turns to be funny as he is unhurt.

ITEMVIDEOS: వీడియో కోసం బల్లాలదేవ బిల్డప్.. పూసలు కదిలాయి..

Posted: 07/16/2021 02:55 PM IST
Young man tries bahubali ballaladeva stunt with ox watch what happens

సోషల్ మీడియాలో తాము పోస్ట్ చేసిన వీడియోలకు అత్యధిక లైకులు రావాలని అందుకోసం పోడి పడి మరీ వీడియోలు రూపోందిస్తున్న అనేక మంది యువత. అందులో కొన్ని రకాల వీడియోలు వైరల్‌ అవుతుంటాయి. కొన్ని కొన్ని వీడియోలు మన మనసుకు హత్తుకుంటాయి. మరికొన్ని ఆహ్లాదాన్నిస్తాయి. ఇంకొన్నిసార్లు షాకింగ్‌ని కలిగిస్తాయి. అయితే సోషల్ మీడియా రాత్రికి రాత్రే పాపులర్ కావాలంటే కొంత సాహసంతో కూడిన వీడియోలు అయితే బాగుండు అని కొందరు ఎలాంటి సాహసానికైనా తెగిస్తున్నారు.

ఈ తరహాలోనే కొంత విచిత్రంగా అలోచించిన ఓ యువకుడు బాహుబలి చిత్రంలోని స్టంట్లు చేయాలని యోచించాడు. అప్పటికే ఇలాంటి స్టంట్లు చేసి అనేక మంది ప్రాణాలపైకి తెచ్చుకున్నారన్న విషయం తెలిసి కూడా అలాంటి స్టుంటే చేయబోయాడు. అందరూ బాహుబలిలోని అమరేంద్ర బాహుబలి చేసిన ఏనుగు స్టంట్లను చేయబోయి కొందరు విగతజీవులుగా మారితే మరికోందరు ప్రాణాల మీదకు తెచ్చుకన్నారు. అయితే ఈ యువకుడు మాత్రం తాను ఏనుగుతో గే్మ్స్ అడనని, ఎద్దు కొమ్ములు విరిచి.. సత్తా చాటాలని అనుకున్నాడు. కానీ ఆతని ప్రయత్నం బెడిసికొట్టింది.

ఎద్దు కొమ్ములు పట్టుకుని వంచేందుకు ప్రయత్నిస్తుండగా దానికి ఒక్కసారిగా కోపం వచ్చి ఎత్తి పడేసింది. ఈ మొత్తం సంఘటనను తన స్నేహితులు సెల్‌ఫోన్‌లో రికార్డు చేశారు.అదృష్టవశాత్తూ అతడుకి ఎటువంటి గాయాలు కాలేదు. అయితే ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియోలో తెగ వైరల్‌ అవుతుంది.ఈ వీడియో పై నెటిజన్లు స్పందిస్తూ .. నీవు ఏమైనా బహుబలి సినిమాలో బల్లాల దేవుడివి అనుకుంటున్నావా అని ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ప్రాణాలు జాగ్రత్త.. ఏదైనా అతి చేస్తే.. పర్యావసనాలు ఇలానే ఉంటాయని మరి కొందరు హెచ్చరిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : baahibali  Ox  stunt  Young man  Bhallaladeva  viral video  video viral  Funny video  watch video  

Other Articles