Battlegrounds Tournament with Rs 1 crore prize pool పబ్జీ టోర్నీ ఆడండీ.. కోటి రూపాయలు గెలుచుకోండీ..

Battlegrounds mobile india series 2021 esports tournament announced with rs 1 crore prize pool

Battlegrounds Mobile India Series 2021, Battlegrounds Mobile India esports, Battlegrounds Mobile India tournament, Battlegrounds Mobile India Rs 1 crore, Battlegrounds Mobile India prize pool, Battlegrounds Mobile India, PUBG India Series, PUBG India tournament, PUBG India Rs 1 crore prize, esports, Games, tournament

It would be underselling quite massively if one were to suggest that PUBG Mobile, now Battlegrounds Mobile India (BGMI) helped revitalize the esports scene in India – as each year, it continues to blossom and grow with blistering pace. KRAFTON has just announced the first esports tournament hosted by the South Korean studio – Battlegrounds Mobile India Series 2021.

బంఫర్ ఆఫర్: పబ్జీ ఇండియా టోర్నీ ఆడండీ.. కోటి రూపాయలు గెలవండీ..

Posted: 07/16/2021 12:31 PM IST
Battlegrounds mobile india series 2021 esports tournament announced with rs 1 crore prize pool

ప‌బ్జీ గేమ్ అంటేనే యువతలో ఓ క్రేజ్. ఈ గేమ్ అడేందుకు వారు అదునాతన ఫీచర్లు వున్న మొబైల్ ఫోన్లను కొనుగోలు చేసి మరీ గేమ్ అడతారు. అయితే కొన్నాళ్ల క్రితం ఈ గేమ్ ను కేంద్రప్రభుత్వం రద్దు చేసింది. కాగా, తాజాగా ఈ గేమ్ ఇండియ‌న్ అవ‌తార్ మళ్లీ యువత దరి చేరింది. బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా గేమ్ గా రావడంతోనే ఇది సంచ‌ల‌నాలు సృష్టించింది. ప్లే స్టోర్ లో కేవ‌లం వారం రోజుల్లోనే 3 కోట్ల‌కు పైగా గేమింగ్ ప్రియులు ఈ గేమ్ ను డౌన్ లోడ్ చేసుకున్నారు. ఇప్పుడు ఈ గేమ్ పై మ‌రింత ఆద‌ర‌ణ పెంచేందుకు క్రాప్ట‌న్ సంస్థ బ్యాటిల్ గ్రౌండ్స్ సీజ‌న్ 21 పేరిట ఓ టోర్న‌మెంట్ ను ప్ర‌క‌టించింది.

ఇన్నాళ్లు ఆడి చికెన్ బకెట్ అందుకున్న యువత.. ఇకపై ఈ గేమ్ టోర్నీలో అడితే కోటి రూపాయలను మీ సోంతం చేసుకోవచ్చు. అదేంటి ఇది కూడా ఉత్తుత్త చికెన్ బక్కెట్ మాదిరే అనుకుంటున్నారా..? ఎంతమాత్రం కాదు. నిజమైన కోటి రూపాయల ప్రైజ్ మనీ మీ సోంతం అవుతోంది, ఈ మేరకు కాన్సెప్ట్ సంస్థ ప్రకటించింది. అయితే ఈ ప్రైజ్ అందరికీ కాదు.. ఈ టోర్న‌మెంట్‌లో మొద‌టి 16 స్థానాల్లో నిలిచిన వారికి పంచ‌నున్నారు. గేమ్ లో మొదటి స్థానంలో నిలిచిన వారికి రూ.50 ల‌క్ష‌లు బ‌హుమ‌తిగా ఇవ్వ‌నున్నారు. ఇక రెండో స్థానంలో ఉన్న‌వారికి రూ.25 ల‌క్ష‌లు, మూడో స్థానంలో నిలిచిన వారికి రూ.10 ల‌క్ష‌లు రూపాయలను బహుమతిగా అందించనున్నారు.

అయితే నాల్గో స్థానంలో నిలిచిన వారికి రూ.3 ల‌క్ష‌లు, ఐదో స్థానంలో నిలిచిన వారికి రూ.2ల‌క్ష‌లు, ఆరో స్థానంలో నిలిచిన వారికి రూ.1.5 ల‌క్ష‌లు, ఏడో స్థానంలో నిలిచిన వారికి ల‌క్ష రూపాయ‌లు ప్రైజ్‌గా ఇవ్వ‌నున్న‌ట్లు క్రాప్ట‌న్ సంస్థ ప్ర‌క‌టించింది. ఇక ఎనిమిదో స్థానం నుంచి 16వ స్థానం వ‌ర‌కు ఒక్కో ర్యాంకు త‌గ్గిన కొద్ది రూ.10వేలు త‌గ్గించి ప్రైజ్ మ‌నీ ఇవ్వ‌నున్నారు. ఉదాహ‌ర‌ణ‌కు ఎనిమిదో స్థానంలో నిలిచిన వారికి రూ.90 వేలు ఇస్తే.. తొమ్మిదో స్థానంలో నిలిచిన వారికి రూ.80వేలు.. ఇలా చివ‌ర‌గా 16వ స్థానంలో నిలిచిన వారికి 10వేల రూపాయ‌లు బ‌హుమ‌తిగా ఇవ్వ‌నున్నారు.

టోర్నీలో పాల్గొనాలంటే..

ఈ టోర్న‌మెంట్‌లో పాల్గొనేందుకు జూలై 19 నుంచి రిజిస్ట్రేష‌న్లు మొద‌లు కానున్నాయి. ఆగ‌స్టు 2 నుంచి ఆగ‌స్టు 8 మ‌ధ్య‌లో క్వాలిఫయ‌ర్ గేమ్స్ నిర్వ‌హించ‌నున్నారు. ఈ గేమ్ ఆడాలంటే క‌చ్చితంగా భారతీయులై ఉండాలి. ప్లేయిర్ అకౌంట్ ప్లాటిన‌మ్ లేదా అంతకంటే ఎక్కువ ర్యాంకింగ్‌ది అయి ఉండాలి. బ్యాటిల్‌గ్రౌండ్స్ మొబైల్ ఇండియా సీజ‌న్ 2021కి రిజ‌స్ట‌ర్ చేసుకున్న ప్లేయ‌ర్లు మొత్తం 15 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంటుంది. ఈ 15 మ్యాచ్‌ల్లోని టాప్ 10 మ్యాచ్‌ల‌ ఆధారంగా స్కోరింగ్ ఇస్తారు. టాప్‌లో నిలిచిన 1024 టీమ్‌ల‌ను త‌ర్వాత రౌండ్‌కు క్వాలిఫై చేస్తారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles