Okaya Group forays into electric two-wheeler biz రూ.40లకే ఎలక్ట్రికల్ లోకాస్ట్ టూవీలర్.!

Okaya groups ev division forays into electric two wheeler business

electric scooter, electric scooter 40000, Low cost electric scooter, okaya group electric scooter, okaya group two wheelers, Petrol Price, Okaya, Electric vehicles, Charging station, Electric vehicle, Computer Hardware (NEC), Computer Peripherals, Public Finance Activities, Okaya Power Group, Haryana, electronics, EV, battery manufacturing, Delhi, Jaipur, e-scooter, manufacturing plant, Anil, business

Energy storage solutions provider Okaya Group's EV arm announced its entry into the electric two-wheeler business with the launch of a range of vehicles. Launched in two variants, AvionIQ series and ClassIQ series, the Okaya EV two-wheelers are equipped with all the required technologies to manage the increasing volatility of Indian power conditions, it added.

ద్విచక్ర వాహనాల వ్యాపారంలోకి ఒకాయా.. రూ.40లకే లోకాస్ట్ టూవీలర్

Posted: 07/06/2021 07:38 PM IST
Okaya groups ev division forays into electric two wheeler business

ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం రోజు రోజుకు పెరుగుతుంది. ఓ వైపు వాతావరణ కాలుష్యం, మరోవైపు పెట్రోల్ ధరలు ఆకాశాన్ని అంటుతుండగా చాలామంది ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేసేందుకు ముందుకు వస్తున్నారు. దీంతో ఇప్పుడిక ఎలక్ట్రిక్ వాహనాలకు మార్కెట్ లోనూ డిమాండ్ బాగా పెరిగింది. అంతేకాకుండా కేంద్రప్రభుత్వం అందిస్తున్న ఫేమ్-2 తొ ఎలక్ట్రికల్ వాహనాలపై భారీ రాయితీ కూడా లభించనుంది. దీంతో ఎలక్ట్రిక్ వాహనాలకు మార్కెట్ లో డిమాండ్ అంతకంతకూ పెరుగుతోంది.

తాజాగా ఎలక్ట్రిక్ వాహనాలకు వున్న డిమాండ్ నేపథ్యంలో ఇప్పటికే పేరుమోసిన హిరో, హోండా, బజాబ్, అథర్, కోమకీ సహా పలు కంపెనీలు ఎలక్ట్రికల్ వాహనాల రంగంలోకి ప్రవేశించి వాహనాలను ఉత్పత్తి చేస్తుండగా, ఇక తాజాగా మరికొన్ని కంపెనీలు కూడా ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో భాగం కానున్నాయి. ఇప్పటికే కొత్త కంపెనీలు ఎలక్ట్రిక్ వాహన తయారి రంగంలోకి అడుగు పెట్టగా, తాజాగా ఎనర్జీ స్టోరేజీ సొల్యూషన్స్ ప్రొవైడర్ ఓకాయా గ్రూప్ ఎలక్ట్రిక్ టూ వీలర్ వ్యాపారంలోకి ప్రవేశిస్తున్నట్లు ప్రకటించింది.

ఇప్పటికే హిమాచల్ ప్రదేశ్ లో ద్విచక్ర వాహనాల తయారీ కర్మాగారాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపింది. మరో ప్రాజెక్టు రాజస్థాన్ లోని నీమ్రానా ప్రాంతంలో 2023 – 25 నాటికి ప్రారంభించనున్నట్లు వివరించారు. భారతీయ పరిస్థితులకు అనుగుణంగా ఎలక్ట్రిక్ బైక్ లను తయారు చేస్తామని సంస్థ పేర్కొంది. అవియోనిక్ సిరీస్, క్లాస్ ఐక్యూ సిరీస్ ఎలక్ట్రిక్ స్కూటర్లలో అధునాతమైన టెక్నాలజీని ఉపయోగించనున్నట్లు తెలిపారు.

ఇక ఈ స్కూటర్ ధర రూ.39,999 నుంచి రూ.60,000 ధరల శ్రేణిలో ఉంటాయని ప్రకటించింది. 2025 నాటికి భారతీయ రోడ్లపై కోటి ఈ-స్కూటర్లను తీసుకురావాలంటున్న కేంద్ర ప్రభుత్వ కలను సాకారం చేసేందుకు తమ వంతు సహకారం అందించనునట్లు గుప్తా తెలిపారు. అందరికి అందుబాటులో ఉండేలా షో రూమ్స్ ఏర్పాటు చేస్తామని ఓకాయా పవర్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ అనిల్ గుప్తా తెలిపారు. ఇక తమ వాహనాలను రెండు రిసర్చ్ అండ్ డెవలప్ మెంట్ స్టేట్ ఆప్ ఆర్ట్ కేంద్రాల నుంచి వచ్చిన డిజైన్లలో రూపొందిస్తున్నామని అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles