రాత్రికి రాత్రి కుబేరులు కావాలంటే.. ఏం చేయాలి.. అదృష్టం వుంటే తప్ప సాధ్యం కాదు. అయితే అలాంటి అదృష్టమే ఓ కేరళ టాక్సీ డ్రైవర్ ను వరించింది. కరోనా కష్టకాలంలో దేవుడు వరమిచ్చినట్టుగా.. ఒక్కసారిగా అతని కష్టాలన్నీ తీరిపోయి.. సుఖంగా ఉండేందుకు మార్గం లభించింది. ఇన్నాళ్లు ఎన్నో కష్టాలు పడుతూ.. తన కుటుంబాన్ని పోషించలేక అవస్థలు పడిన ఆ డ్రైవర్ కష్టాల కడలిని వదిలి.. సంతోష సాగరంలో అడుగుపెడుతున్నాడు. అదేంటి అంతలా ఉపోద్ఘాతం ఇస్తున్నారని అంటారా.. ఔనండీ తప్పడు మరీ..
ఇన్నాళ్లు యూనైటెడ్ ఆరబ్ ఎమిరేట్స్ లో పనిచేస్తున్న దుబాయ్ వాసులకు అదృష్టం బాగానే వుందని విన్నాం. అయితే వారిలో చాలా మందికి కోట్ల రూపాయల లాటరీ ఫ్రైజ్ మనీ వచ్చింది. అయితే ఇందులో ఎవరికీ రెండెకలు దాటిన ప్రైజ్ మనీ మాత్రం రాలేదు. వచ్చినా అది చాలా అరుదు. కానీ దుబాయ్ లో టాక్సీ డ్రైవర్ గా పనిచేస్తున్న ఓ కేరళవాసికి మాత్రం ఏకంగా రూ. 40 కోట్ల రూపాయలు ప్రైజ్ మనీగా వచ్చింది. దీంతో అబుదాబిలో 2008 నుంచి టాక్సీ డ్రైవర్ గా పనిచేస్తున్న కేరళ వ్యక్తి ఒకరు రాత్రికి రాత్రే కోటీశ్వరుడిగా మారిపోయాడు.
ఇటీవల అతడు కొనుగోలు చేసిన లాటరీ టికెట్కు రూ. 40 కోట్ల జాక్ పాట్ తగిలింది. తొలుత ఈ విషయాన్ని నమ్మలేని అతడు ఆ తర్వాత తనకు దక్కిన అదృష్టాన్ని చూసి మురిసిపోతున్నాడు. టాక్సీ డ్రైవర్ అయిన 37 ఏళ్ల రెంజిత్ సోమరాజన్ మూడేళ్లుగా లాటరీ టికెట్లు కొంటున్నాడు. గత నెల 29న తన సహచరులైన 9 మందితో కలిసి తలా 100 దిర్హమ్లు వేసుకుని తన పేరుపై లాటరీ టికెట్ కొనుగోలు చేశాడు. తాజాగా నిర్వహించిన డ్రాలో ఆ టికెట్కు 20 మిలియన్ దిర్హమ్ లు (దాదాపు 40 కోట్లు) తగిలాయి. జాక్పాట్ తగిలిన విషయం తెలిసి ఉప్పొంగిపోతున్న సోమరాజన్ మాట్లాడుతూ.. తన సహచరుల్లో భారత్, పాకిస్థాన్, నేపాల్, బంగ్లాదేశ్ వ్యక్తులు ఉన్నారని, వచ్చే మొత్తాన్ని అందరం సమానంగా పంచుకుంటామని తెలిపాడు.
(And get your daily news straight to your inbox)
Jun 30 | మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేల నాయకుడు ఏక్నాథ్ షిండే గురువారం రాత్రి 7.30 గంటలకు ప్రమాణ స్వీకారం చేయగా, డిప్యూటీ సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేశారు. ఇవాళ రాత్రి... Read more
Jun 30 | రైలు టికెట్ కొనాలంటే ముందుగా కౌంటర్ వద్దకు వెళ్లేందుకు ప్రయాణీకులు ఎంతో సమయం క్యూల్లో నిలబడిఉండాలి. టికెట్లు ఇచ్చే వ్యక్తిపైనా తరచూ ఫిర్యాదులు వస్తుంటాయి. ఈ ప్రక్రియ సంక్లిష్టంగా మారడంతో పరిస్థితి మెరుగుపరిచేందుకు పలు... Read more
Jun 30 | గత కొన్నిరోజులుగా కొనసాగుతున్న మహారాష్ట్ర సంక్షోభానికి ఎట్టకేలకు తెరపడింది. కాంగ్రెస్, ఎన్సీపీలతో కలసి ప్రభుత్వ ఏర్పాటును వ్యతిరేకిస్తున్న శివసేన రెబల్ వర్గ ఎమ్మెల్యేలు బీజేపితో కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి రంగం సిద్దమైంది. అయితే... Read more
Jun 30 | బంగారం అంటే మహిళలకు చాలా ఇష్టం. దీని కోసమే ఎన్నో ఇళ్లలో మగవారు చీవాట్లు తింటారు. ఇంకొన్ని ఇళ్లలో ప్రశంసలను అందుకునే వాళ్లూ ఉన్నారు. మరి ఈ కుందనం నలుపు శరీర ఛాయ ఉన్నవారిపై... Read more
Jun 30 | గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న మహారాష్ట్ర సంక్షోభం శివసేన అధినేత, మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ ముఖ్యమంత్రి ఉద్దవ్ థాకరే రాజీనామాతో క్లైమాక్స్ కు చేరింది. మహారాష్ట్ర డిప్యూటీ స్పీకర్ ఎనమిది మంది మంత్రులపై విధించిన... Read more