‘If There Is One Fatality...’: Supreme Court Warns AP ‘‘ఒక్క విద్యార్థి ప్రాణం పోయినా.. మీదే బాధ్యత’’: సుప్రీం ఫైర్

If there is one fatality supreme court warns andhra pradesh about board exams

Andhra pradesh board exams, andhra pradesh board exam, ap ssc, ap inter exam, ap board exam news, Supreme court, Intermiediate exams, student, fatality

The Supreme Court of India on Tuesday said the Andhra Pradesh government can not keep the decision of board exams “hanging fire” if it is confident of holding these when other states have decided to cancel.

‘‘ఒక్క విద్యార్థి ప్రాణం పోయినా.. మీదే బాధ్యత’’: ఏపీ సర్కారుపై సుప్రీం ఫైర్

Posted: 06/23/2021 10:04 AM IST
If there is one fatality supreme court warns andhra pradesh about board exams

ఇంటర్మీడియట్ పరీక్షలను రద్దు చేయని ఆంధ్రప్రదేశ్‌, కేరళ ప్రభుత్వాలపై దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇంటర్ పరీక్షల నిర్వహణ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అఫిడవిట్‌ వేయలేదని ఆగ్రహం వ్యక్తం చేసిన అత్యున్నత న్యాయస్థానం.. రెండ్రోజుల్లో అఫిడవిట్‌ దాఖలు చేయాలని ఆదేశించింది. ఇన్ని రోజులైనా అఫిడవిట్‌ ఎందుకు వేయలేదని ప్రభుత్వ న్యాయవాదిని ధర్మాసనం ప్రశ్నించింది. ఏపీ నుంచి స్పష్టత లేదని అసహనం వ్యక్తం చేసింది. ఒక్క విద్యార్థి ప్రాణం పోయినా రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని స్పష్టం చేసింది.

దేశంలోని అన్ని రాష్ట్రాలు ఇంటర్ పరీక్షల నిర్వహణపై నిర్ణయం తీసుకున్నా ఏపీ ఎందుకు తీసుకోలేదని సర్వోన్నత న్యాయస్థానం ప్రశ్నించింది. ఏపీని ఎందుకు మినహాయించాలో చెప్పాలని నిలదీసింది. 12వ తరగతి పరీక్షలు నిర్వహిస్తారా?లేదా స్పష్టంగా చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ క్రమంలో 11వ తరగతి పరీక్షలను కరోనా ప్రభావం తగ్గిన తరువాత సెప్టెంబరులో నిర్వహిస్తామని కేరళ ప్రభుత్వం సుప్రీం కోర్టుకు తెలిపింది. పరీక్షలను రద్దు చేయని ఆంధ్రప్రదేశ్‌ సహా నాలుగు రాష్ట్రాలకు సుప్రీంకోర్టు గురువారం నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.

సీబీఎస్‌ఈ పరీక్షలను రద్దు చేసిన నేపథ్యంలో మూల్యాంకణ విధానానికి ఆమోదం తెలిపే సందర్భంలో సర్వోన్నత న్యాయస్థానం అఫిడెవిట్ దాఖలు చేయని రాష్ట్రాల విషయాన్ని చర్చించింది. 28 రాష్ట్రాలకుగానూ 18 రాష్ట్ర బోర్డులు ఇప్పటికే 12వ తరగతి పరీక్షలను రద్దు చేశాయని, మిగిలిన ఆరు.. కరోనా రెండో ఉద్ధృతి రాకముందే పరీక్షలు నిర్వహించాయని పిటిషనరు అత్యున్నత న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. మిగిలిన నాలుగు రాష్ట్రాలు పరీక్షలను రద్దు చేయలేదని పేర్కొన్నారు. దీంతో న్యాయస్థానం ఆయా రాష్ట్రాలకు నోటీసులు జారీచేసి అఫిడవిట్ దాఖలు చేయాలని అదేశించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles