Bihar woman gets two vaccine doses in five minutes ఐదు నిమిషాల్లో వృద్దురాలికి కోవాగ్జిన్, కోవిషీల్డ్ వాక్సీన్లు..

Bihar woman given both covishield and covaxin in 5 minutes

sunila devi, Rabindra Mahato, Belarchak vaccination centre, nurse Chanchala Kumari, Nurse Sunita Kumari, Covaxin, Covishield, COVID vaccine, vaccination, COVID-19, Patna Rural area, Bihar, Politics

In a bizarre incident, a woman in a Bihar village was injected two doses of Covid-19 vaccine in a space of five minutes. Shockingly, the first dose was Covishield and the second Covaxin. An uneducated woman in her sixties from the family of a farmer,

బీహర్ లో వృద్దురాలికి ఐదు నిమిషాల్లో కోవాగ్జిన్, కోవిషీల్డ్ వాక్సీన్లు..

Posted: 06/19/2021 10:32 AM IST
Bihar woman given both covishield and covaxin in 5 minutes

కరోనా మహమ్మారి రెండో దశ వ్యాప్తి నేపథ్యంలో ప్రతీ వీధిలో ఒకరు దాని ప్రభావానికి గురైన ఘటనలు నమోదు చేసుకోగా. ఇక త్వరలోనే మూడో విడత కూడా భారత్ లో రానుందన్న అంచానాల నేపథ్యంలో దేశంలోని ప్రతీ గ్రామంలో అటు కేంద్ర ప్రభుత్వంతో పాటు ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో ప్రతిష్టాత్మకంగా టీకా కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి. అయితే వైద్య సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా దేశ వ్యాప్తంగా పలు ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. అరోగ్య కార్యకర్తల నిర్లక్ష్యం కారణంగా ఓ వృద్దురాలు అనారోగ్యానికి గురయ్యారు. అమె ఎంతగా చెబుతున్నా పెడచెవిన పెట్టిన ఆరోగ్య కార్యకర్తలు.. అమెకు ఐదు నిమిషాల వ్యవధిలో రెండు టీకాలను ఇచ్చారు.

అరోగ్య కార్యకర్తలు వృద్దురాలికి కేవలం ఐదు నిమిషాల వ్యవధిలో కొవాగ్జిన్, కొవిషీల్డ్ రెండు టీకాలూ ఇవ్వడంతో అమె ఇంటికి వెళ్లి తన పిల్లలకు ఈ విషయాన్ని చెప్పింది. వారు కోపోద్రిక్తులై వచ్చి అరోగ్య కార్యకర్తల తీరుపై మండిపడ్డారు. ఆ తరువాత విషయం వైద్యాధికారుల దృష్టికి చేరింది. ఈ క్రమంలో వృద్దురాలికి జ్వరం వచ్చింది. వెంటనే రంగంలోకి దిగిన వైద్యాధికారుల బృందం అమెను తమ పర్యవేక్షణలో ఉంచేందుకు వీలుగా అసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన బీహార్‌ రాష్ట్రంలోని పాట్నా గ్రామీణ ప్రాంతంలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే.. పాట్నా శివారులోని పున్‌పున్ పట్టణంలోని ఓ పాఠశాలలో  వ్యాక్సిన్ సెంటర్ ఏర్పాటు చేశారు.ఈ క్రమంలో 65 ఏళ్ల సునీలాదేవి అనే మహిళ వ్యాక్సిన్ వేయించుకునేందుకు వెళ్లారు. అక్కడ 18 ఏళ్లు పైబడిన వారికి ఓ వరుసలో, 45 ఏళ్లు పైబడిన వారికి మరో వరుసలో టీకాలు వేస్తున్నారు. మొదటి వరుసలోకి వెళ్లి కొవిషీల్డ్ టీ  కా వేయించుకున్న ఆమె సిబ్బంది సూచనతో కాసేపు అక్కడే కూర్చుంది. ఐదు నిమిషాల తర్వాత మరో వరుసలోకి వెళ్లి కొవాగ్జిన్ టీకా వేయించుకున్నట్టు వైద్యాధికారి సంజయ్ కుమార్ తెలిపారు.  

అయితే తాను ఐదు నిమిషాలకు ముందే టీకా తీసుకున్నానని చెబుతున్నా పెడచెవిన పెట్టిన ఆరోగ్య కార్యకర్త కారణంగానే.. ఐదు నిమిషాల వ్యవధిలో రెండు టీకాలు వేశారని అమె తెలిపింది. వెంటనే ఆమెకు కొద్దిపాటి జ్వరం వచ్చిందని, దీంతో అమె ఇంటికి వెళ్లి తమ పిల్లలకు జరిగిన విషయాన్ని తెలిపింది. దీంతో వారు అగ్రహోక్తులై టీకా కేంద్రానికి వచ్చి అక్కడి అరోగ్య కార్యకర్తలపై ఫైర్ అయ్యారు. ప్రస్తుతం ఆమె వైద్యుల పర్యవేక్షణలో ఉందని సంజయ్ కుమార్ తెలిపారు. ఆరోగ్యం నిలకడగానే ఉందని చెప్పారు. వ్యాక్సిన్ ప్రక్రియ గురించి వృద్ధురాలికి తెలియకపోవడం వల్లే ఇలా జరిగిందని పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles