man pretends electric shock in metro for seat సీటు కోసం పాట్లు.. మెట్రో రైలులో అగంతకుడి వేషాలు..

Man uses this bizarre trick to get a seat in crowded metro

man prank video, man pretends electric shock, metro train seat, seizure, epilepsy attack, metro seat, metro train, viral video, viral, trending

A video is going viral on social media where a young man can be seen tricking some metro passengers to get a seat in a crowded train coach in an extremely odd way. The video was posted on Instagram by a user called ‘tube.indian’ with the caption, “Bhari metro main seat paane ke liye ladke ne lagaya jugaad”.

ITEMVIDEOS: సీటు కోసం పాట్లు.. మెట్రో రైలులో అగంతకుడి వేషాలు..

Posted: 06/14/2021 07:07 PM IST
Man uses this bizarre trick to get a seat in crowded metro

అదో మెట్రో రైలు.. అందరిలాగానే తాను డబ్బులిచ్చి రైలులో ప్రయాణం చేస్తున్నాడు. అయితేనేం.. అందరిలో కొందరిలా తాను కూర్చోని వెళ్లడం లేదు. అంతే తన కడుపు మండింది. తాను డబ్బు వెచ్చించేకదా రైలులో ప్రయాణం చేస్తోంది. అయినా కూర్చునేందుకు సీట్లు కల్పించరేం అనుకున్నాడో ఏమో కానీ.. ఓ యువకుడైతే మెట్రోలో సీటు కోసం అరుదైన ఫీటు చేశాడు. అంతే ఆయన ఫీటు చూడగానే అందరూ.. మరీ ముఖ్యంగా ఆయనకు వెనుక, ముందర వున్న మహిళలు.. అందోళన చెంది. తమ సీట్లలోంచి లేచి పక్కకు వెళ్లిపోయారు. ఇంతలో కొందరు అతడ్ని కూర్చోమని చెప్పారు.

కొంతమంది పెద్దవాళ్లు బస్సు, రైలు ప్రయాణాల్లో వారికి అంత సౌకర్యంగా లేని సీట్లు లభిస్తే దానిని మార్చకోవడానికి ఏవో అబద్దాలు చెప్తుంటారు. కానీ ఓ యువకుడు తాను ప్రయాణిస్తున్న మెట్రో రైలులో ఆస్కార్ రేంజ్ యాక్టింగ్ చేశాడు. అయితే అది నటన.. లేక ప్రాంక్ వీడియో కోసమా అన్నది తెలియదు కానీ.. మొత్తానికి తాను అనుకన్నది సాధించినట్టు ముఖం పెట్టాడు. అయితే తాను ఎందుకిలా చేశాడో కూడా చెప్పదలచుకోలేదు. అంటే ఇది ప్రాంక్ వీడియో అని, లేదా తనకు నిజంగానే ఏదో జరిగిందన్న విషయాన్ని కూడా యువకుడు బయటపెట్టలేదు. అయితే తాను చేసిన యాక్టింగ్ వీడియో మాత్రం నెట్టింట్లో విపరీతంగా చక్కర్లు కొడుతోంది.

తాను ప్రయాణిస్తున్న మెట్రో రైలులో ఒక్కసారిగా ఫిట్స్ వచ్చినట్లు.. కరెంట్ షాక్ కొట్టినట్లు గిలగిలా కొట్టుకున్నాడు. అది నిజమే అని నమ్మిన ఓ యువతి లేచి సీటిచ్చింది.సీట్లో కూర్చుంటూ మళ్ళీ అలానే ప్రవర్తించాడు. దీంతో మిగతా ప్రయాణికులకు అనుమానం వచ్చింది. ఇది కేవలం సీటు కోసం ఆ యువకుడు ఆడిన నాటకంలా కనిపించింది. ఈ తతంగమంతా ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియోను చూస్తే ఇది కావాలనే చేసి వీడియో షూట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారనిపిస్తుంది. ఇది ఎక్కడ జరిగిందన్న వివరాలు మాత్రం తెలియరాలేదు.

 
 
 
View this post on Instagram

A post shared by Tube indian (@tube.indian)

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles