10 e-fraudsters arrested for Tata Safari 'gift' scam వాట్సాఫ్ లో ‘‘టాటా సఫారీ’’ గిప్టు.. వారంతా అరెస్టు..

10 fraudsters arrested for duping money luring people with tata safari

Tata Safari, Whatsapp groups, cyber fraudsters, e-commerce companies, ID card, Cyber Crime Police, Cyberabad, Tele marketing companies, Telangana

The Cyber Crime Police, Cyberabad have arrested 10 cyber fraudsters, including five from Telangana, who had cheated the public in the name of prize or gift from popular e-commerce or Tele marketing companies.

తస్మాత్ జాగ్రత్తా: వాట్సాఫ్ లో ‘‘టాటా సఫారీ’’ గిప్టు.. సైబర్ నేరగాళ్ల పోస్టు

Posted: 06/12/2021 04:59 PM IST
10 fraudsters arrested for duping money luring people with tata safari

సైబర్ మోసగాళ్లల్లో ఎదుటివారిని బురడీ కోట్టించే తెలివితేటలు అమోఘం. అయితే అవే తెలివిని సక్రమంగా వినియోగిస్తే.. వారు దేశానికి ఒక ఆస్తిగా మారుతారనడంలో. దేశాభివృద్దిలోనూ కీలక పాత్రపోషిస్తారనడంలో అతిశయోక్తి లేదు. కానీ ఆ తెలివి తేటలను కేవలం ఎదురువారి వ్యక్తిగత సమాచారంతో పాటు వారి సెల్ ఫోన్ లో దాచుకున్న సమాచారం మొత్తాన్ని చౌర్యం చేసి.. ఈజీగా మనీ సంపాదించడానికే వినియోగిస్తున్నారు. దీంతో తమకేదో ఆఫర్ వచ్చిందనుకునే సామాన్యులు ఆశగా సైబర్ నేరగాళ్ల తెలివితేటలకు బోల్తా పడతుంటారు.

ఈ మధ్యకాలంలో సైబర్ నేరగాళ్లు కొత్త పంథాను తొక్కుతున్నారు. పేదలు, మధ్యతరగతివారిని ఉచ్చులోకి లాగి తమ పబ్బం గడుపుకుంటారు. అందుకోసం... ఆఫర్లు, బంపర్ ప్రైజులు పేరిట ఎర వేస్తారు. ఎవరైనా తమ గాలానికి చిక్కుకుంటే వారిని నిలువుదోపిడీ చేస్తారు. ఇటీవల కాలంలో రకరకాలుగా మోసాలకు తెరలేపిన సైబర్ నేరగాళ్లు తాజాగా టాటా సఫారీ కారు మీదేనంటూ కొత్త ఎత్తుగడకు శ్రీకారం చుట్టారు. టాటా మోటార్స్ సంస్థ 30 మిలియన్ల వాహనాలు అమ్మిన సందర్భంగా ఓ సఫారీ వాహనాన్ని ఫ్రీగా అందిస్తోందని వాట్సాప్ గ్రూపుల్లో విపరీతంగా ప్రచారం చేస్తున్నారు.

సైబర్ నేరగాళ్లు ఇచ్చిన లింక్ పై క్లిక్ చేస్తే టాటా మోటార్స్ వెబ్ సైట్ కి కాకుండా, మరో పేజీకి వెళుతోంది. అక్కడ 4 ప్రశ్నలకు జవాబులు ఇవ్వాలంటూ కోరడం, ఆపై వ్యక్తిగత సమాచారం రాబడుతున్న విషయం వెల్లడైంది. ఆ పేజీలో పలువురు తమకు కారు బహుమానంగా వచ్చిందంటూ ఇతరులను నమ్మించేలా కామెంట్లు పెట్టడం కూడా చూడొచ్చు. అయితే అవన్నీ ఫేక్ ఐడీలేనట. ఇలాంటి ప్రకటనల పట్ల మోసపోవద్దని, వీటికి ఆకర్షితులైతే వ్యక్తిగత సమాచారాన్ని మోసగాళ్లకు అందించినట్టేనని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. అసలు, టాటా మోటార్స్ ఇలాంటి ఉచిత వాహనాల ప్రకటనే చేయలేదని వివరించారు. ఇలాంటి మోసపూరితమైన ప్రకటనల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

కాగా, ఈ టాటా సఫారీ సైబర్ నేరగాళ్ల రాకెట్ కు సంబంధించి సైబరాబాద్ సైబర్ పోలీసులు పది మందిని ఇప్పటికే అరెస్టు చేసి కటకటాల వెనక్కి పంపారు. పలు ఈ కామర్స్ సైట్లు, లేదా ప్రముఖ టెలీ మార్కెటింగ్ పేర్లతో వీరు సామన్యులను బురడీ కొట్టిస్తున్నారని పోలీసులు తెలిపారు. తమకు అందిన పిర్యాదు మేరకు ఈ ఏడాది మార్చి 1న ఐదుగురు తెలంగాణ వాసులతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన మరో ఐదుగురిని అరెస్టు చేశామని చెప్పారు. కాగా మరో ఐదుగురు తప్పించుకు తిరుగుతున్నారని తెలిపారు. అయితే అరస్టయిన పది మంది నుంచి 42 మొబైల్ ఫోన్లు, రెండు లాప్ టాప్ లు, 18 ఎన్వలప్ కవర్ల బండిళ్లు, నాప్ టల్ కవర్లు, స్ర్కాచ్ కార్డులు, 28 డెబిట్ కార్డులు, 10 ఆధార్ కార్డులు, రెండు రబ్బర్ స్టాంపులను కూడా స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles