Jazzy B’s Twitter account suspended in India రైతు దీక్షలకు మద్దుతు తెలిపిన ప్రముఖుల ట్విట్టర్ ఖాతాలు బ్లాక్

Twitter blocks jazzyb three others after indian govt s legal request

Twitter, jazzy b, New IT Rules, New IT Rules For Social Media India, Jazzy B instagram, who is jazzy b, Jazzy B farmers protest, farmers protest india, Jazzy B, Farmers Protest, India, India farmers, India farmers protest, india twitter, india twitter ban, jazzy b banned, jazzy b blocked, Twitter, Twitter Ban, twitter block, Canada, Entertainment, News, World

Punjabi singer Jazzy B, who has been a prominent voice in the ongoing farmers' protest, says he will continue to express his solidarity with people fighting for their rights after Twitter "withheld" his account in response to a legal demand in India.

రైతు దీక్షలకు మద్దుతు తెలిపిన ప్రముఖుల ట్విట్టర్ ఖాతాలు బ్లాక్

Posted: 06/09/2021 04:13 PM IST
Twitter blocks jazzyb three others after indian govt s legal request

కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వం సోషల్ మీడియా పగ్గాలను తమ చెక్కుచేతల్లో పెట్టుకోవాలని చూస్తన్న ప్రక్రియను చేపట్టి నూతన మార్గదర్శకాలను కూడా తీసుకువచ్చింది. ఈ క్రమంలో సోషల్ మీడియా దిగ్గజాలను తమ అదుపాజ్ఞనల మేరకు నడుచుకునేలా చర్యలను తీసుకుంది. ఎందుకింతలా పట్టుబట్టిందన్న విషయాలు ముందుగా అర్థం కాని దేశ ప్రజలకు నిదానంగా అంతా బోధపడుతున్నాయి, కేంద్రప్రభుత్వంపై వ్యతిరేకతను వ్యక్తం చేసేలా.. అలాంటి భావన ఉత్పన్నమయ్యేలా ఏ పోస్టు వచ్చినా.. దానిని ఏమాత్రం ఉపక్షించకుండా చర్యలు తీసుకోవడం కోసమేనని తాజా చర్యలతో అర్థమవుతుంది.

మరీ ముఖ్యంగా లక్షలాది ఫాలోవర్ుల వున్న ప్రముఖులు తమకు వ్యతిరేకంగా ఎలాంటి ట్వీట్లు పెట్టినా వాటిని తక్షణం తొలగించే చర్యల్లో బాగంగానే నూతన మార్గదర్శకాలను రూపోందించి వాటిని అమలుపర్చిందా అన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు నూతన వ్యవసాయ చట్టాల రద్దు కోరుతూ రైతులు చేస్తున్న ఉద్యమానికి మద్దతుగా పలువురు ప్రముఖులు చేసిన ట్వీట్లు చూసిన కేంద్రం వారి ఖాతాలపై చర్యలు తీసుకోవడంతోనే ఈ సందేహాలు ఉత్పన్నమయ్యేలా చేసింది. ట్వీట్లనే కాదు వారి ఖాతాలను కూడా ఖతం చేసింది.

గత ఆరున్నర నెలలుగా ఢిల్లీ సరిహద్దులో కేంద్రం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ దీక్ష చేస్తున్న రైతులకు మద్దతుగా ట్వీట్లు చేసిన నలుగురు ప్రముఖుల ఖాతాలను ట్విట్టర్ తొలగించింది. రైతు ఉద్యమంపై ట్వీట్లు చేస్తూ అలజడి రేపే ప్రయత్నం చేస్తున్నారన్న ప్రభుత్వ సూచనతో ట్విట్టర్ ఈ నిర్ణయం తీసుకుంది. ట్విట్టర్ నిలిపివేసిన ఖాతాల్లో పంజాబ్‌కు చెందిన ప్రముఖ ర్యాప్ సింగర్ జస్విందర్ సింగ్ బైన్స్ (కెనడా), హిప్ హాప్ కళాకారుడు సుఖ్‌దీప్ సింగ్ భోగల్ (ఆస్ట్రేలియా) సహా మరో ఇద్దరి ఖాతాలను ట్విట్టర్ సస్పెండ్ చేసింది.

పంజాబ్ లో పుట్టి కెనడాలో పెరిగిన జస్విందర్‌సింగ్ ‘క్రౌన్డ్ ప్రిన్స్ ఆఫ్ భాంగ్రా’గా పేరుకెక్కారు. ‘ఘగియన్ దా జొర్రా’, ‘హుస్నా ది సర్కార్’ వంటి పాటలు ఆయనకు విశేష ఆదరణ తెచ్చిపెట్టాయి. జస్విందర్‌, సుఖ్‌దీప్ సింగ్ ఇద్దరూ రైతు ఉద్యమానికి మద్దతుగా వరుసగా ట్వీట్లు చేస్తున్నారు. ఉద్యమం సందర్భంగా సంభవించిన మరణాలపై వీరు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ సూచనతో వీరి ఖాతాను ట్విట్టర్ నిలిపివేసింది. ఇక ఇదే అభియోగాలను మోపి వారిపై చర్యలు తీసుకునే అంశాన్ని కూడా కేంద్రం పరిశీలించే అవకాశాలు వున్నయోమో వేచి చూడాల్సిందే మరి.!

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles