Curfew in force from 6PM to 6 AM in Telangana తెలంగాణలో లాక్ డౌన్ పొడగింపు.. పెరిగిన సడలింపు సమయం

Lockdown extension for 10 more days curfew in force from 6pm to 6 am in telangana

coronavirus, covid 19, lockdown, telangana lockdown, lathicharge, police lathicharge, K chandrasekhar rao, m mahender reddy, Telangana lockdown, Hyderabad lockdown, Curfew replacing Lockdown, Strict Curfew in Telangana, Evening to morning curfew in telangana, CM KCR, cabinet meet, Telangana, Crime

Telangana Chief Minister K Chandrashekar Rao had extended the Lockdown for another 10 days. With this Lockdown in the State is extented up to 19th June. The decision was announced by the government after the cabinet meet concluded, The relaxation time is also extended upto 5PM. The Curfew from 6PM to 6 AM of next day for about 10 days.

తెలంగాణలో లాక్ డౌన్ పొడగింపు.. పెరిగిన సడలింపు సమయం

Posted: 06/08/2021 07:50 PM IST
Lockdown extension for 10 more days curfew in force from 6pm to 6 am in telangana

కరోనా వైరస్ రెండో దశ అత్యంత వేగంగా విస్తరిస్తున్న తరుణంలోనూ రాష్ట్రంలో లాక్ డౌన్ విధించే అవసరమే లేదని బీరాలు పోయిన ప్రభుత్వం.. క్రమంగా కేసులు సంఖ్య అంతకంతకూ పెరుగుతూ మృతుల సంఖ్య కూడా పెరగడంతో కట్టడికి చర్యలు తీసుకుంది. ఇందులో బాగంగా గత్యంతరం లేక రాష్ట్రంలో అకస్మాత్తుగా గత నెల 12న లాక్ డౌన్ విధిస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. తొలుత వారం రోజులు ఆ తరువాత పది రోజుల పాటు కేవలం ఉదయం ఆరు గంటల నుంచి పది గంటల వరకు సడలింపుతో లాక్ డౌన్ ప్రకటించగా రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభనకు కట్టడి పడింది. లాక్ డౌన్ ఫలితంగా రాష్ట్రంలో క్రమంగా కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పట్టాయి.

ఇక రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఇచ్చిన నివేదిక మేరకు గత నెల 31 నుంచి ఈ నెల 9 వరకు ఉదయం పూట ఆరు గంటల నుంచి మధ్యహ్నాం ఒంటి గంట వరకు ఆ తరువాత మరో గంట ఇళ్లకు చేరుకునేందుకు సడలింపులు కల్పిస్తూ మరో పది రోజుల పాటు లాక్ డౌన్ ను పోడగించింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో భేటీ అయిన మంత్రివర్గం లాక్ డౌన్ పోడగింపుపై నిర్ణయం తీసుకుంది. వైద్య అరోగ్యశాఖ అధికారులు ఇచ్చిన నివేదికను పరిశీలనలోకి తీసుకున్న మంత్రివర్గం మరో పది రోజుల పాటు రాష్ట్రంలో లాక్ డౌన్ విధిస్తున్నట్లు పేర్కోంది. ఈ క్రమంలో రాష్ట్రంలో మరింత సమయాన్ని సడలించారు.

ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు లాక్ డౌన్‌ను సడలిస్తూ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు గంటపాటు ఎవరి గమ్యస్థానాలకు వారు చేరుకునేందుకు వెసులుబాటు కూడా కల్పించాలని నిర్ణయించారు. సాయంత్రం 5 గంటల నుంచి తిరిగి ఉదయం 6 గంటల వరకు లాక్ డౌన్‌ నిబంధనలను కఠినంగా అమలు చేయాలని పోలీసు శాఖను కేబినెట్ ఆదేశించింది. కరోనా పూర్తిగా అదుపులోకి రాని సత్తుపల్లి, మధిర, నల్లగొండ, నాగార్జున సాగర్, దేవరకొండ, మునుగోడు, మిర్యాలగూడ, నియోజకవర్గాల పరిధిలో మాత్రం, లాక్ డౌన్‌ యథాతథంగానే కొనసాగించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : coronavirus  covid 19  lockdown  Curfew  KCR  telangana CM  cabinet meet  Telangana  crime  

Other Articles