TET qualifying certificate valid for lifetime: Ramesh Pokhriyal ఉపాధ్యాయ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.! టెట్ వ్యాలిటీడీ పొడగింపు

Validity of tet certificates extended from seven years to lifetime ramesh pokhriyal

TET certificates, TET, TET exam, TET exam certificates, TET Certificate validity, Ramesh Pokhriyal, Education Minister Ramesh Pokhriyal, Teachers Eligibility Test, education, job news, Union Education Minister, National Politics

The validity of the Teachers Eligibility Test (TET) qualifying certificates has been extended from seven years to lifetime, Union Education Minister Ramesh Pokhriyal "Nishank" announced. "The government has decided to extend the validity period of the TET qualifying certificates from seven years to lifetime with a retrospective effect from 2011," the minister said in a statement.

ఉపాధ్యాయ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.! టెట్ వ్యాలిటీడీ పొడగింపు

Posted: 06/04/2021 10:24 AM IST
Validity of tet certificates extended from seven years to lifetime ramesh pokhriyal

ఉపాధ్యాయ ఉద్యోగార్థులకు శుభవార్త అందింది. టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ( టెట్) విషయంలో టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది కేంద్ర ప్రభుత్వం. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఎప్పట్నించో చెబుతున్న టెట్, డీఎస్సీ నోటిఫికేషన్లు ఇప్పటి వరకు జాడ లేకుండానే పోయాయి. అయితే త్వరలోనే జెంబో నోటిఫికేషన్ ను ఇస్తామని ప్రకటించి కూడా ఏడాది కావస్తోంది. దీంతో ఆశలు పెంచుకున్న ఎందరో ఉద్యోగార్థులు దానిని టార్టెగ్ గా చేసుకుని పరీక్షలకు సిద్దం అవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఏడేళ్లకు ముందు టెట్ లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు డీఎస్సీ రాసేందుకు అనర్హులు.

ఎందకంటే ఇన్నాళ్లు ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) వ్యాలిడిటీ పీరియడ్ క్వాలిఫైయింగ్ సర్టిఫికెట్ ను 7 ఏళ్ల మాత్రమే. కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం దానిని పొడగించింది. ఇకపై ఒక్కసారి టెట్ లో ఉత్తీర్ణులైనా అభ్యర్తులు జీవితకాలం వరకు డీఎస్సీలతో పాటు ఉపాధ్యాయలుగా కొనసాగేందుకు అర్హులు. ఈ మేరకు కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుని ఉపాధ్యాయ ఉద్యోగార్థులకు శుభవార్తను అందించిన్నట్టు మంత్రి రమేశ్ తెలిపారు. 2011 నుంచి టెట్ పాసైన వారికి ఏడేళ్ల కాలపరిమితి ఉన్న సర్టిఫికేట్ గడువును జీవితకాలానికి పొడిగించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు మంత్రి రమేష్ పేర్కొన్నారు.

గతంలో టెట్ ఏడేళ్ల వ్యాలిడిటీ ముగిసిన వారికి కొత్తగా లైఫ్‌టైమ్ స‌ర్టిఫికెట్ ఇవ్వాల‌ని విద్యాశాఖ సూచించింది. నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ (NCTE) ప్రకారం.. ఫిబ్రవరి 11, 2011 నుంచి టెట్ అర్హత పరీక్షలో ఉత్తీర్ణత సాధించినవారికి ఏడేళ్ల నుంచి జీవితకాలనికి సర్టిఫికేట్ గడువును పొడిగిస్తున్నట్టు మంత్రి రమేశ్ వెల్లడించారు. 7 సంవత్సరాల వ్యవధి ఇప్పటికే ముగిసిన అభ్యర్థులకు కొత్త టెట్ సర్టిఫికెట్లను తిరిగి ధృవీకరించడానికి లేదా ఇవ్వడానికి సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు, యుటిలు అవసరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. బోధనా రంగంలో వృత్తిని సాధించాలనుకునే అభ్యర్థులకు ఉపాధి అవకాశాలను పెంచే దిశగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని రమేష్ పోఖ్రియాల్ అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles