TDP demands probe into threat to Judge Ramakrishna తండ్రి బ్యారెక్ లో కత్తి ఉందని జడ్జి రామకృష్ణ కుమారుడి అరోపణ

Judge ramakrishna son vamsi krishna alleges threat to his father

Chittoor Jail, Judge RamaKrishna, Vamsikrishna, suspicious fellow prisoner, Under trail prisoner, Knife, high level probe, Andhra Pradesh, Crime

Vamsi Krishna son of Judge RamaKrishna alleges threat to his father in Jail and expressed serious concern over the reports about a knife found in the barracks of the Chittoor jail in which Judge S Ramakrishna was held as an undertrial prisoner.

తండ్రి బ్యారెక్ లో కత్తి ఉందని జడ్జి రామకృష్ణ కుమారుడి అరోపణ

Posted: 06/01/2021 09:20 AM IST
Judge ramakrishna son vamsi krishna alleges threat to his father

ఆయన ఓ న్యాయమూర్తిగా విధులు నిర్వహించిన వ్యక్తి. ఆయన తన కుమారుడికి ఫోన్ చేసి.. తన బ్యారెక్ లో వున్న వ్యక్తి వద్ద కత్తి ఉందని, దీంతో తనను హతమార్చేందుకు కుట్ర జరుగుతుందని భయాందోళనతో చెప్పాడు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని, ముఖ్యమంత్రి జగన్ ను ఎదిరించేంతటి వ్యక్తివా.. నీ అంతు చూస్తానని కూడా బెదిరింపులకు పాల్పడ్డారని ఈ విషయాన్ని కూడా తన తండ్రి తమకు ఫోన్ ద్వారా సమాచారం అందించారని ఆయన కుమారుడు తెలిపారు. ఇంతకీ ఆ న్యాయమూర్తి ఎవరు.? అంటే జడ్జి రామకృష్ణ. ఆయన కుమారుడు ఇవాళ మీడియాతో తన తండ్రికి జైలులో ప్రాణహాని వుందని వంశీకృష్ణ అందోళన వ్యక్తం చేశారు,

తన తండ్రి నుంచి వచ్చిన ఓ ఫోన్‌కాల్ తమను ఆందోళనకు గురిచేస్తోందని, ఆయన బ్యారెక్ లోనే ఉంటున్న ఓ వ్యక్తి బెడ్డింగులో కత్తి బయటపడిందని వంశీకృష్ణ తెలిపారు. తన తండ్రిపై పెద్ద ఎత్తున కుట్ర జరుగుతోందని ఆయన అందోలన వ్యక్తం చేశారు. తనతో మాట్లాడుతుండగానే జైలు సిబ్బంది ఆయన నుంచి ఫోన్ లాక్కున్నారని అన్నారు. బ్యారక్ లో ఉన్న వ్యక్తి తన తండ్రిని బెదిరించాడని, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని, జగన్‌ను ఎదిరించేంతటి వాడివా?  నీ అంతు చూస్తానంటూ జడ్జి రామకృష్ణను ఇటీవల బెదిరించాడని వంశీకృష్ణ పేర్కొన్నారు. ఇప్పుడు అతడి వద్ద కత్తి దొరకడం పలు అనుమానాలకు తావిస్తోందన్నారు. తన తండ్రికి ప్రాణహాని ఉందంటూ ఇప్పటికే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సహా పలువురికి లేఖలు రాసినట్టు తెలిపారు.

రామకృష్ణకు ఏమైనా జరిగిన మంత్రి పెద్దిరెడ్డి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. మధ్యాహ్నం 12 గంటల తర్వాత జైలు అధికారులు తన తండ్రితో మరోసారి ఫోన్ చేయించి అక్కడ ఎలాంటి ఇబ్బందులు లేవని చెప్పించే ప్రయత్నం చేశారని వంశీకృష్ణ చెప్పారు. కాగా, రామకృష్ణ బ్యారక్‌లో కత్తి దొరికిందన్న వార్తలపై జైలు సూపరింటెండెంట్ వేణుగోపాల్‌రెడ్డి స్పందించారు. అది కత్తికాదని, మరుగుదొడ్డిలో పదునుగా ఉన్న ఓ ప్లాస్టిక్ ముక్కను చూసి రామకృష్ణ కత్తి అని అనుకున్నారని, అదే విషయాన్ని కుమారుడికి ఫోన్ చేసి చెప్పారని అన్నారు. బ్యారక్‌లో కత్తి దొరికిందన్న వార్తల్లో ఎంతమాత్రమూ వాస్తవం లేదని వేణుగోపాల్‌రెడ్డి కొట్టిపడేశారు. కాగా, ఈ అంశంపై ఉన్నతస్థాయి దర్యాప్తు జరపాలని టీడీపీ డిమాండ్ చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles