police shifted Anandaiah to secret place again ఆనందయ్యను మళ్లీ రహస్య ప్రాంతానికి తరలించనున్న పోలీసులు

Police shifted krishnapatnam anandaiah to secret place again

Anandaiah, Krishnapatnam Anandaiah, Ayurvedic practitioner Anandaiah, Herbal Medicine Anandaiah, Coronavirus medicine Anandaiah, Ayush Experts Anandaiah medicine, Nellore Anandaiah covid medicine, CVR Academy Anandaiah, Police Officials Anandaiah, coronavirus, covid-19, cororna medicine, secret place, nellore police, Anandaiah, Krishnapatnam, Nellore, Andhra Pradesh

The police officials once again shifted herbal medicine practitioner Anandaiah from Krishnapatnam to the CVR Academy in the early hours of Saturday. He was away from his house for the last one week as he was busy showing the process of making herbal medicine to the Ayush experts.

ఆనందయ్యను మళ్లీ రహస్య ప్రాంతానికి తరలించనున్న పోలీసులు

Posted: 05/29/2021 12:58 PM IST
Police shifted krishnapatnam anandaiah to secret place again

కరోనాకు ఆయుర్వేద మందును పంపిణీ చేసేన నెల్లూరు ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్యను వారం రోజుల తరువాత విడుదల చేసినట్లే చేసిన పోలీసులు.. ఆయనను మరోమారు ప్రత్యేక బందోబస్తు మధ్య ఈ తెల్లవారుజామున రహస్య ప్రాంతానికి తరలించారు. ఆయనను ఎక్కడికి తరలించారన్న విషయం తెలియకపోవడంతో స్థానికులు, కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదివరకే వారం రోజుల క్రితం ఆనందయ్యను అదుపులోకి తీసుకున్న పోలీసులు పోలిస్ స్టేషన్లో ఆ తరువాత మరో చోటుకు తరలించి తమ అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే.

అలా వారం రోజుల తరువాత తిరిగి ఇంటికి వచ్చిన ఆనందయ్యను చూసిన ఇరుగుపోరుగు వారు ఆనందం వ్యక్తం చేయడంతో ఆది కాస్తా కేవలం గంటల వ్యవధిలోనే అవిరైపోయింది. ఆనందయ్య కుటుంబసభ్యులు కూడా ఆయనను మరోమారు పోలీసులు రహస్య ప్రాంతానికి తరటించడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆయన భార్య కూడా పోలీసుల తీరు దారుణంగా వుందని చెప్పింది. వారం రోజుల పాటు ఎక్కడెక్కడో తిప్పిన ఆనందయ్యను ఇంటికి పంపించిన గంటల వ్యవధిలోనే మళ్లీ తీసుకెళ్లడంపై అమె పెదవి విరిచారు. ఆనందయ్యను ఇంట్లోనే ఉంచి పోలీసులు భద్రత కల్పించవచ్చు కాదా అని అన్నారు.

ఆనందయ్యకు రక్షణ పేరుతో తమకు దూరంగా వుంచుతున్నారని ఇదెక్కడి న్యాయమని అమె ప్రశ్నించారు. ప్రజలకు కరోనా మందు తయారు చేసి అందించడం కూడా నేరమేనా అని అమె నిలదీసారు. మరోవైపు, ఆనందయ్య కరోనా మందు కోసం వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున కృష్ణపట్నం వస్తున్న వారిని పోలీసులు అడ్డుకుని వెనక్కి పంపిస్తున్నారు. కాగా, ఆనందయ్య ఔషధంపై సోమవారం నివేదిక వచ్చే వరకు ఆయనను రహస్య ప్రాంతంలోనే ఉంచుతారని సమాచారం. మరోవైపు, కృష్ణపట్నంలో విధించిన 144 సెక్షన్ కొనసాగుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles