jabardasth hari in red sandal smuggling case వాంటెడ్ జాబితాలో జబర్ధస్త్ కమేడియన్ హరి పేరు

Police search on for jabardasth comedian hari in red sandal smuggling case

Jabardasth Haritha, jabardasth hari smuggling case, jabardasth hari smuggling, jabardasth hari red sandal, Jabardasth Haritha red Sandal, Jabardasth Hari red sandal smuggling, Tirupati, Sheshachalam forest, Jabardasth, Hari, Comedian, Haritha, Tirupati, Sheshachalam forest, smuggling, redwood sandal, Andhra Pradesh, Crime

Tirupati police search on for jabardasth comedian Hari in red sandal smuggling case in Sheshachalam forest, after a gang was held and had links with Hari.

పోలీసులు వాంటెడ్ జాబితాలోకి జబర్దస్త్‌ కమెడియన్‌ హరి పేరు..

Posted: 05/25/2021 06:11 PM IST
Police search on for jabardasth comedian hari in red sandal smuggling case

జబర్దస్త్ కామెడీ షోలో లేడీ గెటప్స్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న హరి పేరు మరోమారు పోలీసుల వాంటెడ్ లిస్టులోకి చేరింది. తిరుపతి శేషాచలం అడవుల్లో ఎర్రచందనాన్ని అక్రమంగా రవాణా చేస్తున్న కేసులో ఆయన పేరు మరోమారు తెరపైకి వచ్చింది. చిత్తూరు జిల్లా భాకరాపేట సమీపంలోని చీకిమానుకోన అటవీప్రాంతంలో ఎర్రచందనం స్మగ్లింగ్‌ జరుగుతుందన్న సమాచారం అందుకున్న అటవీశాఖ, పోలీసులు సంయుక్తంగా దాడులకు దిగారు. ఎనిమిది మంది స్మగ్లర్లను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అదే   సమయంలో జబర్దస్త్‌ హరి తప్పించుకున్నాడు. పరారైన హరి కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. పట్టుబడ్డ స్మగ్లర్ల నుంచి రెండు నాటు తుపాకులతో పాటు రూ.3 లక్షల విలువైన ఎర్రచందనం దుంగలను పోలీసులు సీజ్‌ చేశారు.

గతంలో ఒకసారి రెడ్‌శాండల్‌ స్మగ్లింగ్‌ కేసులో హరి పట్టుబడ్డాడు. అయితే తనను పోలీసులు కావాలనే ఈ కేసులో ఇరికిస్తున్నారని.. ఒక కానిస్టేబుల్ అక్రమంగా ఎర్రచందనం రవాణా చేస్తుంటే పోలీసులకు సమాచారం అందించానని… అదే కోపంతో అతడు తనపై ఇలా తప్పుడు కేసులు పెట్టించి ఇరికించాడని గతంలో తెలిపారు హరి. మరి ఈ కేసులో ఎలాంటి వివరణ ఇస్తాడో చూడాల్సి ఉంది. కాగా పోలీసులు మాత్రం తమ దర్యాప్తులో హరి స్మగ్లింగ్‌ కార్యకలాపాలు మానలేదని తెలిసిందన్నారు. ఆయనకు పలువురు స్మగ్లర్లతో సంబంధాలు ఉన్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

వాంటెడ్ జాబితాలో హరి .. టార్గెట్ గా మారిన హరిత

జబర్దస్త్ కామెడీ షోలో చిన్న చిన్న పాత్రలు చేసిన హరి ఎర్రచందనం కేసులో తన పేరు వచ్చిన నాటి నుంచి పెద్దగా కామెడీ షోలో కనిపించడం మానేశాడు. అయితే ఆయన సినిమాలకు ఫైనాన్స్ చేసే స్థాయికి ఎదిగాడని టాక్. షకలక శంకర్ హీరోగా తెరకెక్కిన ‘శంభో శంకర’ సినిమాతో ఫైనాన్షియర్ అవతారం ఎత్తిన ఆయన పలు చిత్రాలను ఫైనాన్స్ చేశాడని వార్తలు వినిపిస్తున్నాయి. కాగా శంభో శంకర చిత్రం షూటింగ్ సమయంలోనే ఎర్రచందనం కేసులో ఆయన అరోపణలు ఎదుర్కోని పోలిసు ఉన్నతాధికారుల ఎదుట లొంగిపోయారు. అయితే అభియోగాలు హరిపై నమోదవ్వగా తాజాగా హరిత మాత్రం అందరికీ టార్గెట్ గా మారింది.

హరి లేడి గెటప్ తో జబర్దస్త్ కామెడీ షోలోకి ఎంట్రీ ఇవ్వగా, ఇప్పుడు అదే పేరుతో మరో కమేడియన్ కూడా ఎంట్రీ ఇచ్చి.. అనతికాలంలోనే హాట్ డైలాగ్స్ తో పాటు ఏకంగా న్యాయనిర్ణేతలను టార్గెట్ చేస్తూ.. కవ్విస్తూ.. కన్నెలాగా నిజంగానే హయలు పలుకుతూ పాపులర్ అయిన హరి అలియాస్ హరితేజ అలియాస్ హరితను అటు మీడియా, ఇటు పత్రికలు టార్గెట్ చేశాయి. హరి అన్న పేరు ఇద్దరికీ ఉన్న నేపథ్యంలో హరికి బదులుగా ప్రస్తుతం లేడీ గెటప్ తో పాపులర్ అయిన హరిత ఫోటోను వాడేస్తూన్నారు. ఇక వీరికి తోడు సోషల్ మీడియాలో హరిత పోటోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి, దీంతో హరితేజకు కొత్త చిక్కులు వచ్చిపడ్డాయి, నిజానికి జబర్దస్త్ హరితేజకి ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదు. కానీ హరితేజకు అభిమానుల నుంచి ఫోన్లు వస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jabardasth  Hari  Comedian  Haritha  Tirupati  Sheshachalam forest  smuggling  redwood sandal  Andhra Pradesh  Crime  

Other Articles