Telangana Police seize vehicles of lockdown violators లాక్ డౌన్ ఉల్లంఘనలు: 17 వేల వాహనాలను సీజ్

Strict lockdown in telangana all entry exit points to hyderabad to be closed

lockdown, telangana lockdown, lathicharge, police lathicharge, hyderabad, anjani kumar, K chandrasekhar rao, m mahender reddy, Telangana lockdown, Hyderabad lockdown

People venturing on the roads were in for a rude shock as the police across the State intensified enforcement of lockdown measures after top brass warned people over social media to avoid unwarranted movement on the streets after 10 a.m. Seizure of more vehicles, booking cases and imposing penalties was seen as a change in the strategy of the Khakis.

లాక్ డౌన్ ఉల్లంఘనలు: 17 వేల వాహనాలను సీజ్ చేసిన పోలీసులు

Posted: 05/24/2021 01:54 PM IST
Strict lockdown in telangana all entry exit points to hyderabad to be closed

తెలంగాణలో లాక్ డౌన్ అమల్లో ఉన్నప్పటికీ యథేచ్ఛగా రోడ్లపైకి వస్తున్న వానహదారులకు పోలీసులు షాక్ ఇచ్చారు. లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించి అనవసరంగా రోడ్లపైకి వస్తున్న వారి వాహనాలను సీజ్ చేశారు. గత పది రోజుల వ్యవధిలో తెలంగాణ పోలీసులు ఏకంగా 17 వేల వాహనాలను జప్తు చేశారు. సడలింపు సమయం ముగిసిన తర్వాత రోడ్డుపైకి వస్తే కఠిన చర్యలు తప్పవని డీజీపీ మహేందర్‌రెడ్డి ఇటీవల హెచ్చరికలు జారీ చేశారు. ఇక అదే సమయంలో లాక్ డౌన్ నేపథ్యంలో రాష్ట్రంలోని ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాహనాలకు కూడా పోలీసులు బ్రేకులు వేశారు.

ఇతర రాష్ట్రాల నుంచి రాష్ట్రంలోకి ప్రవేశించే అన్ని రహదారులను పోలీసులు మూసివేశారు. ఇతర రాష్ట్రాలకు చెందిన వాహనాలు ఏవీ రాష్ట్రంలోని రాకుండా కట్టుదిట్టమైన చర్యలను చేపట్టారు. అన్ని ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్ల వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. అంతర్రాష్ట్ర సరిహద్దులైన సూర్యాపేట జిల్లా కోదాడ మండలం రామాపురం చెక్‌పోస్టు వద్ద  ఏపీ నుంచి వచ్చే వాహనాలను తెలంగాణ పోలీసులు అడ్డుకుంటున్నారు. ఈ-పాస్ ఉన్న వాహనాలను మాత్రమే అనుమతిస్తున్నారు. కర్నూలు నగర శివారులోని పుల్లూరు టోల్ ప్లాజా వద్ద కూడా తెలంగాణ పోలీసులు త‌నిఖీలు చేస్తున్నారు.

తెలంగాణలోకి ఈపాస్ లేకుండా వస్తోన్న‌ వారిని వెనక్కి పంపిస్తున్నారు. మరోసారి ఈ పాస్ లేకుండా వస్తే వాహనం సీజ్ చేస్తామని పోలీసులు చెబుతున్నారు. లాక్‌డౌన్ ఆంక్ష‌ల‌ను తెలంగాణ పోలీసులు క‌ఠిన‌త‌రం చేయ‌డంతో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌-తెలంగాణ సరిహద్దు వద్ద క‌ట్టుదిట్టంగా త‌నిఖీలు కొన‌సాగుతున్నాయి. పది గంటల తర్వాత రోడ్లపైకి వస్తే వాహనాలను జప్తు చేస్తామన్నారు. దీంతో పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. కారణం లేకుండా బయటకు వచ్చిన వారి నుంచి నిన్నటి వరకు ఏకంగా 17 వేల వాహనాలను పోలీసులు జప్తు చేశారు. మున్ముందు మరింత కఠినంగా వ్యవహరిస్తామని పోలీసులు పేర్కొన్నారు.

కారణం లేకుండా బయటకు వచ్చే వారి వాహనాన్ని తాత్కాలికంగా జప్తు చేసి వెయ్యి రూపాయల జరిమానా విధిస్తున్నారు. జరిమానా చెల్లించినా లాక్‌డౌన్ ఎత్తివేసిన తర్వాతే వాహనాన్ని ఇవ్వాలని పోలీసులు నిర్ణయించారు. మరోవైపు, లాక్‌డౌన్ సమయంలో రోడ్డు ప్రమాదాలు జరిగితే అందుకు కారకులైన వారిపై ఎపిడమిక్ డిసీజెస్ యాక్ట్ కింద కేసు నమోదు చేయాలని పోలీసులు యోచిస్తున్నారు. కాగా, మే నెల తొలి రెండు వారాల్లోనే రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటివి 4.31 లక్షల కేసులు నమోదయ్యాయి. మాస్కు ధరించని వారి నుంచి రూ. 31 కోట్లను జరిమానాగా వసూలు చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles