Never exported Covishield vaccines: SII CEO Adar Poonawalla కోవీషీల్డ్ వాక్సీన్లు అలా ఎగుమతి చేయలేదు: అదార్ పూనావాలా

Never exported covishield vaccines doses at cost of people in india sii ceo adar poonawalla

coronavirus, covid-19, Covishield, Adar Poonawalla, Serum Institute of India, covid vaccine, National, Politics

Adar Poonawalla, CEO of Serum Institute of India (SII) said that his company which is manufacturing the Covishield vaccine never exported the COVID vaccine doses at the cost of people in India and it remains committed to do everything it can in the support of the vaccination drive in the country.

దేశప్రజల ప్రాణాలు పన్నంగా పెట్టి కోవీషీల్డ్ ఎగుమతి చేయలేదు: అదార్ పూనావాలా

Posted: 05/18/2021 11:38 PM IST
Never exported covishield vaccines doses at cost of people in india sii ceo adar poonawalla

దేశంలో కరోనావైరస్ రెండోదశ విలయం సృష్టిస్తూ ప్రపంచంలో ఏ దేశంలోనూ నమోదుకాని సంఖ్యలో కేసులు నమోదు చేసుకుంటూ.. అధికసంఖ్యలో మరణాలను నమోదు చేసుకుంటూ మునుపెన్నడూ లేని గణంకాలను రికార్డు చేసకుంది. ఈ క్రమంలో దేశప్రజలు వాక్సీన్ తీసుకునేందుకు ఆసక్తి చూపగా, వాక్సీన్ కొరత ఏర్పడింది. దీంతో కేంద్రంలోని బీజేపి ప్రభుత్వంపై విమర్శల జడివాన కురిసింది. దీంతో ఈ విమర్శలపై సీరం ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా చీఫ్, కోవిషీల్డ్ వాక్సీన్ తయారీదారుడు ఆదార్ పూనావాలా స్పందించారు.

కొవీషీల్డ్ తయారుచేస్తున్న తమ సంస్థ.. దేశంలోని ప్రజల ప్రాణాలను పన్నంగా పెట్టి ప్రపంచంలోని ఏ దేశానికి తమ కోవిషీల్డ్ వ్యాక్సిన్లను ఎప్పుడూ ఎగుమతి చేయలేదని చెప్పింది. ఇండియాలో వ్యాక్సినేషన్ డ్రైవ్ రెండు మూడు నెలలో పూర్తయ్యేది కాదని అన్నారు. దేశ జనాభాకు టీకాలు తయారుచేయడానికి చాలా సమయం పట్టొచ్చని అన్నారు. కోవిషీల్డ్ సహా కోవాగ్జీన్ వాక్సీన్లు ఎమర్జెన్సీ వినియోగం అనుమతులు పోంది ఉత్పత్తులు ప్రారంభమై.. టీకాలు బయటకు వచ్చిన తరుణంలో దేశంలోని ప్రజలు వాటిని తీసుకునేందుకు ఏ మాత్రం ఆసక్తిని ప్రదర్శించలేదని తెలిపారు. దీంతో వాక్సీన్లను యుద్దప్రాతిపదికన చేస్తున్న ఉత్పత్తితో తమ స్టాక్ యార్డులు నిండిపోయాయని అన్నారు.

దీంతో చేసేది లేక గత ఏడాది కరోనా తొలిదశ ఉన్నప్పుడు ప్రభుత్వానికి తాము వాక్సీన్లు అందించామని, వాటిని కేంద్రమే ఎగుమతి చేసిందని అన్నారు. అయితే వ్యాక్సిన్లను విదేశాలకు పంపేందుకు కమిట్మెంట్ తీసుకున్న ప్రకారం ఇప్పుడు పంపించాలని ఆయన తెలిపారు, జనవరిలో వ్యాక్సిన్ల ఉత్పత్తి ప్రారంభం అయినప్పటికే ఇండియాలో కేసులు చాలా తక్కువగా ఉన్నాయి. అందుకే వ్యాక్సినేషన్ డ్రైవ్ సక్సెస్ ఫుల్ గా లాంచ్ చేయగలిగాం. అదే సమయంలో ఇతర దేశాలు సంక్షోభంలో ఇరుక్కుపోయి సాయం కోసం ఎదురుచూశాయి. అప్పుడే వీలైనంత సాయం చేశామని చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles