State to have six new medical colleges: KCR తెలంగాణలో ఆరు కొత్త మెడికల్ కాలేజీలు..

Six new medical colleges to come up in telangana kcr

Chief Minister KCR, new medical colleges, Sanga Reddy, Jagtiyal, Kothagudem, Wanaparty, Mancherial, Mahboobabad, Nursing colleges, regional sub centres, Siddipet, Wanaparthy, Mahbubabad, Suryapet, Nagarkurnool, Bhongir, Kothagudem, Gadwal, Vikarabad, Jagtial, Mancherial, Bhopalpally, coronavirus, covid-19, Telangana, Politics

Telangana Chief Minister K. Chandrashekar Rao has said that the state government will establish six new medical colleges in Sanga Reddy, Jagtiyal, Kothagudem, Wanaparty, Mancherial and Mahboobabad districts. The state government took this decision in view of the shortage of doctors and para medical staff reported in many government hospitals.

తెలంగాణలో ఆరు కొత్త మెడికల్ కాలేజీలు.. అనుబంధంగా నర్సింగ్ కాలేజీలు..

Posted: 05/18/2021 09:51 PM IST
Six new medical colleges to come up in telangana kcr

తెలంగాణలో ఆరు ప్రభుత్వ వైద్యకళాశాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సంగారెడ్డి, జగిత్యాల, కొత్తగూడెం, వనపర్తి, మంచిర్యాల, మహబూబాబాద్ జిల్లాల్లో కొత్తగా మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేయనున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు. కేవలం మెడికల్ కాలేజీలకు మాత్రమే పరిమితం కాకుండా ఈ మెడికల్ కాలేజీలకు అనుబంధంగా నర్సింగ్ కాలేజీలను కూడా ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసిన ఆయన వీటితో పాటు ఇప్పటికే ఉన్న వైద్య కళాశాలల్లో నర్సింగ్ కాలేజీలు లేని చోట్ల వాటిని మంజూరు చేయాలని ఆదేశించారు.

ప్రభుత్వ ఆస్పత్రుల్లో పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందనిద్రాక్షాగా మారిందన్న అరోపణల నేపథ్యంలో ఇకపై రాష్ట్రంలోని పేద, బీద ప్రజలందరికీ మెరుగైన వైద్యం. సకల సదుపాయాలతో అందేలా తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. అందుకోసం రాష్ట్రంలో ఆరు మెడికల్ కాలేజీలతో పాటు కొత్తగా 12 రీజినల్ సబ్ సెంటర్లు ఏర్పాటు చేయనున్నామని కేసీఆర్ ప్రకటించారు. ఈమేరకు ఆయన అదేశాలను జారీ చేశారు. సిద్దిపేట, వనపర్తి, మహబూబాబాద్, కొత్తగూడెం, నాగర్ కర్నూల్, సూర్యాపేట, భువనగిరి, జగిత్యాల, మంచిర్యాల, భూపాలపల్లి, వికారాబాద్, గద్వాల కేంద్రాల్లో రీజినల్ సబ్ సెంటర్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

ఈ ప్రాంతీయ ఉపకేంద్రాల ద్వారా రాష్ట్రంలోని పేద ప్రజలందరికీ అవసరమైన మందులతో పాటు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు వీలు కల్పించనున్నామని తెలిపారు. ఇక రాష్ట్రంలోనూ విజృంభిస్తున్న కరోనా మహమ్మారి..  ప్రజలకు పట్టి పీడిస్తోందని, అయితే కోవిడ్ బారిన పడిన రోగులను సింగరేణి, ఆర్టీసీ, సిఐఎస్ఎఫ్, సిఆర్పీఎఫ్, రైల్వే, ఆర్మీ, ఈఎస్ఐ సహా అందుబాటులో ఉన్న అన్ని ఆస్పత్రులలో సేవలు అందించడానికి అనుగుణంగా చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో కోవిడ్ బెడ్లు కేటాయించే విషయంతోపాటు, నిర్ణీత ధరలను నిర్ణయిస్తూ 11 నెలల క్రితమే ప్రభుత్వం 248 జీవోను విడుదల చేసిందన్నారు సీఎం కేసీఆర్.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles