Bandra-Worli Sea Link Shut as Cyclone Tauktae Approaches 'తౌక్టే' విలయం.. కేరళ, కర్ణాటకలో బీభత్సం.. వందలాది ఇళ్లు ధ్వంసం..

Cyclone tauktae rough sea high tidal waves destroy several houses in kerala

Indian Meteorological Department (IMD), cyclone, Cyclone Tauktae, Lakshadweep islands, Maldives, Kerala, Karnataka, Goa, Maharashtra, Gujarat, Telangana, Andhra Pradesh, crime

The India Meteorological Department (IMD) had said that the depression in the Arabian Sea intensified into a “very severe cyclonic storm” on May 17 and cross the Gujarat coast a day later. The impact of the cyclone will be felt in Lakshadweep islands, Maldives area, triggering heavy rainfall in Kerala, Karnataka, Goa, Maharashtra, Gujarat and also the coastal & adjoining districts of all these states.

‘తౌక్టే’ విలయం.. కేరళ, కర్ణాటకలో బీభత్సం.. వందలాది ఇళ్లు ధ్వంసం..

Posted: 05/17/2021 06:43 PM IST
Cyclone tauktae rough sea high tidal waves destroy several houses in kerala

అరేబియా సముద్రంలో లక్షద్వీస్ వద్ద ఏర్పడిన తౌక్టే తుపాను పెను తుపానుగా రూపాంతరం చేదింది. తీవ్రరూపం దాల్చిన తుపాను కేరళ, కర్ణాటక, గోవా రాష్ట్రాలలో పెను బీభత్సం సృష్టించింది. అనేక ఇళ్లను నేలకూల్చడంతో వేలాంది మంది నిరాశ్రయులను చేసింది. అల్పపీడనం శుక్రవారం వాయుగుండంగా, ఆ తరువాత తుపానుగా, ప్రస్తుతం పెను తుపానుగా మారింది. కేరళలో సముద్రం ముందుకు దూసుకువచ్చింది. అలల ఉధృతికి వందలాది ఇళ్లు ధ్వంసమయ్యాయి. కర్ణాటకలో ఏకంగా తీరప్రాంతంలోని అనేక గ్రామాలు తీవ్రంగా నష్టపోయాయి. కర్ణాటక, గోవాలలో తీవ్ర ఆస్తి నష్టంతో పాటు ప్రాణనష్టం కూడా సంభింవించింది. కర్ణాటకలో భారీ వర్షాల ధాటికి నలుగురు, గోవాలో ఇద్దరు మృతిచెందారు.

తుపాన్ ప్రభావంతో కేరళ, కర్ణాటక, గోవా, మహారాష్ట్ర, లక్షద్వీప్లలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ప్రస్తుతం ముంబైకి దక్షిణ నైరుతి దిశగా 320 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైన ఈ తౌక్టే తుపాను 24 గంటల వ్యవధిలో మరింత బలపడుతుందని భారత వాతావారణ శాఖ అధికారులు హెచ్చరించారు. అయితే ముంబైపై దీని ప్రభావం అధికంగానే వుంటుందని, మరో 24 గంటల వరకు భారీ వర్షాలు కురుస్తాయని సూచించారు. కాగా ఈ నెల 17న సోమవారం సాయంత్రం గుజరాత్ వద్ద తీరాన్ని తాకుతుందని, 18న పోర్ బందర్, మహువా మధ్య తీరం మధ్య తీరం దాటుంతుందని ఐఎండీ అధికారులు తెలిపారు. తుపాను తీరం దాటే సమయంలో గుజరాత్ లో అధికారులు ఎల్లో అలెర్ట్ ప్రకటించారు.

తీరం దాటే సమయంలో గంటలకు 150 నుంచి 170 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తీరప్రాంతంతో పాటు ప్రభావిత జిల్లాల ప్రజలు కూడా అప్రమత్తంగా వుండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. తీరం దాటే సమయంలో జునాగఢ్ లో మూడు మీటర్ల ఎత్తు వరకు, ఇతర తీర ప్రాంతాల్లో 1 నుంచి 2 మీటర్ల ఎత్తు వరకు అలలు ఎగిసిపడే అవకావాలు వున్నాయని తెలిపారు. తుపాను ప్రభావిత ప్రాంతాలలో ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి, వీరితో పాటు నేవీ, ఎయిర్ ఫోర్స్ బృందాలు కూడా రంగంలోకి దిగాయి. తీర, లోతట్టు ప్రాంతాలలో ప్రజలను ఇప్పటికే పునరావాస శిభిరాలకు తరలించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : IMD  Cyclone Tauktae  Lakshadweep islands  Kerala  Karnataka  Goa  Maharashtra  Gujarat  Telangana  

Other Articles