Kerala Police receive unusual e-pass request ఈ-పాస్ కావాలని ధరఖాస్తు.. ఠాణాకు పిలిపించి పోలీసుల విచారణ.!

Need to go for sex strange e pass request leaves kerala police shocked

Kannur application for E-Pass, E pass from Kannapuram, E pass for corona vaccine, coronavirus, E-pass, Romance, lockdown, Covid Crisis, Kannur, Valapattanam police, Kerala, Kerala police, covid-19

In an interesting event, a resident from Kannur's Kannapuram applied for an e-pass in order to out for 'sex'. The man wanted to visit Kannur in the evening. Needless to say, the police were surprised by the request application. The Valapattanam police were then asked to locate the individual, who was brought to the station for interrogation.

ఈ-పాస్ కావాలని ధరఖాస్తు.. ఠాణాకు పిలిపించి పోలీసుల విచారణ.!

Posted: 05/15/2021 11:47 PM IST
Need to go for sex strange e pass request leaves kerala police shocked

దేశంలో కరోనా వైరస్ మహమ్మారి సెకెండ్ వేవ్ విజృంభిస్తున్న తరుణంలో దానిని సాధ్యమైనంత వరకు నియంత్రించేందుకు అనేక రాష్ట్రప్రభుత్వాలు ఆయా రాష్ట్రాల్లో లాక్ డౌన్ విధించాయి. అత్యవసర వస్తువుల రవాణా, నిత్యావసర సరుకుల రవాణా సరఫరాకు మాత్రం ఎలాంటి ఆటంకం కలగకుండా చర్యలు తీసుకున్నారు. ప్రజలు ఇంట్లో నుంచి బయటకు రాకుండా చర్యలు చేపట్టారు. కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నాయి. ఇక అత్యవసర పరిస్థితుల్లో ఎవరైనా లాక్ డౌన్ లో ప్రయాణించాల్సి వుంటే వారిని పోలీసుల నుంచి అనుమతి తీసుకోవాలని సూచించారు. అందుకోసం ముందస్తుగా అనుమతి పోందాలని కూడా ఈ పాస్ వ్యవస్థను ప్రవేశపెట్టారు.

రాష్ట్రప్రజలు దరఖాస్తు చేసుకన్న అనుమతులను పరిశీలించిన తరువాత అత్యవసరమైన వారికి ఈ పాస్ ద్వారా అనుమతులు ఇస్తున్నారు. వాటిని పోందిన ప్రజలు వాటిని తమ వాహనాలకు అతికించుకుని ఆయా ప్రాంతానికి వెళ్లవచ్చు. అయితే కేర‌ళ‌లోని ఓ వ్య‌క్తి కూడా ఈ-పాస్ కోసం ద‌ర‌ఖాస్తు చేసుకున్నాడు. అంతే అతని ధరఖాస్తును పరిశీలించిన పోలీసులు.. అతడ్ని పోలిస్ స్టేషన్ కు పిలిపించి విచారించారు. ఆ తరువాత అదుపులోకి తీసుకున్నారు. అదేంటి ఇంతకీ అతను దరఖాస్తు చేసుకున్న ఈ పాస్ దేని గురించి. ఎక్కడికి వెళ్లాలని అన్న విషయం అర్థకాని స్థానికులు మాత్రం ఆశ్చర్యానికి గురయ్యారు. అయితే తీరా విషయం తెలిసిన తరువాత మాత్రం వీడి అసాధ్య కూల.. అంటూ శాఫనార్థాలు పెడుతున్నారు.

ఇంతకీ విషయం ఏమిటంటే.. అతను ఈ పాస్ కోసం ధరఖాస్తు చేసిన పత్రంలో ఓ చిత్ర‌మైన అభ్య‌ర్థ‌న చేశాడు. శృంగార కోసం బ‌య‌ట‌కు వెళ్లాల‌నుకుంటున్నాను.. దాని కోసం నాకు ఈ-పాస్ ఇవ్వండి అంటూ ఆ వ్య‌క్తి పోలీసుల్ని కోరాడు. క‌న్నూరులోని ఇరినేవ్ గ్రామ స్థానికుడు ఈ రిక్వెస్ట్ చేశాడు. దీంతో ఏసీపికి విషయం తెలియడంతో.. వాలాప‌ట్ట‌ణం పోలీసులకు సమాచారం అందించగా అత‌న్ని అదుపులోకి తీసుకున్నారు. ఎందుకిలా చేశావ్ అంటే.. అక్ష‌ర దోషం వ‌ల్ల త‌న అప్లికేష‌న్‌లో పొర‌పాటు జ‌రిగిన‌ట్లు స‌ద‌రు వ్య‌క్తి వివరణ ఇచ్చాడు. పోలీసుల‌కు క్ష‌మాప‌ణ కూడా చెప్పాడు. ఆంగ్లంలో సిక్స్ రాసేందుకు బదులు అలా తప్పుడా పడిందని చెప్పడంతో పోలీసులు అతడికి వార్నింగ్ ఇచ్చి పంపించేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles