TRS picks its candidate for Sagar bypoll సాగర్ ఉపఎన్నికకు టీఆర్ఎస్ అభ్యర్థి ఖరారు.!

Trs picks nomula bhagat as its candidate for nagarjuna sagar bypoll

Nomula Bhagat Kumar, Nagarjuna Sagar, By-poll, Nomula Narsimhaiah, JanaReddy, Congress, KCR, TRS, BJP, Telangana, Politics

Ending the suspense over its candidate for Nagarjuna Sagar bypoll, the TRS has decided to field Nomula Bhagat Kumar. Nomula Bhagat is the son of sitting MLA from the constituency, Nomula Narsimhaiah, who passed away three months ago. Bhagat will file his nomination papers on Tuesday.

నాగార్జున సాగర్ ఉపఎన్నికకు టీఆర్ఎస్ అభ్యర్థి ఖరారు.!

Posted: 03/29/2021 05:42 PM IST
Trs picks nomula bhagat as its candidate for nagarjuna sagar bypoll

ప్రముఖ కమ్యూనిస్టు నేతగా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన నోముల నర్సింహయ్య.. తన కఠోర కృషితో ప్రజల మనన్నలను పొంది ఎమ్మెల్యే స్థాయికి ఎదిగారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో టీఆర్ఎస్ లో చేరిన ఆయన నాగార్జున సాగర్ నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. దీంతో అక్కడి నుంచి ఎలాగైనా తాను విజయం సాధించాలని పూనుకున్నారు. దీంతో గత అసెంబ్లీ ఎన్నికలలో ఆయన అక్కడి నుంచి విజయం సాధించారు. ఇలా విజయం సాధించిన దానిని పూర్తిగా అస్వాదించకుండానే ఆయన అనారోగ్యం పాలై మరణించిన విషయం తెలిసిందే.

ఈ క్రమంలో నాగర్జున సాగర్‌ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక వచ్చింది. ఇక్కడి నుంచి అధికార పార్టీ ఎవరో ఒక ప్రముఖ వ్యక్తిని బరిలోకి దింపుదామని అలోచించింది. అందుకు గుత్తా సుఖేందర్ రెడ్డితో పాటు పలువురి పేర్లను కూడా పరిశీలించింది. ఈ క్రమంలో ఇవాళ టీఆర్‌​ఎస్‌ పార్టీ తమ అభ్యర్థిని ఖరారు చేసింది. నోముల నర్సింహయ్య కుమారుడు భగత్‌కు టీఆర్‌ఎస్‌ టికెట్‌ ఇచ్చింది. కాసేపట్లో భగత్‌కు సీఎం కేసీఆర్‌ బీ-ఫామ్‌ అందజేయనున్నారు. రేపు ఉదయం భగత్‌‌ తన నామినేషన్‌ వేయనున్నారు. కాగా నాగార్జున సాగర్‌ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య గతేడాది డిసెంబర్‌లో మృతి చెందడంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది.

ఇప్పటికే  కాంగ్రెస్‌ పార్టీ తమ అభ్యర్థిగా కుందూరు జానారెడ్డిని ప్రకటించింది. ఇక బీజేపీ తమ అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంది. సాగర్‌ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక నామినేషన్ల దాఖలుకు ఈ నెల 30 వరకు గడువు ఉంది. ఈనెల 31న నామినేషన్ల పరిశీలన.. ఏప్రిల్‌ 3 వరకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ఉంది. కాగా ఏప్రిల్‌ 17న నాగార్జున సాగర్‌ ఉప ఎన్నిక పోలింగ్‌ జరుగనుండగా, మే 2న ఫలితాలు వెలువడనున్నాయి. ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య(టీఆర్‌ఎస్‌) ఆకస్మిక మరణంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైన విషయం విదితమే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nomula Bhagat Kumar  Nagarjuna Sagar  By-poll  Nomula Narsimhaiah  JanaReddy  Congress  KCR  TRS  BJP  Telangana  Politics  

Other Articles