BJP MLA Arun Narang thrashed by farmers బీజేపి ఎమ్మెల్యును పరిగెత్తించి.. బట్టలు చించి..

Punjab anti farm law protestors attack bjp mla strip him naked after thrashing him

BJP MLA thrashed, Abohar BJP MLA thrashed, BJP MLA striped, Abohar BJP MLA striped, BJP MLA Arun Narang striped, BJP MLA Arun Narang thrashed, BJP MLA, Abohar, Arun Narang, Farmers protest, thrashed, striped, new Agriculture laws, Mukatsar district, government, police, punjab, Crime

Agitating farmers thrashed BJP MLA from Abohar Arun Narang at Malout in Mukatsar district. Farmers had opposed Narang, after heated exchange of words betweem MLA and farmer leaders, certain persons in the crowd allegedly started abusing Narang and attacked him. The reports said that clothes of Narang were torn and Police intervened to rescue him.

ITEMVIDEOS: బీజేపి ఎమ్మెల్యును పరిగెత్తించి.. బట్టలు చించి..

Posted: 03/27/2021 11:09 PM IST
Punjab anti farm law protestors attack bjp mla strip him naked after thrashing him

కొత్త వ్యవసాయ చట్టాలను బేషరుతుగా ఉపసంహరించుకోవాలని గత నాలుగు నెలలుగా ఉద్యమిస్తున్న ఉత్తరాధి రైతులు.. ఇల్లు, పిల్లలను వదిలేసి హస్తినలో తిష్టవేసి మరి ఉద్యమబాట పట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పంజాబ్ లోని ముకట్సర్ జిల్లాలోని మలౌట్ పట్టణంలో కేంద్రం తీసుకువచ్చిన సాగుచట్టాలకు మద్దతుగా మాట్లాడుతున్న ఎమ్మెల్యేపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఎమ్మెల్యేపై విచక్షణా రహితంగా దాడి చేశారు. ఎమ్మెల్యేను పరుగులు పెట్టించిన ఘటన పంజాబ్ లో చోటుచేసుకుంది. అక్కడ పోలీసులు ఉన్నా కూడా రైతులు వినకుండా ఎమ్మెల్యేను చితకబాదారు. తమకు విరుద్ధంగా వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు.

పంజాబ్‌లోని ముక్తాసార్‌ జిల్లా మాలోట్‌లో బీజేపీ ఎమ్మెల్యే అరుణ్‌ నారంగ్‌ పర్యటించారు. వ్యవసాయ చట్టాలకు మద్దతుగా పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటుచేశారు. ఈ విషయం తెలుసుకున్న రైతు సంఘాల నాయకులు కార్యాలయానికి చేరుకున్నారు. కార్యాలయాన్ని ముట్టడించి కేంద్ర ప్రభుత్వం, ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం పెద్ద ఎత్తున కార్యాలయంలోకి వెళ్లి ఎమ్మెల్యేను బయటకు తీసుకొచ్చారు. రైతులను చూసి ఎమ్మెల్యే నారంగ్‌ అక్కడ ఉన్న ఓ దుకాణంలోకి వెళ్లారు. పోలీసులు ఆయనకు రక్షణ కల్పించేందుకు పరుగెత్తారు. వారి వెంట రైతులు కూడా వెళ్లారు.

ఎమ్మెల్యే నారంగ్ పై రైతులు ముప్పేటా దాడి చేశారు. కర్రలు పట్టుకుని వెంటపడ్డారు. దీంతోపాటు ఎమ్మెల్యేపై నల్ల ఇంకు చల్లారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బట్టలు చిరిగిపోయాయి. ఇక అగ్రహం అపుకోని రైతు సంఘాలలోని కొందరు ఆయన బట్టలను కూడా లాగేసి చించేశారు. ఆయనను నగ్నంగా నిలబెట్టారు. వెంటనే పోలీసులు కల్పించుకుని రైతులను చెదరగొట్టి వెంటనే ఎమ్మెల్యే నారంగ్‌ను ఓ దుకాణంలోకి లోపలికి పంపించి రక్షించారు. అనంతరం రైతులు బీజేపీ కార్యాలయంపై దాడి చేశారు. ఈ సందర్భంగా కార్యాలయానికి నిప్పు పెట్టారు. దీంతో అక్కడి పరిసరాలు ఉద్రిక్తంగా మారాయి. ఈ ఘటనలో రైతులపై కేసులు నమోదు చేసినట్లు సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles