devotees throng to Shiva Temples in Telugu states శివనామస్మరణతో మార్మోగుతున్న శైవక్షేత్రాలు

Devotees throng to shiva temples in telugu states on shiva ratri

Shiva Ratri, Srisailam, SriKalaHasti, Vemulavada, Kaleshwaram, Keesara, Devotees, Shiva Temples, Historic Shivalayas, Telangana, Andhra Pradesh

On the Occassion of Shiva Ratri, the Divine and auspicious day the devotees of Telangana and Andhra Pradesh throng to Shiva Temples since midnight to have Lord Shiva Darshan and to offer prayers.

శివనామస్మరణతో మార్మోగుతున్న శైవక్షేత్రాలు

Posted: 03/11/2021 11:54 AM IST
Devotees throng to shiva temples in telugu states on shiva ratri

శివరాత్రిని పురస్కరించుకుని తెలుగురాష్ట్రాల్లో భక్తులు వేకువ జాము నుంచే దేవాలయాలకు వెళ్లి అదిదేవుడి దర్శనాన్ని చేసుకుంటూ.. ప్రత్యేక పూజలు చేస్తున్నారు. భక్తుల తాకిడితో తెలుగురాష్ట్రాలలోని శైవక్షేత్రాలన్ని భక్తులతో కిటకిటలాడుతూ.. శివనామస్మరణతో మారుమ్రోగుతున్నాయి. తెలుగురాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ప్రముఖ ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలతో పాటు శివాలయాల్లో మహాశివరాత్రి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. కలియుగ కైలాసంగా ప్రసిద్ది చెందిన కర్నూలులోని సుప్రసిద్ద శైవక్షేత్రం శ్రీశైలంలో భక్తులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు.

శ్రీశైల మల్లన్నతో పాటు భ్రమరాంభిక అమ్మదారిని దర్శించుకునేందుకు భక్తుల తాకిడి పెరిగడంతో దేవాలయ కమిటీ సభ్యులు రాత్రి రెండు గంటల నుంచే శివయ్య దర్శనానికి భక్తులను అనుమతిస్తున్నారు. అటు శ్రీకాళహస్తిలోనూ వాయులింగేశ్వరస్వామి ఆలయం, అమరావతిలోని అమరలింగేశ్వర స్వామి దేవాలయానికి భక్తులు పోటేత్తారు. ఇటు కర్నూలులోని మహానంది, గుంటూరు జిల్లాలోని కోట్టప్పకోండలోని త్రికూటేశ్వర స్వామి ఆలయాలకు తెల్లవారుజామునుంచే భక్తుల తాకిడి పెద్దసంఖ్యలో మొదలైంది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దేవాలయ కమిటీలు అన్ని ఏర్పాట్లు చేశాయి. ఇటు ఆంధ్రప్రదేశ్ లోని పంచారామక్షేత్రాలకు కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి పూజలు నిర్వహిస్తున్నారు.

ఇటు తెలంగాణలోని శైవక్షేత్రాలకు కూడా భక్తులు పెద్ద సంఖ్యలో పోటెత్తారు. తెల్లవారుజాముకు ముందునుంచే భక్తులు పవిత్ర ఫుణ్యక్షేత్రాలకు చేరుకుని శివయ్యకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తూన్నారు. శివయ్య దర్శనానికి గంటల కొద్దిసమయం పడుతున్నా.. క్యూలైన్లలోని భక్తులు ఓం నమఃశివాయః, హరహర మహాదేవ శంబో శంకర అంటూ శివనామస్మారణలు చేస్తూన్నారు. వేములవాడ రాజన్న దేవాలయం, కీసర రామలింగేశ్వరస్వామి దేవాలయం, కాలేశ్వర ముక్తేశ్వర స్వామి దేవాలయం,  రామప్ప దేవాలయాలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వేములవాడ రాజన్నకు పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం ఆయన ప్రత్యేక పూజలు చేశారు. వేదపండితులు ఆయనకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఇటు కీసర రామలింగశ్వేర దేవాలయంతో పాటు బీరంగూడ భ్రమరాంభికా మల్లిఖార్జున స్వామి దేవాలయాలకు భక్తులు ఉదయం నుంచే పెద్ద సంఖ్యతో తరలివచ్చి స్వామి, అమ్మవార్ల ధర్శనాన్ని చేసుకుంటున్నారు. అయితే వేములవాడ రాజన్న దేవాలయంలో మాత్రం భక్తుల నుంచి పిర్యాదులు వెల్లువెత్తాయి. అధికారుల కుటుంబాలకు వీఐపి దర్శనాన్ని కల్పిస్తూ.. తమను మాత్రం గంటల తరబడి క్యూలైన్లలో వేచివుండేలా చేస్తున్నారని భక్తులు పిర్యాదు చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles