Election Commission orders removal of West Bengal DGP Virendra మమతకు ఈసీ షాక్.. డీజీపీ వీరేంద్రపై బదిలీ వేటు..

Ashok gajapathi raju beats up woman party worker during campaigning for local polls

Mamata Banerjee, Director General of Police, DGP, Virendra, P Nirajnayan, Jawed Shamim, ADG (Law and Order), Jagmohan, Trinamool Congress, BJP, West Bengal, Politics

The Election Commission ordered removal of Virendra as the Director General of Police of poll-bound West Bengal with immediate effect, and appointed P Nirajnayan in his place.

మమతకు ఈసీ షాక్.. డీజీపీ వీరేంద్రపై బదిలీ వేటు..

Posted: 03/10/2021 12:53 PM IST
Ashok gajapathi raju beats up woman party worker during campaigning for local polls

పశ్చిమ బెంగాల్ లో కాషాయ పార్టీ ఎన్ని ప్రయత్నాలు చేసినా.. అధికారంలోకి మాత్రం మళ్లీ మమత సర్కారే వస్తుందని.. ముచ్చటగా మూడవసారి హ్యాట్రిక్ కొడుతుందని ప్రీపొల్ సర్వేలు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపి ఇక్కడ తాము ఎలాగైనా అధిపత్యం దక్కించుకోవాలని పావులు కదులపుతోంది. మొత్తంగా నాలుగు రాష్ట్రాలు. ఒక కేంద్రపాలిత ప్రాంతంలో జరగనున్న ఎన్నికలలో ఎక్కడా లేని విధంగా ఎనమిది విడతలుగా ఎన్నికల నిర్వహిణతోనే తొలి అడుగువేసిందన్న అరోపణలు వినిపించాయి. ఇక తాజాగా పశ్చిమ బెంగాల్ డీజీపీని అకస్మాత్తుగా బదిలీ చేస్తూ సీఎస్ కు లేఖ రాయడంతో రెండవ అడుగు వేసిందన్న వార్తులు వినిపిస్తున్నాయి.

పశ్చిమ బెంగాల్ లోని మమత సర్కార్ అదేశాలను తూచా తప్పకుండా పాటిస్తూ.. రాష్ట్రంలో బీజేపిని కట్టడి చేయడానికి డీజీపీ వీరేంద్ర అదేశాలతో పోలీసుశాఖను చర్యలు చేపట్టిందని, ఈ క్రమంలోనే రాష్ట్రంలో బీజేపి నేతలు, శ్రేణులపై దాడులు కూడా జరిగాయని ఆయా పార్టీ నేతల పిర్యాదులతో స్పందించిన కేంద్ర ఎన్నికల సంఘం ఆయనను అకస్మాత్తుగా బదిలీ చేసింది. ఇంతవరకు బాగానే వున్నా ఆయన స్థానంలో ఎవరిని నియమించాలో కూడా ఎన్నికల సంఘం నిర్ధేశించడం ఇప్పడు చర్చనీయాంశంగా మారింది. ఆయన స్థానంలో ఆ హోదాకు అర్హులైన వ్యక్తులతో పాటు ప్రస్తుతం ఆయన కిందిస్థాయిలో బాధ్యతలను నిర్వహించే అధికారులను నియమించడం పరిపాటి.

అయితే అలాకాకుండా వీరేంద్ర స్థానంలో 1987 బ్యాచ్ పశ్చిమ బెంగాల్ కేడర్ కు చెందిన పి.నీరజ్ నయన్ ‌‌ను డీజీ అండ్ ఐజీపీ (అడ్మినిస్ట్రేషన్)గా నియమిస్తూ అదేశాలను జారీ చేసింది. రాష్ట్రంలో పరిస్థితిని సమీక్షించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్టు  ఎన్నికల కార్యదర్శి రాజేశ్ కుమార్ తెలిపారు. కాగా, బదిలీ చేసిన వీరేంద్రకు ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ ఎన్నికలతో సంబంధం ఉన్న ఎలాంటి బాధ్యతలు ఇవ్వొద్దని సీఎస్‌కు రాసిన లేఖలో ఈసీ ఆదేశించింది. ఎనమిది విడతల వారి ఎన్నికలకు మరికొన్ని రోజల వ్యవధిలో వెళ్లనున్న పశ్చిమ బెంగాల్ అకస్మాత్తుగా ఈ పరిణామాలు చోటుచేసుకోవడం తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతకు షాక్ ఇచ్చేందుకేనని వార్తలు వినిపిస్తున్నాయి.

డీజీపీ వీరేంద్రను తక్షణం బదిలీ చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అలపన్ బంద్యోపాధ్యాయ్ కు కేంద్ర ఎన్నికల సంఘం లేఖ రాసింది. డీజీపీ వీరేంద్ర అధికార తృణమూల్ కాంగ్రెస్ కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని పలు పార్టీల నుంచి.. మరీ ముఖ్యంగా బీజేపి నుంచి రావడంతోనే కేంద్ర ఎన్నికల సంఘం ఈ మేరకు ఆఘమేఘాల మీద నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. కాగా 1985 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన వీరేంద్ర మే 2018లో పశ్చిమబెంగాల్ డీజీ అండ్ ఐజీపీగా బాధ్యతలు చేపట్టారు. కొన్ని రోజుల క్రితమే జావేద్ షామిన్‌ను ఏడీజీ (లా అండ్ ఆర్డర్) నుంచి తప్పించిన ఈసీ ఆయన స్థానంలో ఐపీఎస్ అధికారి జగ్‌మోహన్‌ను నియమించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles