AP High Court gives green signal to municipal elections ఏపీలో పాత నోటిఫికేషన్ తోనే పురపాలకల బరిలోకి..: హైకోర్టు

Ap high court gives green signal to municipal elections dismisses 16 petitions

Muncipal elections, AP High Court, municipal corporations, N. Ramesh Kumar, AP Panchayat elections 2021, AP Muncipal elections 2021, AP Muncipal results, AP Muncipal election, AP Muncipal election results, Andhra Pradesh Muncipal elections 2021, AP Muncipal elections, JanaSena, BJP, TDP, Congress, opposition parties, Andhra pradesh, Politics

The High Court, which was hearing 16 petitions seeking quashing of the notification issued by the SEC and reissue new schedule has stuck down all the petitions and made it clear that it could not interfere as the election process had already begun.

ఏపీలో పాత నోటిఫికేషన్ తోనే పురపాలక బరిలోకి..: హైకోర్టు

Posted: 02/26/2021 04:01 PM IST
Ap high court gives green signal to municipal elections dismisses 16 petitions

ఆంధ్ర ప్రదేశ్ లో గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వంతో ఏర్పడిన పోరపచ్చాలు తొలగిపోవడంతో పంచాయతీ ఎన్నికలు ముగిసిన వెనువెంటనే మున్సిపల్ ఎన్నికలకు నగరా మ్రోగించింది రాష్ట్ర ఎన్నికల సంఘం. దీంతో రాష్ట్రంలో పురపాలక సంఘాల ఎన్నికల నిర్వహణకు షెడ్యూలును ప్రకటిస్తామని ప్రకటించింది. కాగా పాత నోటిఫికేషన్ అధారంగానే రాష్ట్రంలోని 12 మున్సిఫల్ కార్పోరేషన్లకు, 75 పురపాలక సంఘాలకు ఒకే రోజున ఎన్నికలు జరగనున్నాయని.. అవసరమైన చోట 13న రీపోలింగ్ పెడతామని కూడా ప్రకటించారు. ఇక 14న ఎన్నికల కౌంటింగ్ చేపట్టిన వెనువెంటనే ఫలితాలను ప్రకటిస్తామని వెల్లడించారు.

అయితే పురపాలక సంఘాల ఎన్నికలకు నూతన నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ జనసేన పార్టీ సహా దాదాపుగా 16 పిటీషన్లు హైకోర్టులో దాఖలయ్యాయి. సుమారు 14 నెలల క్రితం విడుదల చేసిన నోటిఫికేషన్ తో ఇప్పుడు ఎన్నికలను నిర్వహించడంపై రాష్ట్రోన్నత న్యాయస్థానంలో పిటీషన్ దాఖలయ్యాయి. అయితే వీటిన్నింటిపై ఇవాళ విచారణ చేపట్టిన న్యాయస్థానం 16 పిటీషన్లను కోట్టివేసింది. రాష్ట్రంలో పురపాలక సంఘాల ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో ఈ అంశంలో తాము జోక్యం చేసుకోలేమని హైకోర్టు స్పష్టం చేసింది.

గత ఏడాది కరోనా మహమ్మారి విజృంభన నేపథ్యంలో ఈ ఎన్నికల ప్రక్రియ నిలిచిన విషయం తెలిసిందే. దీంతో ఎక్కడ నిలిచిపోయిందో అక్క‌డి నుంచే ఎన్నికలను కార్యక్రమాలను కొన‌సాగించాల‌ని నిర్ణయం తీసుకున్న రాష్ట్ర ఎన్నికల సంఘం.. మొత్తం 12 మునిసిపల్‌ కార్పొరేషన్లు, 75 మునిసిపల్‌, నగర పంచాయతీలకు ఎన్నికలు నగారాను మ్రోగిస్తూ షెడ్యూల్ విడుదల చేసింది. ఇక ఎన్నికలను నిర్వహించేందుకు అటు రాష్ట్ర ప్రభుత్వం కూడా సుముఖంగానే వున్న నేపథ్యంలో ఈ ఎన్నికల నిర్వహణ ప్రక్రియపై తాము స్టే విధించలేమని తేల్చిచెప్పింది. ఈ క్రమంలో నామినేషన్ ఉపసంహరణ మార్చి 3న మధ్యాహ్నం 3 గంటల వరకు విధించగా, ఆ తరువాత అభ్యర్థులంతా పోటీలో వున్నట్లే.

అయితే నోటిఫికేషన్ ప్రకారం 12 నగరపాలక సంస్థల్లో 6,563 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖ‌లు చేశారు. అలాగే, 75 పురపాలక, నగర పంచాయతీల్లోనూ వార్డు స్థానాలకు 12,086 మంది నామినేషన్లు వేశారు. దీంతో నామినేషన్ల గడువుకు ముగిసిన నేపథ్యంలో కేవలం ఉపసంహరణలు, ఎన్నికలు, కౌంటింగ్ తేదీలను మాత్రమే నిర్వహించనుంది. మ‌రోవైపు, ప్రస్తుతం పంచాయతీలకు ఎన్నికలు జ‌రుగుతున్నాయి. తొలి రెండు ద‌శ‌ల ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌ పూర్తయింది. ఈ నేప‌థ్యంలో మునిసిప‌ల్ ఎన్నిక‌ల‌కు కూడా ఎస్ఈసీ సిద్ధ‌మ‌యింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Muncipal elections  AP High Court  SEC  N. Ramesh Kumar  YSRCP  TDP  JanaSena  BJP  Andhra pradesh  Politics  

Other Articles