ZP Chairman nephew Bittu Srinu held in lawyer couple case న్యాయవాదుల హత్య కేసులో పుట్టా మధు మేనల్లుడి అరెస్ట్

Telangana lawyer couple murder ex trs mla s relative bittu srinivas picked up

Veldi Vasantha Rao, Kunta Srinivas, Akkapaka Kumar, Bittu Srinu, Murder, Lawyer Couple, Telangana High Court, Chief Justice Telangana High court, Justices Hima Kohli, HIgh Court Division Bench, Justice B. Vijaysen Reddy, Gattu Vaman Rao, PV Nagamani, Manthani, Ramagundam Police, Telangana, crime

In an extensive investigation into the brutal murder of lawyer couple, Gattu Vaman Rao and his wife PV Nagamani, Ramagundam police picked up Bittu Srinu for his alleged involvement. The cops booked Veldi Vasantha Rao, Kunta Srinivas and Akkapaka Kumar under Sections 120 (b), 341, 302, and 34 under the Indian Penal Code.

న్యాయవాదుల హత్య కేసులో పుట్టా మధు మేనల్లుడి అరెస్ట్

Posted: 02/19/2021 03:01 PM IST
Telangana lawyer couple murder ex trs mla s relative bittu srinivas picked up

తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనంగా మారిన న్యాయవాద దంపతుల కేసులో మరో నిందితుడ్ని పోలీసులు ఇవాళ అరెస్టు చేశారు. నిందితుల్లో ఒకరైన బిట్టు శ్రీనును అదువులోకి తీసుకున్నట్టు డిసీసీ రవిందర్ వెల్లడించారు. నిందితుడు పెద్దపల్లి జెడ్పీ చైర్ పర్సెన్ పుట్ట మధు మేనల్లుడు. న్యాయవాదుల హత్యకు సంబంధించిన బట్టు శ్రీను నిందితులకు వాహనం, కొబ్బరి బోండం నరికే కత్తులను సమకూర్చినట్టు అభియోగాలు ఎదర్కోంటున్నాడు. ఇప్పటికే పోలీసుల అధుపులో వున్న నిందితులు ఇచ్చిన సమాచారం మేరకు బిట్టు శ్రీనును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

న్యాయం గెలవాలని, ధర్మో రక్షతి రక్షితః అన్న నానుడిని అనుసరించి.. తమ దృష్టికి వచ్చిన అన్యాయాలు, అక్రమాలపై పోరాడుతున్న న్యాయవాద దంపతులు పలు వ్యవహారాల్లో తమకు అడ్డుకుంటున్నారని.. వారిని అంతం చేయాలన్న పథకాన్ని రచించిన నిందితుల్లో ఇతను కూడా ఒక్కడని పోలీసులు అనుమానిస్తున్నారు. పథకంలో భాగంగా నిందితులకు వాహనం, ఆయుధాలను సమకూర్చింది బిట్టు శ్రీను అని.. ఇదివరకే ఈ కేసులో అరెస్టయిన నిందితులు ఇచ్చిన సమాచారం మేరకు అతడ్ని పోలీసులు అదుపులోకి తీసుకన్నట్లు సమాచారం.

దీంతో న్యాయవాద దంపతులు గట్టు వామన్ రావు, పివి నాగమణిల హత్యకేసులో ఇప్పటి వరకు నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పుట్ట మధు తన తల్లి పేరున నిర్వహించే చారిటీ పనులతో పాటు ట్రస్ట్ బాధ్యతలన్నింటినీ బిట్టు శ్రీనివాస్ చూసుకుంటాడని తెలుస్తోంది. కాగా, మంధనిలోని ఓ పండ్ల వ్యాపారి నుంచి తీసుకువచ్చిన బిట్టు శ్రీను.. వాటిని కుంట శ్రీనివాస్ కు అందజేశారని పోలీసులు సమాచారం అందింది. ఆ పండ్ల దుకాణం కూడా ఓ ప్రజాప్రతినిధికి చెందినది సమాచారం. ఈ విషయాన్ని నిర్థారించుకునే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. కాగా అరెస్టు చేసిన నలుగురిని ఇవాళ పోలీసులు న్యాయస్థానంలో ప్రవేశపెట్టనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles