AP govt to move to HC on SEC orders on Minister ఎస్ఈసీ అదేశాలపై హైకోర్టును ఆశ్రయించిన పెద్దిరెడ్డి

Sec directs dgp to house arrest minister till completion of panchayat polls

State Election Commissioner, N Ramesh Kumar, SEC Restrictions on MInister, DGP Gautam sawang, Minister for Panchayat Raj, Peddireddi Ramachandra Reddy, Gram Panchayat Elections, DGP, confinement to residence, High court, Andhra Pradesh, Politics

Amaravati: State Election Commissioner N Ramesh Kumar directed the Director General of Police to confine Minister for Panchayat Raj and Rural Development Peddireddi Ramachandra Reddy to his residential premises till the completion of elections to gram panchayats, which will conclude by February 21.

ఎన్నికల సంఘం అదేశాలపై హైకోర్టును ఆశ్రయించిన పెద్దిరెడ్డి

Posted: 02/06/2021 04:02 PM IST
Sec directs dgp to house arrest minister till completion of panchayat polls

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ, గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఎన్నికలు ముగిసే వరకు ఇంటికి మాత్రమే పరిమితం అయ్యేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘం డీజీపీ గౌతమ్ సవాంగ్ ను అదేశించింది. ఆయన మీడియా ముఖంగా అధికారులకు జారీ చేసిన హెచ్చరికల నేపథ్యంలో ఎన్నికల సంఘం ఈ మేరకు చర్యలకు ఉపక్రమించింది. కనీసం మంత్రి మీడియాతోనూ మాట్లాడనివ్వకుండా చర్యలు తీసుకోవాలని సూచించింది. పంచాయతీ ఎన్నికలు నిర్వహించే అధికారులను ఆయన ప్రభావితం చేస్తారన్న నేపథ్యంలో ఆయనపై చర్యలు చేపట్టింది.

ఈ ఆంక్షలు రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు ముగిసే వరకు అనగా ఈ నెల 21 వరకు కోనసాగుతాయని ఎన్నికల సంఘం తేల్చిచెప్పింది. పంచాయతీ ఎన్నికలు సజావుగా సాగేందుకు ప్రజలందరూ నిర్భయంగా ఓటు వేసేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది. ఈ మేరకు రాష్ట్ర డీజీపీకి ఎన్నికల సంఘం లేఖ రాసింది. మంత్రి ఇటీవల తిరుపతి కేంద్రంగా అధికారులను హెచ్చరిస్తూ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. అధికారులు ఎస్ఈసీ మాటకు కట్టుబడితే.. ఆయన విరమణ తరువాత చర్యలు తప్పవని పెద్దిరెడ్డి హెచ్చరించారు.

ఇదిలావుండగా, ఎస్ఈసీ అదేశాలు వెలువడిన వెంటనే మంత్రి పెద్దిరెడ్డి స్పందిస్తూ.. తాను ఇంట్లో వున్నా.. కార్యాలయంలో వున్నా జరిగేది జరగక మానదని, రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాలు పూర్తిగా సీఎం సంక్షేమ పథకాలకు అకర్షితులయ్యారని అన్నారు. పథకాలు పొందుతున్నవాళ్లు.. ప్రభుత్వానికే ఓటు వేస్తారని అన్నారు. రాష్ట్రంలో మెజారీటీ గ్రామపంచాయతీల్లో వైసీపీ బలపర్చిన అభ్యర్థులే అధికారంలోకి వస్తారని అన్నారు. ఇదిలావుండగా.. ఎస్ఈసీ అదేశాలపై రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో హౌజ్ మోషన్ పిటీషన్ దాఖలు చేసింది. పంచాయతీ రాజ్ ఎన్నికలు జరుగుతున్న క్రమంలో అదేశాఖకు చెందిన మంత్రిని గృహనిర్భంధంలో ఉంచడం ఎంతవరకు సమంజమని పిటీషన్ లో పేర్కోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles