TRS supporting BJP to win Tamil Nadu elections ‘‘తమిళనాడు ఎన్నికలపై సర్వే చేసిన తెలంగాణ ఇంటెలిజెన్స్’’

Trs supporting bjp to win tamil nadu elections revanth reddy

TN election Incharge kishan reddy, Revanth on Kishan Reddy, TRS BJP secret pact, Telangana Intelligence surveyed TN Elections, Revanth Reddy, Malkajgiri MP, KCR, TRS, BJP, Kishan Reddy, Tamil Nadu Elections, Telangana Intelligence, Congress, Telangana, Politics

Congress party Malkajgiri MP Revanth Reddy alleged that Telangana Chief Minister K Chandrashekar Rao is behind the appointment of Bharatiya Janata Party leader Kishan Reddy as the election in-charge in Tamil Nadu. Revanth Reddy alleged that TRS and BJP are having a secret pact and TRS party sending Telangana intelligence officials to Tamil Nadu to support BJP in the elections.

‘‘తమిళనాడు ఎన్నికలపై సర్వే చేసిన తెలంగాణ ఇంటెలిజెన్స్’’: రేవంత్ రెడ్డి

Posted: 02/04/2021 11:54 AM IST
Trs supporting bjp to win tamil nadu elections revanth reddy

కేంద్రంలోని బీజేపి అదేశాలతో రాష్ట్రంలోని కేసీఆర్ సర్కార్ తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలపై సర్వే చేసేందుకు రాష్ట్ర ఇంటెలిజెన్సు అధికారులను ఆ రాష్ట్రానికి పంపిందని తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి అరోపించారు. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి చెందిన ఇంటెలిజెన్స్ అధికారులను ఆ రాష్ట్రానికి పంపించి అక్కడి పరిస్థితులను అధ్యయనం చేసి.. వాటిన అంచనా వేసిన తరువాత రూపోందించే నివేదికను బట్టే బీజేపి అభ్యర్థులను బరిలోకి దింపనుందని తమకు నిర్థిష్ట సమాచారం అందుతుందని ఆయన తెలిపారు.

రాష్ట్రం నుంచి కేంద్రమంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్న కిషన్ రెడ్డితో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకునే నేపథ్యంలోనే ఆయనకు తమిళనాడు ఎన్నికల ఇంచార్జ్ పదవిని బీజేపి కట్టబెట్టిందని, అందుకు కూడా తెరవెనుక కారణం కేసీఆర్ అని ఆయన అరోపించారు. గెలిచే అవకాశాలు వున్న చోట్ల తమ అభ్యర్థులకు బరిలో దింపేందుకు ఇంటెలిజెన్స్  నివేదిక అవసరపడుతోంది. మన రాష్ట్రానికి చెందిన అధికారులను ఇతర రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులపై అధ్యయనం చేయడానికి పంపే ఈ మొత్తం వ్యవహారంపై సమగ్ర విచారణ జరపాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.

బీజేపి, టీఆర్ఎస్ పార్టీలు ఒకే ఠాను ముఖ్కలని.. అక్కడ అన్నాడీఎంకేతో కలిసి పోటీచేస్తున్న బీజేపి ఇక్కడ మాత్రం టీఆర్ఎస్ తో రహస్య స్నేహం పాటిస్తుందని ఆయన పేర్కోన్నారు. అవినీతి కేసులను అడ్డం పెట్టుకుని ప్రధాని మోడీ.. కేసీఆర్ ను లొంగదీసుకున్నారని అరోపించారు. ఢిల్లీ పర్యటన సందర్భంగా బీజేపీకి సహకరిస్తానని ప్రధాని మోదీతో కేసీఆర్ ఒప్పందం కుదుర్చుకున్నారని అన్నారు. తమిళనాడు ఎన్నికలకు బీజేపీకి కేసీఆర్ నిధులను సమకూరుస్తున్నారని అరోపించారు. తెలంగాణ బీజేపి అధ్యక్షుడు బండి సంజయ్, ఎంపీ అరవింద్ లు ఆటలో అరటిపండ్లవారని విమర్శించారు. కేసీఆర్ ను జైలుకు పంపుతామన్న వారు.. ఆయనపై ఒక్క కేసు కూడా నమోదు చేయలేదని రేవంత్ విమర్శించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles