NBW against TRS MLA Vinay Bhaskar టీఆర్ఎస్ ఎమ్మెల్యేపై నాన్ బెయిలెబుల్ వారెంట్ జారీ

Non bailable warrant against trs mla vinay bhaskar

Non Bailable Warrant TRS MLA, Non Bailable Warrant on Dasyam Vinay Bhaskar, Special Court issues NBW on TRS MLA, Rail Roko cases, Telangana statehood, seperate state hood agitation, Kazipet court issues NBW on TRS MLA, Non Bailable Warrant, TRS MLA, Dasyam Vinay Bhaskar, Kazipet Special Court, Rail Roko, Telanagana agitation, Telangana, Politics

A Non Bailable Warrant is issued against Ruling TRS party MLA Dasyam Vinay Bhaskar by the Special Court in connection with Rail Roko cases filed against him and 8 others during seperate state hood agitation.

టీఆర్ఎస్ ఎమ్మెల్యేపై నాన్ బెయిలెబుల్ వారెంట్ జారీ

Posted: 01/27/2021 07:05 PM IST
Non bailable warrant against trs mla vinay bhaskar

భాధ్యతాయుతమైన శాసనసభ్యుడిగా కొనసాగుతూ.. న్యాయస్థానంలో వున్న పెండింగ్ కేసుల విచారణకు గైర్హజరు అవుతున్న ప్రజాప్రతినిధులకు ప్రత్యేక న్యాయస్థానం నాన్ బెయిలెబుల్ వారెంట్ జారీ చేసింది. అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన వరంగల్ ఎమ్మెల్యే ద్యాసం వినయ్ భాస్కర్ పై ప్రత్యేక న్యాయస్థానం నాన్ బెయిలెబుల్ అరెస్టు వారెంట్ జారీ చేసింది. 2012 నాటి కేసులో కోర్టు విచారణకు గైర్హాజరవుతూ వస్తున్న ఆయనపై ఈ మేరకు న్యాయస్థానం వారెంట్ జారీ చేసింది.

ఆయనతోపాటు మరో 8 మంది ప్రజాప్రతినిధులకు కూడా ఎన్బీడబ్యూలు జారీ చేసింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో భాగంగా 2012లో నమోదైన కేసులో న్యాయస్థానం ఈ నిర్ణయం తీసుకుంది. తొమ్మిదేళ్లుగా విచారణ జరుగుతున్న ఈ కేసులో అభియోగాలు ఎదుర్కోంటున్న నేతలు న్యాయస్థానాలకు హాజరు కాకపోవడంతో వేచి చూసిన న్యాయస్థానం ఎట్టకేలకు ప్రజాప్రతినిధులై వుండి న్యాయస్థానంలో పెండింగ్ లో వన్న కేసుల విచారణకు గైర్హజరవుతున్న నేతలపై నాన్ బెయిలేబుల్ అరెస్టు వారెంట్లు జారీ చేసింది.

ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమం పతాకస్థాయిలోకి చేరిన నేపథ్యంలో తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరామ్ పిలుపు మేరకు రైల్ రోకో కార్యక్రమాన్ని తెలంగాణ వ్యాప్తంగా నిర్వహించారు. అందులో భాగంగా వినయ్ భాస్కర్‌ సహా మరికొందరు ప్రజాప్రతినిధులు కాజీపేట రైల్వే స్టేషన్ లో రైలు రోకో కార్యక్రమం చేపట్టారు. దీంతో అప్పట్లో వీరిపై కేసులు నమోదయ్యాయి. ఈ కేసును ప్రజాప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం విచారణ జరుపుతోంది. అయితే, ఈ కేసులో నిందితులుగా ఉన్నవారెవరూ విచారణకు హాజరుకాకపోవడంతో కోర్టు తాజాగా, వారందరికీ నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్లు జారీ చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles